Electric bike : 250 కి.మీ రేంజ్​- ధర రూ.1లక్ష లోపే! ఓలా ఎలక్ట్రిక్​ బైక్​పై బిగ్​ అప్డేట్​..-ola roadster x electric bike starts arriving at dealerships deliveries to begin soon ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Bike : 250 కి.మీ రేంజ్​- ధర రూ.1లక్ష లోపే! ఓలా ఎలక్ట్రిక్​ బైక్​పై బిగ్​ అప్డేట్​..

Electric bike : 250 కి.మీ రేంజ్​- ధర రూ.1లక్ష లోపే! ఓలా ఎలక్ట్రిక్​ బైక్​పై బిగ్​ అప్డేట్​..

Sharath Chitturi HT Telugu

Ola Roadster X delivery : ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​ కోసం ఎదురుచూస్తున్న వారికి అప్డేట్​! ఈ మోడల్​ సంస్థకు చెందిన డీలర్​షిప్స్​ షోరూమ్స్​కి చేరుకుంటోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓలా ఎలక్ట్రిక్​ బైక్ ఇదిగో.. (Twitter/@GowthamaSeenu)

మచ్​ అవైటెడ్​ ఓలా ఎలక్ట్రిక్​ తొలి బైక్​పై కీలక అప్డేట్​! ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ బైక్​ డీలర్​షిప్​ షోరూమ్స్​కి చేరుకోవడం ప్రారంభించింది. కాబట్టి, బ్రాండ్ త్వరలోనే ఈ-బైక్​ డెలివరీలను ప్రారంభిస్తుందని అంచనాలు మొదలయ్యాయి. రోడ్​స్టర్ ఎక్స్ ఉత్పత్తిని ఇటీవల ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​..

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్​ బైక్​ మూడు ప్రత్యేకమైన వేరియంట్లలో లభిస్తుంది. ప్రతి ఒక్కటి వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​తో వస్తుంది. ఓలా రోడ్​స్టర్ ఎక్స్ బ్యాటరీ కాన్ఫిగరేషన్లు 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్, 4.5 కిలోవాట్లు. ఎంచుకున్న బ్యాటరీ ప్యాక్​తో సంబంధం లేకుండా, అన్ని వేరియంట్లు ఒకే 7 కిలోవాట్ల మిడ్-మౌంటెడ్ మోటార్​తో పనిచేస్తాయి.

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ఎంట్రీ లెవల్ మోడల్ 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది. ఇది సిరీస్​లో అత్యంత సరసమైన ఎంపిక. దీని ధర రూ .74,999 (ఇంట్రొడక్టరీ- ఎక్స్-షోరూమ్). ఈ వేరియంట్​ని ఫుల్ ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​ మిడ్-రేంజ్ వేరియంట్ 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని కలిగి ఉంది. దీని ధర రూ .84,999 (ఇంట్రొడక్టరీ- ఎక్స్-షోరూమ్). బేస్ మోడల్​తో పోలిస్తే ఇది ఫుల్ ఛార్జ్​తో 196 కిలోమీటర్ల మెరుగైన రేంజ్​ని అందిస్తుంది. ఈ పెద్ద బ్యాటరీ వేరియంట్ 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 118 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ప్రీమియం మోడల్ 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని కలిగి ఉంది. ఇది రూ .94,999 (ఇంట్రొడక్టరీ- ఎక్స్-షోరూమ్)కు లభిస్తుంది. ఈ వేరియంట్ అత్యధిక బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది పూర్తి ఛార్జ్ చేస్తే 252 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. ఇది 3.1 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మిడ్-రేంజ్ వేరియంట్ మాదిరిగానే గరిష్టంగా గంటకు 118 కిలోమీటర్ల వేగాన్ని ఈ-బైక్​ కలిగి ఉంటుంది.

ఎలక్ట్రిక్​ బైక్​ ఫీచర్స్​..

సస్పెన్షన్ విషయానికొస్తే, ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్​ బైక్​ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రేర్​లో డ్యూయల్ షాక్ అబ్జార్బర్​లను అమర్చారు. ఈ మోటార్ సైకిల్​లో 18 ఇంచ్​ ఫ్రెంట్​ అల్లాయ్ వీల్, 17-ఇంచ్​ రేర్​ అల్లాయ్ వీల్ ఉన్నాయి. ఈ రెండూ ట్యూబ్​లెస్ టైర్లతో వస్తాయి. ఇది 180 ఎం.ఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తుంది. ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ప్రతి వేరియంట్ 4.3-ఇంచ్​ ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్ ప్యానెల్​ని కలిగి ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రివర్స్ మోడ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా అన్ని వేరియంట్లలో బ్రేక్ బై వైర్ టెక్నాలజీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్ ఉన్నాయి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం