WhatsApp New Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కొత్తకొత్త ఫీచర్లను తెస్తూనే ఉంటుంది. యూజర్లకు మరిన్ని సదుపాయాలను అందించేందుకు వీటిని తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో వాట్సాప్ స్టేటస్ (WhatsApp Status) కోసం నూతన ఫీచర్లను వాట్సాప్ ప్రకటించింది. వీటి ద్వారా వాట్సాప్ స్టేటస్ సెట్ చేసుకునే వారికి మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ల రోల్అవుట్‍ను వాట్సాప్ నేడు (ఫిబ్రవరి 7) మొదలుపెట్టింది. కొన్ని వారాల్లో యూజర్లందరికీ ఈ స్టేటస్ నయా ఫీచర్లు యాడ్ అవుతాయి. ఈ కొత్త ఫీచర్ల వివరాలు, ఉపయోగాలు ఇవే.,వాయిస్ స్టేటస్WhatsApp Voice Status: ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్‍గా ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్, ఎమోజీలు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇక నుంచి వాయిస్ ఫైళ్లను కూడా స్టేటస్‍గా సెట్ చేసుకోవచ్చు. అంటే ఆడియో ఫైల్‍ను కూడా వాట్సాప్ స్టేటస్‌గా పోస్ట్ చేయవచ్చు. 30 సెకన్ల వరకు నిడివి ఉన్న ఆడియోను స్టేటస్‍గా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ రోల్అవుట్‍ను వాట్సాప్ నేడు ప్రారంభించింది. మరికొన్ని రోజుల్లోనే యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది.,ప్రైవేట్ ఆడియన్స్ సెలెక్టర్Private Audience Selector: మీరు అప్‍డేట్ చేసే స్టేటస్‍ను ఎవరు చూడొచ్చనేది మీరు ఎంపిక చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీ కాంటాక్ట్స్ లో కొందరికి స్టేటస్ కనిపించకుండా సెట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఇప్పుడు కూడా ఉంది. అయితే ఇందుకోసం స్టేటస్ సెట్ చేసే ముందే సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అయితే ఈ ప్రైవేట్ ఆడియన్స్ సెలెక్టర్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. స్టేటస్ పోస్ట్ చేసే ప్రతీసారి దాన్ని ఎవరు చూసేందుకు అనుమతించాలో ఆప్షన్లు కనిపిస్తాయి.,స్టేటస్ పెడితే రింగ్Status Profile Rings: మీరు ఎవరి స్టేటస్‍ను అయినా అప్‍డేట్ చేసిన వెంటనే చూడాలనుకుంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీరు ఎంపిక చేసుకున్న కాంటాక్టుల్లో ఎవరైనా స్టేటస్ అప్‍డేట్ చేస్తే.. వారి కాంటాక్ట్ ప్రొఫైల్ వద్ద ఈ రింగ్ కనిపిస్తుంది. దీంతో వారు స్టేటస్ అప్‍డేట్ చేశారని మీరు వెంటనే అర్థం చేసుకోవచ్చు.,ఈ కొత్త స్టేటస్ ఫీచర్లను క్రమంగా యూజర్లకు ఇస్తోంది వాట్సాప్. రోల్అవుట్‍ను నేడు మొదలుపెట్టినట్టు ప్రకటించింది. రానున్న యూజర్లందరికీ ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.,,ఇక స్టేటస్ రియాక్షన్‍లు (WhatsApp Status Reactions) కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్ వల్ల ఎమోజీలతో ఇతరుల స్టేటస్‍కు మీరు రిప్లై ఇవ్వొచ్చు. స్టేటస్ చూసేటప్పుడు రిప్లైపై ట్యాప్ చేస్తే 8 ఎమోజీలు కనిపిస్తాయి. వాటిలో మీరు ఏది పంపాలనుకుంటే దానిపై ట్యాప్ చేస్తే సరి.,వాట్సాప్ స్టేటస్‍లో లింక్ ప్రివ్యూ కూడా అందుబాటులో ఉంది. ఏదైనా లింక్ స్టేటస్‍గా పెడితే.. అందులో ఏముందో క్లిక్ చేయకుండానే ప్రివ్యూ ద్వారా తెలుసుకోవచ్చు.,