తక్కువ ధరలో లభించే 5 ఎలక్ట్రిక్ బైక్స్.. రేంజ్‌లో కూడా సూపర్-oben rorr ez to ola roadster x top 5 best electric bikes with affordable price and good range ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  తక్కువ ధరలో లభించే 5 ఎలక్ట్రిక్ బైక్స్.. రేంజ్‌లో కూడా సూపర్

తక్కువ ధరలో లభించే 5 ఎలక్ట్రిక్ బైక్స్.. రేంజ్‌లో కూడా సూపర్

Anand Sai HT Telugu

ఎలక్ట్రిక్ వాహనాలకు ఈరోజుల్లో డిమాండ్ పెరుగుతోంది. ఈవీ స్కూటర్లే కాదు.. ఈవీ బైక్‌లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. మీ కోసం ఐదు ఎలక్ట్రిక్ మోటర్ సైకిళ్లను తీసుకొచ్చాం.. చూసేయండి.

ఓలా రోడ్ స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్

పెట్రోల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ బైక్‌ల నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. చాలా మంది వినియోగదారులు వాటిని కొనుగోలు చేయాలని ఇటీవలి కాలంలో ఆలోచిస్తున్నారు. సరసమైన ధరలకు లభించే, రోజువారీ వినియోగానికి కూడా అనువైన 5 ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను చూద్దాం..

ఒబెన్ రోర్ ఈజెడ్

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ బడ్జెట్ ధరలోనే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 89,999 నుండి రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 2.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 110 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్

అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌గా పిలిచే ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ డెలివరీ కూడా ప్రారంభమైంది. సరికొత్త ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ధర కనీసం రూ. 84,999, గరిష్టంగా రూ. 1.05 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 117 నుండి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. 4.3-అంగుళాల ఎల్‌సీడీ సెగ్మెంట్ డిస్‌ప్లేతో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంటుంది.

రివోల్ట్ ఆర్వీ400

ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్ ఇది. సరసమైన ధరకు లభిస్తుంది. దీని ధర రూ. 1.24 లక్షలు నుంచి రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 3.24 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ రివోల్ట్ ఆర్వీ400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ. ఇది ఎల్‌సీడీ స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఓటీఏ అప్‌డేట్‌లతో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. ఇది కాస్మిక్ బ్లాక్, స్టీల్త్ బ్లాక్, ఇండియా బ్లూ, మిస్ట్ గ్రే, ఎక్లిప్స్ రెడ్ వంటి వివిధ రంగులలో కూడా లభిస్తుంది.

కబీరా మొబిలిటీ కేఎం3000

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ధర రూ. 1.74 లక్షలు(ఎక్స్-షోరూమ్). 4.1 kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 178 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 5-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంటుంది.

మ్యాటర్ ఏరా

ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్. దీనిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపయోగించవచ్చు. ఈ మోటార్ సైకిల్ ధర రూ. 1.79 లక్షలు నుంచి రూ. 1.89 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 5 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. పూర్తి ఛార్జ్‌పై 172 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.