Gold price today: స్థిరంగా బంగారం ధరలు; ఈ రోజు గోల్డ్, సిల్వర్, ప్లాటినం ధరలు ఇవే..-no major change in gold price today here is the list of gold silver platinum prices ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  No Major Change In Gold Price Today. Here Is The List Of Gold, Silver, Platinum Prices..

Gold price today: స్థిరంగా బంగారం ధరలు; ఈ రోజు గోల్డ్, సిల్వర్, ప్లాటినం ధరలు ఇవే..

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 09:51 AM IST

Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 55,600గా కొనసాగుతోంది. మంగళవారం కూడా ఈ ధర ఇంతే ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,56,000 వద్ద కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,560గా ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 55,600గా కొనసాగుతోంది. మంగళవారం కూడా ఈ ధర ఇంతే ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,56,000 వద్ద కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,560గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

24 క్యారెట్ బంగారం

అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ. 60,650గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,06,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,065గా ఉంది.

ఇతర నగరాల్లో..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,750గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,800గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,650గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,000గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,100గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,650గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,700గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్ లో..

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,650గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరుల్లో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,350గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,380గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,650గా ఉంది. ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో బుధవారం 100 గ్రాముల వెండి ధర రూ. 7,350గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 73,500గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,500.. బెంగళూరులో రూ. 73,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 పెరిగి రూ. 27,510గా ఉంది. క్రితం రోజు ఈ ధర రూ. 27,470గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,510గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel