సింగిల్​ ఛార్జ్​తో 250 కి.మీ రేంజ్- ఈ ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ కొనేందుకు ఇదే రైట్​ టైమ్​.. భారీగా బెనిఫిట్స్​-ola roadster x electric bike offered with huge benefits for the first 5 000 buyers see details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సింగిల్​ ఛార్జ్​తో 250 కి.మీ రేంజ్- ఈ ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ కొనేందుకు ఇదే రైట్​ టైమ్​.. భారీగా బెనిఫిట్స్​

సింగిల్​ ఛార్జ్​తో 250 కి.మీ రేంజ్- ఈ ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ కొనేందుకు ఇదే రైట్​ టైమ్​.. భారీగా బెనిఫిట్స్​

Sharath Chitturi HT Telugu

ఓలా రోడ్​స్ట్ర్​ ఎలక్ట్రిక్​ బైక్​ని కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?​ అయితే ఇది మీకోసమే! ఈ మోడల్​ డెలివరీలు ఇటీవలే ప్రారంభం కాగా.. సంస్థ ఇప్పుడు కొన్ని విలువైన బెనిఫిట్స్​ని కూడా అందిస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓలా రోడ్​స్టర్​ ఎక్స్

ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​ డెలివరీలు ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ బైక్​పై మంచి బెనిఫిట్స్​ని ఇస్తోంది ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ. ఈ ఈ-బైక్​పై రూ. 10వేల విలువైన ఇనీషియల్​ బెనిఫిట్స్​ని సంస్థ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లు పరిమితం అని గుర్తుపెట్టుకోవాలి.! మొదటి 5,000 మంది రైడర్లకు మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ కింద బ్యాటరీకి ఫ్రీ ఎక్స్​టెండెడ్​ వారంటీ, మూవ్ఓఎస్+ కు ఉచిత సబ్​స్క్రిప్షన్, ద్విచక్ర వాహనంతో ఉచిత 'ఎసెన్షియల్ కేర్' సర్వీస్​ వంటి మూడు ప్రయోజనాలను ఓలా ఎలక్ట్రిక్​ అందిస్తోంది.

'ఎసెన్షియల్ కేర్' సేవలో 18 పాయింట్ల ఇన్​స్పెక్షన్​​ ఉంటుంది. దీనిలో భద్రత- పనితీరు కోసం సమగ్ర తనిఖీలు జరుగుతాయి. బ్రేకులు, టైర్లు, యాక్సిల్ సహా ఇతర వాటి కోసం సమగ్ర సర్వీసింగ్ కవరేజీతో పాటు నిజమైన భాగాలు, ప్రొఫెషనల్​ కేర్​ హామీ కూడా ఇందులో ఉంది.

రోడ్​స్టర్​ ఎక్స్ ఓలా ఎలక్ట్రిక్ ఫ్యూచర్​ఫ్యాక్టరీలో తయారు అవుతోంది. వినియోగదారులు ఎలక్ట్రిక్ బైక్​ని వారి సమీప అధీకృత డీలర్షిప్​షోరూమ్​లో కొనుగోలు చేసుకోవచ్చు.

ఓలా రోడ్ స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్​ బైక్​ ఫీచర్లు ఏమిటి?

ఓలా రోడ్​స్టర్​ ఎక్స్ ప్రతి వెర్షన్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించే 4.3 ఇంచ్​ ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్ ప్యానెల్​తో వస్తుంది.

అదనంగా, అన్ని వెర్షన్లలో బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ హార్డ్​వేర్ ఏంటి?

ఓలా రోడ్​స్టర్ ఎక్స్​ని టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్​లతో డిజైన్ చేశారు. ఇందులో 18 ఇంచ్​ ఫ్రెంట్​ అల్లాయ్ వీల్, 17 ఇంచ్​ రేర్​ అల్లాయ్ వీల్ ఉన్నాయి. రెండూ ట్యూబ్​లెస్ టైర్లను కలిగి ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్​ బైక్​ 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్​ను కలిగి ఉంది.

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ వేరియంట్లు ఏంటి?

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్​​ మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. ప్రతి ఒక్కటి వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​తో వస్తుంది. రోడ్​స్టర్ ఎక్స్ కోసం అందుబాటులో ఉన్న బ్యాటరీ కాన్ఫిగరేషన్లు 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్, 4.5 కిలోవాట్. ఎంచుకున్న బ్యాటరీ పరిమాణంతో సంబంధం లేకుండా, అన్ని వేరియంట్లు ఒకే 7 కిలోవాట్ల మిడ్-మౌంటెడ్ మోటారును ఉపయోగిస్తాయి.

ఓలా రోడ్​స్టర్ ఎక్స్​ బేస్ వేరియంట్ ఏం అందిస్తుంది?

ఓలా రోడ్​స్టర్​ ఎక్స్ ఎలక్ట్రిక్​ బైక్​ బేస్ మోడల్ 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని కలిగి ఉంది. ఇది లైనప్​లో అత్యంత సరసమైన ఎంపిక. దీని ధర రూ .74,999 (ఇంట్రొడక్టరీ మరియు ఎక్స్-షోరూమ్). ఈ వేరియంట్ ఫుల్ ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ మిడ్-స్పెక్ వేరియంట్ ఏం అందిస్తుంది?

మిడ్-రేంజ్ మోడల్ 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని కలిగి ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .84,999. ఇది బేస్ మోడల్​ను అధిగమించి ఫుల్ ఛార్జ్ చేస్తే 196 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. ఈ అప్​గ్రేడెడ్ బ్యాటరీతో, మోటార్ సైకిల్ కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 118 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ టాప్-స్పెక్ వేరియంట్ ఏం అందిస్తుంది?

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ఈ-బైక్​ ప్రీమియం వేరియంట్ 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని కలిగి ఉంది. దీని ధర రూ .94,999 (ఇంట్రొడక్టరీ ఎక్స్-షోరూమ్). ఈ మోడల్ అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో నిలుస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 252 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. ఇది కేవలం 3.1 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మిడ్-రేంజ్ వేరియంట్ మాదిరిగానే గరిష్టంగా గంటకు 118 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం