మీరు కొత్త ఫోన్‌తో దీపావళి జరుపుకోవాలని ఆలోచిస్తుంటే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీ కోసం మంచి డీల్స్ అందిస్తోంది. శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. క్యాష్‌బ్యా్క్ కూడా ఉంటుంది. వన్‌ప్లస్ ఫోన్లపై బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ల ధరను తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. అమెజాన్ దీపావళి సేల్‌లో ఈ ఫోన్లపై అందిస్తున్న గొప్ప డీల్స్ గురించి తెలుసుకోండి..
4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,498గా ఉంది. ఈ సేల్లో రూ.1,000 కూపన్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై రూ.375 వరకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.7,100 వరకు డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కొనొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే, ఫోన్లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఐ కంఫర్ట్ డిస్‌ప్లే లభిస్తుంది. ఫోన్ ప్రధాన కెమెరా 32 మెగాపిక్సెల్.
ఈ ఫోన్ సేల్‌లో రూ.24,999కే లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్‌పై రూ.500 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లో ఫోన్ ధరను రూ.1500 వరకు తగ్గించుకోవచ్చు. ఈ ఫోన్‌పై రూ.1250 వరకు క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు రూ .23,400 వరకు ప్రయోజనం పొందవచ్చు. వన్‌ప్లస్ ఈ ఫోన్లో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించింది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. ఇందులోని బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.11,999గా ఉంది. ఈ సేల్లో రూ.500 కూపన్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై రూ.600 వరకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఈ ఫోన్ రూ.11,350 వరకు చౌకగా లభిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్‌లో 6.5 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
సంబంధిత కథనం