Success Story: ఈ సక్సెస్ స్టోరీకి ఎవరైనా ఫిదా కావాల్సిందే..; వైరల్ గా మారిన విజయగాధ
Success Story: దుబాయిలో నివాసం ఉంటున్న సౌమేంద్ర జెనా తన సక్సెస్ స్టోరీని ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన బాల్యం గడిచిన ఒడిశాలోని పేదింటిని, ప్రస్తుతం తను నివాసం ఉంటున్న లగ్జరీ ఇంటినీ షేర్ చేశారు. ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Success Story: ఒడిశాలోని రూర్కెలాకు చెందిన సౌమేంద్ర జెనా ఇటీవల సోషల్ మీడియాలో తన అద్భుతమైన విజయగాథను పంచుకున్నారు. అతి సాధారణ ప్రారంభం నుండి అసాధారణ విజయం వరకు సాగిన తన ప్రయాణాన్ని వివరించారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ లెక్కలేనన్ని మందికి స్ఫూర్తిగా నిలిచింది.

రెండు భిన్న నేపథ్యాల ఫొటోలు
తన పోస్ట్ లో, జెనా రెండు ఫొటోలను పంచుకున్నాడు. అందులో ఒకటి తన బాల్యం గడిచిన రూర్కెలాలోని తన చిన్ననాటి ఇల్లు. అది అతను తన ప్రారంభ సంవత్సరాలను గడిపిన ఒక చిన్న, శిథిలావస్థలో ఉన్న పూరిల్లు. మరొకటి అతని ప్రస్తుత నివాసం- దుబాయిలో ఒక విశాలమైన విలాసవంతమైన భవనం. దాని ముందు పోర్షే టేకాన్, జి వాగన్ బ్రబస్ 800 ఉన్నాయి. ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇస్తూ, "ఇది అప్పుడు నా ఇల్లు- ఒడిశాలోని ఒక చిన్న పట్టణం రూర్కెలాలోని ఒక చిన్న గది. ఇక్కడే నేను పుట్టాను. పెరిగాను మరియు 12 వ తరగతి వరకు (1988-2006) చదివాను. ఆ నాటి జ్ఞాపకాల కోసం 2021లో మళ్లీ అక్కడికి వెళ్లాను.! మరో ఫొటో ఈ రోజు నేను నివాసం ఉంటున్న దుబాయ్ లోని నా ఇల్లు. ఇది నా 17 సంవత్సరాల అలుపెరగని కృషి, నిద్రలేని రాత్రులు మరియు షార్ట్ కట్ లు లేని కథను చెబుతుంది. విజయం సాధించడానికి కచ్చితంగా సమయం పడుతుంది" అని జెనా స్ఫూర్తిదాయక కథనాన్ని పంచుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ పోస్ట్ చాలా తొందరగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జెనా జీవితం, అతని కథలో ప్రేరణను చాలా మంది ప్రశంసించారు. ఈ పోస్టుపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘గ్రేట్ బ్రదర్.. గతాన్ని చూపించడానకి తెగువ, ధైర్యం కావాలి. ఈ రోజుల్లో, ప్రజలు తమ పూర్వీకుల ఇంటిని తిరిగి సందర్శించడం మానేస్తున్నారు. అవి వారు లేదా వారి తల్లిదండ్రులు, తాతలు జీవితాన్ని పూర్తిగా గడిపిన జ్ఞాపకాలు’’ అన్నారు. 'విజయానికి సమయం, కృషి, అదృష్టం, సహాయం కావాలి' అని మరొకరు పేర్కొన్నారు. మూడవ వ్యక్తి ఇలా పేర్కొన్నాడు, "కష్టపడి పనిచేయడం వల్ల ప్రతి ఒక్కరూ 17 సంవత్సరాలలో ఇది సాధించలేరు. అదృష్టం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది" అన్నారు.
సౌమేంద్ర జెనా ఆదాయం..
సౌమేంద్ర జెనా ఫైనాన్స్ రంగంలో ఒక ప్రసిద్ధ కంటెంట్ సృష్టికర్త. ఇన్ స్టాగ్రామ్ (instagram) లో అతడు 300,000 మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. అక్కడ అతను ఫైనాన్స్ సంబంధిత కంటెంట్ ను పంచుకుంటాడు. యూట్యూబ్ (youtube) లో, అతని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. యూట్యూబ్ లో అతడి ఫాలోవర్ల సంఖ్య సుమారు 487,000 మంది. సంక్లిష్టమైన ఆర్థిక భావనలను సరళతరం చేసే, పెట్టుబడి (investment) చిట్కాలను అందించే, వీక్షకులకు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా శక్తినిచ్చే అతని వీడియోలకు విశేష ఆదరణ ఉంది.