మీరు రూ. 30,000 ధర పరిధిలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, మార్కెట్లో నథింగ్ ఫోన్ 3ఏ ప్రో 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ అనే రెండు ఫోన్‌లు మంచి పోటీగా నిలుస్తున్నాయి. ఈ రెండూ 5జీ కనెక్టివిటీ, సామర్థ్యం గల పనితీరు, రోజువారీ అవసరాలకు సరిపోయే అనేక ఫీచర్లతో వస్తాయి. ఈ రెండింటిలో ఏది సరైందో మీకు ఇంకా సందేహంగా ఉంటే, సరిగ్గా నిర్ణయం తీసుకోవడానికి వాటి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి పోలిక ఇక్కడ ఉంది.
నథింగ్ ఫోన్ 3ఏ ప్రో 5జీ:
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 27,999
12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ. 31,999
ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ:
8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 32,999
12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ. 34,999
నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలో ట్రాన్స్పరెంట్ లుక్ ఉంటుంది. 6.7 ఇంచ్ అమోఎల్ఈడీ ఎల్టీపీఎస్ డిస్‌ప్లే దీని సొంతం. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఇందులో ఉంది.
ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీలో 6.79 ఇంచ్ అమోఎల్ఈడీ ఫ్లాట్ స్క్రీన్ ఉంటుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ దీని సొంతం.
నథింగ్ ఫోన్ 3ఏ ప్రో 5జీ:
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్: ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓ.ఐ.ఎస్.), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈ.ఐ.ఎస్.) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్స్ వైడ్-యాంగిల్ సెన్సార్, 50 మెగాపిక్సెల్స్ పెరిస్కోప్ లెన్స్ (3 రెట్లు ఆప్టికల్ జూమ్, 60 రెట్లు వరకు డిజిటల్ జూమ్), 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా-వైడ్ సెన్సార్.
సెల్ఫీ కెమెరా: 50 మెగాపిక్సెల్స్.
వీడియో రికార్డింగ్: ముందు, వెనుక కెమెరాలతో 30 ఫ్రేమ్స్-పర్-సెకండ్స్ (ఎఫ్.పి.ఎస్) వద్ద 4కె వీడియో, 1080పీలో పలు ఫ్రేమ్ రేట్లలో రికార్డ్ చేయవచ్చు.
ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ:
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్: ఓ.ఐ.ఎస్. సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్స్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్స్ మోనోక్రోమ్ లెన్స్.
సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్స్.
వీడియో రికార్డింగ్: 30 ఎఫ్.పీ.ఎస్ వద్ద 4కే రికార్డింగ్, 60 ఎఫ్.పీ.ఎస్ వరకు 1080పీ, 720పీ రికార్డింగ్, స్లో-మోషన్ వీడియో (1080పిలో 120 ఎఫ్.పీ.ఎస్, 720పిలో 240 ఎఫ్.పి.ఎస్) సపోర్ట్.
నథింగ్ 3ఏ ప్రో 5జీ లోని ట్రిపుల్ కెమెరా, శక్తివంతమైన 50 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఫోటోలు, వీడియోల విషయంలో మెరుగైన సౌలభ్యాన్ని ఇస్తాయి.
నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్ ఉంటుంది. ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది.
బ్యాటరీ సెటప్ వరుసగా 5000ఎంఏహెచ్, 7000ఎంఏహెచ్.
నథింగ్ ఫోన్ 3ఏకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఒప్పో గ్యాడ్జెట్లో మాత్రం 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు లభిస్తుంది.
రెండు ఫోన్‌లలోనూ అద్భుతమైన స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్‌లు ఉన్నందున, రోజువారీ వినియోగానికి మంచి పనితీరును అందిస్తాయి.
కానీ, బ్యాటరీ, ఛార్జింగ్ విషయానికి వస్తే ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. దీనిలోని 7000ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ, 80 వాట్స్ వేగవంతమైన ఛార్జింగ్ మద్దతు వినియోగదారులకు ఎక్కువ బ్యాటరీ జీవితాన్ని అందిస్తాయి.
మీరు మెరుగైన కెమెరా, పెరిస్కోప్ లెన్స్, ఆకర్షణీయమైన డిజైన్‌ను కోరుకుంటే, నథింగ్ ఫోన్ 3ఎస్ ప్రో 5జీ ఎంచుకోవచ్చు.
మీరు అత్యంత ఎక్కువ బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ఛార్జింగ్, నాణ్యమైన డిస్‌ప్లేను కావాలనుకుంటే, ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ వైపు మొగ్గు చూపవచ్చు.
సంబంధిత కథనం