Debt mutual funds taxation news : డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారులకు బ్యాడ్ న్యూస్! ఈ తరహా ఎమ్ఎఫ్ ట్యాక్సేషన్‌లో కీలక మార్పులు చేస్తూ ఆర్థిక బిల్లును సవరించింది కేంద్రం. ఫలితంగా ఈ ఎమ్‌ఎఫ్‌లు ఎంతో ముఖ్యమైన ఇండక్సేషన్ బెనిఫిట్‌ను కోల్పోయాయి.
ఇప్పటివరకు ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎల్టీసీజీ (లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) బెనిఫిట్ ఉండేది. దీని హోల్డింగ్ పీరియడ్ మూడేళ్లు. కానీ తాజా సవరణలతో.. ఈ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే లాభాలను.. సంబంధిత వ్యక్తుల పన్ను శ్లాబ్‌ల ఆధారంగా ట్యాక్స్ వేయనున్నారు. దీనికి హోల్డింగ్ పీరియడ్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. అంటే.. 30శాతం ట్యాక్స్ శ్లాబ్‌లో ఉన్న ఇన్వెస్టర్‌కు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి లాభాలు వస్తే.. దానిపై మొత్తం మీద 35.8శాతం (సర్ఛార్జీలు, సెస్‌లను కలిపి) పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇది 20శాతం (మూడేళ్ల కాలవ్యవధి)గా ఉండేది.
Debt mutual funds indexation : తాజా పరిస్థితులతో.. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో సమానంగా మారిపోయాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయా సాధనాల్లోనూ.. క్యాపిటల్ గెయిన్స్‌ని ఇన్వెస్టర్ ఆదాయానికి జోడించి, ట్యాక్స్ శ్లాబ్‌కు తగ్గట్టు పన్ను వసూలు చేస్తుంటారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సవరణలతో.. కేవలం డెట్ మ్యూచువల్ ఫండ్స్పైనే కాకుండా.. మొత్తం బాండ్ మార్కెట్‌పైనే ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Debt mutual funds Finance bill : "డొమెస్టిక్ బాండ్ మార్కెట్లో.. మ్యూచువల్ ఫండ్స్ వల్ల లిక్విడిటీ పెరుగుతుంది. లేకపోతే లిక్విడిటీనే ఉండదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చే డబ్బులను బాండ్ మార్కెట్లోకి తరలిస్తుంటారు. తాజా పరిస్థితులతో ఈ ప్రక్రియపై ప్రభావం పడుతుంది," అని ఎడిల్‌వైస్ అసెట్ మేనేజ్మెంట్ ప్రాడక్ట్, మార్కెటింగ్ అండ్ డిజిటల్ బిజినెస్ హెడ్ నిరంజన్ అవస్తి తెలిపారు.
"ఈ చర్యలతో డెట్ ఎమ్ఎఫ్లతో పాటు ఇంటర్నేషనల్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది," అని క్రిడెన్స్ వెల్త్ ఫౌండర్, సీఈఓ కిర్టన్ షా అన్నారు.
Debt mutual funds taxation news in Telugu : ఆర్థిక బిల్లుకు చేసిన తాజా సవరణలు ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయి. ఈలోపు చేసే పెట్టుబుడులకు పాత ప్రక్రియే వర్తిస్తుంది. ఏప్రిల్ 1కి ముందు చేసిన ఏదైనా పెట్టుబడికి.. మూడు సంవత్సరాల తర్వాత ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20శాతం ఎల్టీసీజీ పన్ను రేటును పొందవచ్చు.
కానీ సిప్ ద్వారా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేస్తుంటే మాత్రం.. ఏప్రిల్ 1 తర్వాత లభించే యూనిట్లపై కొత్త ట్యాక్స్ పద్ధతి అమలవుతుందని గుర్తుంచుకోవాలి.
సంబంధిత కథనం