Affordable smartphone : ధర తక్కువ- ఫీచర్స్​ ఎక్కువ! నథింగ్​ ఫోన్​ 3ఏ వచ్చేస్తోంది..-nothing phone 3a india launch date officially confirmed know when and what to expect from this smartphone ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Affordable Smartphone : ధర తక్కువ- ఫీచర్స్​ ఎక్కువ! నథింగ్​ ఫోన్​ 3ఏ వచ్చేస్తోంది..

Affordable smartphone : ధర తక్కువ- ఫీచర్స్​ ఎక్కువ! నథింగ్​ ఫోన్​ 3ఏ వచ్చేస్తోంది..

Sharath Chitturi HT Telugu
Jan 31, 2025 10:15 AM IST

Nothing Phone 3a launch date : మచ్​ అవైటెడ్​ నథింగ్​ ఫోన్​ 3ఏ ఇండియా లాంచ్​ డేట్​పై క్లారిటీ వచ్చేంది. ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​తో పాటు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నథింగ్​ ఫోన్​ 3ఏ
నథింగ్​ ఫోన్​ 3ఏ (Nothing)

కొన్ని నెలలుగా సాగుతున్న ఊహాగానాల అనంతరం నథింగ్​ ఫోన్​ 3ఏ ఇండియా లాంచ్​పై అధికారిక ప్రకటన వెలువడింది. రాబోయే స్మార్ట్​ఫోన్​ లాంచ్​ డేట్​తో పాటు పలు ఆసక్తికర వివరాలతో కూడిన వీడియోని నథింగ్​ తాజాగా రిలీజ్​ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నథింగ్​ ఫోన్​ 3ఏ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

నథింగ్ ఫోన్ 3ఏ: ఇండియా లాంచ్ డేట్..

నథింగ్ ఫోన్ 3ఏ స్మార్ట్​ఫోన్​.. భారత కాలమానం ప్రకారం మార్చ్​ 4న మధ్యాహ్నం 3:30 గంటలకు ఇండియాలో లాంచ్ కానుంది. ఇది ఫ్లిప్​కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. మైక్రోసైట్ పేజ్​ ఇప్పటికే లైవ్​లో ఉంది. ఈ గ్యాడ్జెట్​కి సంబంధించిన లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం ఫ్లిప్​కార్ట్​ పేజ్​లో నోటిఫికేషన్స్​ని సైతం ఆన్​ చేసుకోవచ్చు.

నథింగ్​ ఫోన్ 3ఏ: ధర (అంచనా)..

ఇండియాలోని అఫార్డిబుల్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో ఈ నథింగ్ ఫోన్ 3ఏ లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. దీని ధర పోటీగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్​ఫోన్​ ధర సుమారు రూ.25,000 ఉంటుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఖచ్చితమైన ధర, వేరియంట్ వివరాలు మార్చ్​ 4న లాంచ్ ఈవెంట్​తో స్పష్టమవుతాయి.

కొత్త ఫోన్​ లాంచ్​తో పాటు సంస్థ వృద్ధిపై పలు కీలక వివరాలు బయటకు వచ్చాయి. 2020 అక్టోబర్​లో మొదటి ఫోన్​ లాంచ్​ నుంచి ఈ నథింగ్​ సంస్థ తొలిసారి 1 బిలియన్​ డాలర్ల రెవెన్యూ మార్క్​ తాకింది. ఇందులో సగం ఆదాయం కేవలం 2024లోనే రావడం గమనార్హం. నథింగ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టిమ్ హోల్​బ్రో ఈ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. “ఫోన్ (2), ఇయర్ (2), ఫోన్ 2ఏ, ఫోన్ 2ఏ ప్లస్, సిఎమ్ఎఫ్ ఫోన్ 1 సక్సెస్​ నిర్మించడానికి మేము 2024లో ప్రవేశించాము. ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం, వ్యాపారాన్ని విస్తరించడం గణనీయమైన ఆదాయ వృద్ధికి దోహదపడింది. 2025 ఏం తెస్తుందో చూడాలని ఆసక్తిగా ఉన్నాం,” అని అన్నారు.

నథింగ్ ఫోన్ 3ఏ:స్పెసిఫికేషన్లు (అంచనా)

నథింగ్ ఫోన్ 3ఏ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.8 ఇంచ్​ ఓఎల్ఈడీ డిస్​ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. రేర్ కెమెరా సెటప్​లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ 2ఎక్స్ జూమ్, అల్ట్రా-వైడ్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండవచ్చు. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉండనుంది.

మరిన్ని వివరాలపై నథింగ్​ ఫోన్​ 3ఏ లాంచ్​ టైమ్​ నాటికి స్పష్టత వస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం