ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో చాలా కాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ సంస్థ రంగంలోకి దిగుతోంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా రోడ్‌స్టర్ సిరీస్ ఎలక్ట్రిక్ బైక్లను ఇటీవల విడుదల చేసింది. ఇది ఈవీ తయారీదారు నుంచి మొదటి ఎలక్ట్రిక్ బైక్‌గా వస్తోంది. అలాగే దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఒకటిగా నిలిచింది ఓలా రోడ్‌స్టర్ ఎక్స్.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్, రివోల్ట్ ఆర్వీ 1 వంటి ఎలక్ట్రిక్ మోడళ్లతో పాటు ఐసీఈ విభాగంలో స్థిరపడిన దిగ్గజ ప్లేయర్లకు సైతం గట్టి పోటీని ఇస్తోంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మంచి పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా రోడ్‌స్టర్ ఎక్స్‌ని హోండా షైన్ 125తో పోల్చి, ఏది బెటర్? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ తొలుత రూ .75,000 - రూ .95,000 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉండగా.. ఫిబ్రవరి 1 తర్వాత దీనిని రూ .90,000 - రూ .1.10 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెంచారు. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ మూడు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. అవి.. 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్, 4.5 కిలోవాట్.
బేస్ వేరియంట్ ధర గతంలో రూ .75,000 (ఎక్స్-షోరూమ్) కాగా, ఇప్పుడు దీని ధర రూ .90,000 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. మిడ్ వేరియంట్ 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. దీని ధర రూ .1 లక్ష (ఎక్స్-షోరూమ్). టాప్-ఎండ్ వేరియంట్ 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. దీని ధర రూ .1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఇక 2025 హోండా షైన్ 125 డ్రమ్ వేరియంట్ ధర రూ .84,493, డిస్క్ వేరియంట్ ధర రూ .89,245 (ఎక్స్-షోరూమ్).
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ 7 కిలోవాట్ మోటార్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. బేస్ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 117 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. మిడ్ వేరియంట్ గరిష్టంగా గంటకు 117 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగా, టాప్ ఎండ్ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 124 కిలోమీటర్లు. ఈ రెండు వేరియంట్లు ఫుల్ ఛార్జ్ చేస్తే వరుసగా 159 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
హోండా షైన్ 125 బైక్ ఇప్పుడు ఓబీడీ-2బీ కంప్లైంట్ ఇంజిన్ని పొందుతుంది. ఈ బైక్ 123.94 సీసీ, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, ఎయిర్-కూల్డ్ మోటారును ఉపయోగిస్తుంది. ఇది 7,500 ఆర్పీఎం వద్ద 10.6 బీహెచ్పీ పవర్‌ని, 6,000 ఆర్పీఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
సంబంధిత కథనం