Nykaa share price falls: 2 శాతం పడిపోయిన నైకా షేర్ ధర..
Nykaa share price falls: నైకా షేర్ ధర జనవరి 12న 2 శాతం పడిపోయింది. దాదాపు 1.4 కోట్ల షేర్లు చేతులు మారడంతో షేరు ధర పతనమైంది.
నైకా షేర్ ధర జనవరి 12న 2 శాతం పడిపోయింది. మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ సంస్థ షేర్లు 1.4 కోట్ల మేర భారీ లావాదేవీల్లో ట్రేడవడంతో షేర్ ధర పతనమైంది.
నైకా స్టాక్ ఉదయం రూ. 152.95 వద్ద ఓపెన్ అయి రూ. 156.65కు కోలుకుంది. తిరిగి మళ్లీ రూ. 151.40 వద్దకు పడిపోయింది. నిన్నటితో పోల్చితే 2.4 శాతం పడిపోయింది. బ్లాక్ డీల్ రూపంలో ఒక షేర్ హోల్డర్ రూ. 148.90 చొప్పున 26 మిలియన్ డాలర్ల షేర్లు అమ్మేసినట్టు తెలుస్తోంది.
గోల్డ్‌మన్ సాక్స్, మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ డిసెంబర్‌లో బ్లాక్ డీల్స్‌లో ఎఫ్‌ఎస్‌ఎన్ ఇ-కామర్స్ వెంచర్స్‌లో వాటాను కొనుగోలు చేశాయి.
గోల్డ్‌మన్ సాక్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ (మారిషస్) 64,58,774 నైకా షేర్లను ఒక్కొక్కటి రూ. 171 చొప్పున కొనుగోలు చేయగా, గోల్డ్‌మన్ సాక్స్ (సింగపూర్) అదే ధరతో 64,58,775 నైకా షేర్లను కొనుగోలు చేసింది. అంటే గోల్డ్‌మన్ సాక్స్ ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్‌లో రూ. 220 కోట్ల పెట్టుబడి పెట్టింది.
మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ 58.50 లక్షల నైకా షేర్లను కొనుగోలు చేసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 87.70 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. కెనడియన్ పెన్షన్ ఫండ్ 92.50 లక్షల షేర్లను కొనుగోలు చేసింది.
జనవరి 17, 2022న షేరు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 348.70కి చేరగా, డిసెంబర్ 23, 2022న రూ. 139.35 వద్ద 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది.