NoiseFit Diva : ఇది.. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్​వాచ్​!-noisefit diva a women centric smartwatch launched in india ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Noisefit Diva A Women-centric Smartwatch Launched In India

NoiseFit Diva : ఇది.. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్​వాచ్​!

Sharath Chitturi HT Telugu
Jul 15, 2023 04:35 PM IST

NoiseFit Diva : నాయిస్​ఫిట్​ దివా స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది నాయిస్​ సంస్థ. దీని ధర రూ. 2,999. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

నాయిస్​ఫిట్​ దివా లాంచ్​.. ధర ఎంతంటే..
నాయిస్​ఫిట్​ దివా లాంచ్​.. ధర ఎంతంటే.. (Noise)

NoiseFit Diva launch : మహిళల కోసం ప్రత్యేకించి ఓ స్మార్ట్​వాచ్​ను తయారు చేసింది నాయిస్​ సంస్థ. ఈ నాయిస్​ఫిట్​ దివా తాజాగా ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ వాచ్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

కొత్త స్మార్ట్​వాచ్​ ఎలా ఉంది..?

నాయిస్​ఫిట్​ దివా డిజైన్​ స్టైలిష్​గా ఉంటుంది. సెంటర్​లో సర్క్యులర్​​ డయల్​, రైట్​ సైడ్​లో రొటేటింగ్​ క్రౌన్​ వస్తున్నాయి. 1.1 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే స్క్రీన్​ ఇందులో ఉంటుంది. దీని రిసొల్యూషన్​ 360x360 పిక్సెల్స్​. దీనికి ఐపీ67 డస్ట్​, వాటర్​ రెసిస్టెన్స్​ ప్రొటెక్షన్​ లభిస్తోంది.

ఇక ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ స్మార్ట్​వాచ్​లో హార్ట్​ రేట్​ మానిటర్​, ఎస్​పీఓ2 సెన్సార్​, ఫీమేల్​ సైకిల్​ ట్రాకర్​ వంటివి వస్తున్నాయి. అంతేకాకుండా.. స్లీప్​ పాటర్న్​ను ట్రాక్​ చేయడం, స్ట్రెస్​ లెవల్స్​ను ఇండికేట్​ చేయడంతో పాటు బ్రీథింగ్​ ప్రాక్టీస్​ సెషన్స్​ను కూడా ఈ వాచ్​ సూచిస్తుంది. ఒక్క వాచ్​లో 100కుపైగా స్పోర్ట్స్​ మోడ్స్​ ఉండటం విశేషం.

NoiseFit Diva smartwatch : ఈ నాయిస్​ఫిట్​ దివాలో బ్లూటూత్​ కాలింగ్​ ఫీచర్​, ఏఐ వాయిస్​ అసిస్టెంట్​ కూడా ఉన్నాయి. కాల్​ లాగ్స్​ను యాక్సెస్​ చేసుకోవడంతో పాటు 12 కాంటాక్ట్స్​ను ఫోన్​ నుంచి సేవ్​ చేసుకోవచ్చు. రిమైండర్​, నోటిఫికేషన్స్​, వెథర్​ అప్డేట్స్​, బిల్ట్​-ఇన్​ క్యాలెండర్​తో పాటు అనేక ఆప్షన్స్​ ఎలాగో ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ వాచ్​ 4 రోజుల పాటు పనిచేస్తుంది సంస్థ చెబుతోంది.

ఇదీ చూడండి:- Amazon Prime Day sale: ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఈ స్మార్ట్ వాచెస్ పై బెస్ట్ డీల్స్

ధర ఎంతంటే..

ఈ స్మార్ట్​వాచ్​ ధర రూ. 2,999. రోజ్​ పింక్​, పర్ల్​ వైట్​, బ్లాక్​ లింక్​, సిల్వర్​ లింక్​, గోల్డ్​ లింక్​ కలర్స్​లో ఈ మోడల్​ అందుబాటులో ఉంది. బ్రాండ్​కు చెందిన వెబ్​సైట్​ లేదా అమెజాన్​లో ఈ నాయిస్​ఫిట్​ దివా స్మార్ట్​వాచ్​ను కొనుగోలు చేసుకోవచ్చు.

NoiseFit Diva price : ఇండియాలో వరుస లాంచ్​లతో బిజీబిజీగా ఉంటోంది నాయిస్ సంస్థ. శుక్రవారమే మూడు వాచ్​లను మార్కెట్​లోకి విడుదల చేసింది. అవి నాయిస్​ఫిట్​ హాలో ప్లస్​, నోవా, ఆర్క్​. ఇప్పుడు దివాను తీసుకొచ్చింది. ప్రాడక్ట్స్​కు మంచి డిమాండ్​ ఉంటుందని సంస్థ అభిప్రాయపడుతోంది.

సంబంధిత కథనం