WhatsApp New Feature: ఒక వాట్సాప్ అకౌంట్‍.. నాలుగు ఫోన్లలో..: ఎలా పని చేస్తుందంటే..!-now you can run your whatsapp account multiple phones know how it work ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Now You Can Run Your Whatsapp Account Multiple Phones Know How It Work

WhatsApp New Feature: ఒక వాట్సాప్ అకౌంట్‍.. నాలుగు ఫోన్లలో..: ఎలా పని చేస్తుందంటే..!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 26, 2023 10:47 AM IST

WhatsApp New Feature: ఇతర మొబైళ్లలోనూ వాట్సాప్ అకౌంట్‍కు లాగిన్ అయ్యేలా కొత్త సదుపాయాన్ని వాట్సాప్ తీసుకొస్తోంది. దీని ద్వారా ఒక అకౌంట్‍ను నాలుగు ఫోన్లలో వాడుకోవచ్చు.

WhatsApp New Feature: ఒక వాట్సాప్ అకౌంట్‍.. నాలుగు ఫోన్లలో.. (Photo: Meta)
WhatsApp New Feature: ఒక వాట్సాప్ అకౌంట్‍.. నాలుగు ఫోన్లలో.. (Photo: Meta)

WhatsApp New Feature: ఒక వాట్సాప్ అకౌంట్‍ను నాలుగు స్మార్ట్‌ఫోన్‍లలో వాడుకునేలా కొత్త సదుపాయాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ రోల్అవుట్‍ను ప్రారంభించింది. రానున్న వారాల్లో యూజర్లందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ముఖ్యంగా సెకండరీ ఫోన్ వాడుతున్న వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. వాడుతున్న మొబైల్‍లో లాగ్అవుట్ కాకుండానే మరో మొబైల్ అదే వాట్సాప్ అకౌంట్‍తో లాగిన్ అవ్వొచ్చు. ఇలా నాలుగు మొబైళ్ల వరకు వాట్సాప్ అకౌంట్‍ను లాగిన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కంప్యూటర్లు, ల్యాప్‍టాప్‍ల్లో వెబ్ వెర్షన్‍కు ఇలా లాగిన్ అయ్యే సదుపాయం ఉండగా.. ఇప్పుడు వేరే ఫోన్‍లలోనూ మీ వాట్సాప్ అకౌంట్‍ను రన్ చేసుకోవచ్చు. వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

ఎలా పని చేస్తుంది!

WhatsApp New Feature: వాట్సాప్ అకౌంట్‍ను వేరే ఫోన్‍కు లింక్ చేసుకునేందుకు కూడా వాట్సాప్ వెబ్ లాంటి ప్రాసెసే ఉంటుంది. వేరే మొబైల్‍లో లాగిన్ అయ్యేందుకు ఆ మొబైల్‍లో క్యూఆర్ కోడ్‍ను.. లింక్ చేసుకోవాలనుకుంటున్న వాట్సాప్ అకౌంట్ ఉన్న ఫోన్‍ నుంచి స్కాన్ చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా ఓటీపీ బేస్డ్ సిస్టమ్ కూడా ఉంటుందని వాట్సాప్ చెబుతోంది. లింక్ చేసుకున్న మొబైల్‍లోనూ వాట్సాప్‍ను పూర్తిస్థాయిలో వాడుకోవచ్చు. ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లు అలానే ఉంటాయి. అయితే, ప్రతీసారి వాట్సాప్ ప్రైమరీ అకౌంట్ నుంచే వేరే మొబైళ్లకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

WhatsApp New Feature: వేరే మొబైళ్లకు వాట్సాప్ అకౌంట్‍ను లింక్ చేసుకునే ఈ ఫీచర్‌ను మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. సెకండరీ మొబైళ్లు వాడే వారికి ఈ మల్టిపుల్ ఫోన్ లింక్ ఫీచర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒక మొబైల్‍లో లాగౌట్ కాకుండానే మరో ఫోన్‍లో అదే అకౌంట్‍ను వాడుకోవచ్చు. అలాగే, ఫోన్ చార్జింగ్ అయిపోతున్న సమయాల్లోనూ వేరే మొబైల్‍లో లాగిన్ అయ్యేందుకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వాట్సాప్ అకౌంట్‍ను మరో ఫోన్‍కు ఎలా లింక్ చేసుకోవాలంటే..

  • ముందుగా సెకండరీ ఫోన్‍లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత మీరు వాడుతున్న ప్రైమరీ ఫోన్‍లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లో లింక్డ్ డివైజెస్ సెక్షన్‍లోకి వెళ్లండి
  • అక్కడ లింక్ ఎ డివైజ్ అని ఉంటుంది.
  • ఆ తర్వాత స్క్రీన్‍పై వచ్చే ఇన్‍స్ట్రక్షన్స్ ఫాలో అవండి.
  • అనంతరం మీ ప్రైమరీ ఫోన్‍లో కెమెరా ఓపెన్ అవుతుంది. అప్పుడు సెకండరీ ఫోన్‍లో కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. అంతే మీ ప్రైమరీ ఫోన్‍లోని వాట్సాప్ అకౌంట్‍ను సెకండరీ మొబైల్‍లో కూడా వాడుకోవచ్చు.

వాట్సాప్ అకౌంట్‍ను సెకండరీ మొబైల్‍కు లింక్ చేయడం కూడా దాదాపు వాట్సాప్ వెబ్‍కు కనెక్ట్ చేసినట్టే ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం