Nothing Phone 2a Plus : జులై 31న నథింగ్​ ఫోన్​ 2ఏ ప్లస్​ లాంచ్​- ఫీచర్స్​ లీక్​!-nothing phone 2a plus india launch confirmed for july 31 key specifications revealed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nothing Phone 2a Plus : జులై 31న నథింగ్​ ఫోన్​ 2ఏ ప్లస్​ లాంచ్​- ఫీచర్స్​ లీక్​!

Nothing Phone 2a Plus : జులై 31న నథింగ్​ ఫోన్​ 2ఏ ప్లస్​ లాంచ్​- ఫీచర్స్​ లీక్​!

Sharath Chitturi HT Telugu

Nothing Phone 2a Plus India launch : నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్​ను జూలై 31న భారత్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్​ఫోన్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

నథింగ్​ ఫోన్​ 2ఏ ప్లస్​ (Unsplash)

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఇండియా లాంచ్​ను కార్క్ పీ నేతృత్వంలోని యూకేకు చెందిన కంపెనీ నథింగ్ ధృవీకరించింది. కొత్త నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ జూలై 31 న భారతదేశంలో లాంచ్ కానుంది. అయితే ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, కొత్త ఫోన్ ఫీచర్ల గురించి సంస్థ ఎటువంటి సంకేతాలను పంచుకోవడం లేదు. కానీ ఆన్​లైన్​లో మాత్రం ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన పలు కీలక ఫీచర్స్​ ఇప్పటికే లీక్​ అయ్యాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

నథింగ్​ ఫోన్ 2ఏ ప్లస్..

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్​ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో చిప్​సెట్​ను ఉపయోగిస్తున్నట్టు సంస్థ ఇటీవలే ప్రకటించింది. 8 కోర్స్ ఉన్న ఈ ప్రాసెసర్ 3.0 గిగాహెర్ట్జ్ వేగంతో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రోను ఉపయోగించే నథింగ్ ఫోన్ 2ఏలోని ప్రాసెసర్ కంటే ఇది 10 శాతం వేగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కొత్త ఫోన్ 12 జీబీ ర్యామ్​తో వస్తుంది. దీనిని ర్యామ్ బూస్టర్ అనే ఫీచర్​తో 20 జీబీ వరకు విస్తరించవచ్చు. ఇందులో మాలి-జీ610 ఎంసీ 4 గ్రాఫిక్స్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. ఇది మునుపటి మోడల్ కంటే 30 శాతం వేగంగా ఉంటుందని చెబుతున్నారు.

మేలో అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 2ఏలో గ్లైఫ్ ఇంటర్​ఫేస్ అనే ప్రత్యేకమైన డిజైన్ ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. 6.7 ఇంచ్​ ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్​ప్లేను ఇందులో అందించారు. స్క్రీన్ దాని రిఫ్రెష్ రేటును 30 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు అడ్జెస్ట్​ చేయగలదు. ఇది వివిధ పనులను స్మూత్​గా చేస్తుంది. ఇందులో 12 జీబీ వరకు ర్యామ్ కూడా ఉంది. హై క్వాలిటీ ఫొటోలు తీయడానికి వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, సెల్ఫీలు, వీడియో చాట్​ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా ఉన్నాయి. 256 జీబీ వరకు స్టోరేజ్​ను అందిస్తున్న ఈ ఫోన్​లో భద్రత కోసం ఇన్​-డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్​ను అందించారు. ఇది డ్యూయెల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఐపీ54 రేటింగ్​తో డస్ట్​, వాటర్​ రెసిస్టెన్స్​ కలిగి ఉంటుంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ స్మార్ట్​ఫోన్​ కోసం గ్యాడ్జెట్​ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నథింగ్ ఫోన్ 2ఏ అనేక అప్​గ్రేడ్​లను హామీ ఇస్తుంది. కొత్త, వేగవంతమైన ప్రాసెసర్, ఇతర అప్​గ్రేడ్స్​తో, ఇది మెరుగైన పనితీరును అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూలై 31న జరిగే అధికారిక లాంచ్​లో ఫీచర్స్​, ధరతో పాటు మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డట్స్​ కోసం వాట్సాప్​లో మన హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి.

సంబంధిత కథనం