Nokia G42 : నోకియా నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ ఫోన్​.. జీ42 5జీ ధర ఎంతంటే!-nokia g42 5g launched in india check price and features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nokia G42 : నోకియా నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ ఫోన్​.. జీ42 5జీ ధర ఎంతంటే!

Nokia G42 : నోకియా నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ ఫోన్​.. జీ42 5జీ ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Sep 11, 2023 06:30 PM IST

Nokia G42 : నోకియా జీ42 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ధర రూ. 12,599. ఫీచర్స్​ ఎలా ఉన్నాయంటే…

నోకియా జీ42 5జీ ధర ఎంతంటే!
నోకియా జీ42 5జీ ధర ఎంతంటే!

Nokia G42 launch in India : మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​తో ఇండియా మార్కెట్​లోకి వచ్చేసింది హెచ్​ఎండీఏ గ్లోబల్​ సంస్థ. తాజాగా.. నోకియా జీ42ని లాంచ్​ చేసింది. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవే..

నోకియా జీ42 5జీలో ఐపీ52 రేటెడ్​, వాటర్​డ్రాప్​ నాచ్​ డిజైన్​ ఉంటుంది. సైడ్​ ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ దీని సొంతం. 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.56 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే ఇందులో ఉంటుంది. ఈ మోడల్​కు గొరిల్లా గ్లాస్​ 3 ప్రొటెక్షన్​ లభిస్తోంది.

మొబైల్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్​ కెమెరా వస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఫ్రెంట్​లో 8ఎంపీ కెమెరా లభిస్తోంది. ఈ నోకియా జీ42 5జీలో స్నాప్​డ్రాగన్​ 480+ చిప్​సెట్​ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్​ 13 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది.

Nokia G42 5G price in India : ఇక ఈ స్మార్ట్​ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ వస్తోంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఇది 3 రోజుల పాటు పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. ఈ మోడల్​కు 20వాట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ చేస్తుంది.

ఇదీ చూడండి:- Oppo A38 : ఒప్పో ఏ38 లాంచ్​.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఎలా ఉంది?

నోకియా జీ42 5జీ ధర ఎంతంటే..

నోకియా కొత్త స్మార్ట్​ఫోన్​లో 6జీబీ ర్యామ్​-128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ఉంటుంది. 1టీబీ వరకు ఎక్స్​ప్యాండెబల్​ స్టోరేజ్​ కూడా వస్తోంది. పర్పుల్​, గ్రే రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ నెల 15 నుంచి అమెజాన్​లో ఈ నోకియా జీ42 5జీ సేల్​ మొదలవుతుంది. ఈ మోడల్​ ధర రూ .12,599గా ఉంది. 2 ఆండ్రాయిడ్​ అప్​గ్రేడ్స్​తో పాటు 3ఏళ్ల సెక్యురిటీ అప్​డేట్స్​ ఇస్తామని సంస్థ చెబుతోంది.

లావా నుంచి బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​..

Lava Blaze 2 pro price : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​ అడుగుపెట్టింది. అదే లావా బ్లేజ్​ 2 ప్రో. ఈ కొత్త మొబైల్​లో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.5 ఇంచ్​ ఐపీఎస్​ ఎల్​సీడీ (720x1600 పిక్సెల్స్​) డిస్​ప్లే వస్తోంది. ఈ గ్యాడ్జెట్​ బరువు 190గ్రాములు. డైమెన్షన్స్​.. 163ఎంఎంx75.2ఎంఎంx8.5ఎంఎం. ఈ మోడల్​ పూర్తి ఫీచర్స్​, ధర వంటి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం