Electric scooters : ఓలా ఎలక్ట్రిక్ నుంచి కొత్త హై పర్ఫార్మెన్స్​, లాంగ్​ రేంజ్​ ఈ-స్కూటర్లు..-ola electric working on six new electric two wheelers launch in post q2 fy26 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooters : ఓలా ఎలక్ట్రిక్ నుంచి కొత్త హై పర్ఫార్మెన్స్​, లాంగ్​ రేంజ్​ ఈ-స్కూటర్లు..

Electric scooters : ఓలా ఎలక్ట్రిక్ నుంచి కొత్త హై పర్ఫార్మెన్స్​, లాంగ్​ రేంజ్​ ఈ-స్కూటర్లు..

Sharath Chitturi HT Telugu

Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ ఆరు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సిద్ధం చేస్తోందని సమాచారం. ఇందులో హై పెర్ఫార్మెన్స్​, లాంగ్​ రేంజ్​ ఈవీలు ఉంటాయని తెలుస్తోంది. ఇవి ఎఫ్​వై26 రెండో భాగంలో లాంచ్​ అవ్వొచ్చు.

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

ఓలా ఎలక్ట్రిక్​కి సంబంధించి ఒక బిగ్​ అప్డేట్​ మార్కెట్​లోకి వచ్చింది! ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని విడా, టీవీఎస్ మోటార్ కంపెనీ, హోండా వంటి ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఈ సంస్థ.. భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్​లో ఎక్కువ భాగాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా, ఈ ఈవీ స్టార్టప్ తన అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కొత్త మోడల్స్​ని తీసుకొస్తోంది. ఇవి 2026 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం తర్వాత విడుదల అవుతాయని తెలుస్తోంది.

కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల శ్రేణిని విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ దేశంలో కనీసం ఆరు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయాలని యోచిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ఈ రాబోయే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను 2025 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆవిష్కరించే అవకాశం ఉంది!

రాబోయే ఈ మోడళ్లతో ఓలా ఎలక్ట్రిక్ పట్టణ ప్రయాణికుల నుంచి అడ్వెంచర్ రైడర్ల వరకు దేశంలోని విస్తృత శ్రేణి వినియోగదారుల అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే స్పోర్ట్​స్టర్, క్రూయిజర్, రోడ్​స్టర్ ప్రో, అడ్వెంచర్, డైమండ్​హెడ్​ వంటి అనేక ఎలక్ట్రిక్ బైక్స్​ని ఆవిష్కరించింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లైనప్​ని మరింత విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల శ్రేణిని కూడా లాంచ్ చేయాలని యోచిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ హై పర్ఫార్మెన్స్​ స్కూటర్లు..

ఓలా ఎలక్ట్రిక్ ఆరు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను పైప్​లైన్​లో ఉంచింది. ఇవి 2026 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం తర్వాత భారత మార్కెట్లోకి వస్తాయి. వాటిలో ఒకటి ఎస్1 స్పోర్ట్స్. ఇది హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్​గా వస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న ఓలా ఎస్ 1 ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఎస్1 శ్రేణిలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయ్యే అవకాశం ఉంది.

కొత్త ప్లాట్​ఫామ్ ఎస్2 ఆధారంగా కొత్త మోడళ్ల శ్రేణి ఉంటుంది. ఓలా ఎస్2 శ్రేణిలో ఎస్2 సిటీ, ఎస్2 స్పోర్ట్స్, ఎస్2 టూరర్ వంటి ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఉన్నాయి. ఎస్1 సిటీ కమ్యూటర్ మోడల్ కాగా, ఎస్2 స్పోర్ట్స్ హై పెర్ఫార్మెన్స్ మోడల్​గా ఉంటుంది. మరోవైపు, ఎస్ 2 టూరర్ లాంగ్ డిస్టెన్స్ ఫోకస్ మోడల్​గా వస్తుంది. ఇది మరింత రేంజ్​ని అందిస్తుంది.

వీటితో పాటు మరో కొత్త ప్లాట్​ఫామ్ ఎస్3 సైతం సిద్ధమవుతోంది! ఇది మ్యాక్సీ స్కూటర్ కోసం ఉంటుంది. ఇదే ప్లాట్​ఫామ్ ఆధారంగా ఓలా ఎస్3 గ్రాండ్ అడ్వెంచర్​ని లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఇది సుదూర ఈవీ కోసం ఉద్దేశించినది. అలాగే ఎస్3 గ్రాండ్ టూరర్ కూడా ఉంటుంది. ఇది హై-స్పీడ్ క్రూయిజింగ్​కు అనుకూలంగా ఉంటుంది.

నష్టాలు, సర్వీస్​పై విపరీతమైన ఫిర్యాదుల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​పై వచ్చిన ఈ అప్డేట్​ ఆసక్తికరంగా మారింది.
 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం