New driving licence rules : ఇక ఆర్​టీఓ​లో డ్రైవింగ్​ టెస్ట్​ లేకుండానే లైసెన్స్​..-no driving test at rtos from june 1 what the new driving licence rules say ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Driving Licence Rules : ఇక ఆర్​టీఓ​లో డ్రైవింగ్​ టెస్ట్​ లేకుండానే లైసెన్స్​..

New driving licence rules : ఇక ఆర్​టీఓ​లో డ్రైవింగ్​ టెస్ట్​ లేకుండానే లైసెన్స్​..

Sharath Chitturi HT Telugu
May 22, 2024 04:20 PM IST

New driving licence rules : ఇక ఆర్​టీఓ​లో డ్రైవింగ్​ టెస్ట్​ లేకుండానే డ్రైవింగ్​ లైసెన్స్​ పొందొచ్చు. ఈ మేరకు కొత్త డ్రైవింగ్​ లైసెన్స్​ నిబంధనలు జూన్​ 1న అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్​టీఓలో టెస్ట్​ లేకుండానే డ్రైవింగ్​ లైసెన్స్​.. ఎప్పటి నుంచి అంటే!
ఆర్​టీఓలో టెస్ట్​ లేకుండానే డ్రైవింగ్​ లైసెన్స్​.. ఎప్పటి నుంచి అంటే! (HT_PRINT)

New driving licence rules 2024 : డ్రైవింగ్​ లైసెన్స్​ పొందేందుకు.. ఇక ఆర్​టీఓ (రీజనల్​ ట్రాన్స్​పోర్ట్​ ఆఫీస్​) చుట్టూ తిరుగుతూ, గంటలు గంటలు లైన్​లో నిలబడి టెస్ట్​లో పాల్గొనాల్సిన అవసరం లేదు! ఆర్​టీఓ బదులు.. ప్రైవేట్​ ట్రైనింగ్​ కేంద్రాల్లోనే డ్రైవింగ్​ లైసెన్స్​లు పొందొచ్చు. ఈ మేరకు.. రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించిన కొత్త డ్రైవింగ్​ లైసెన్స్​ నిబంధనలు జూన్​ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

డ్రైవింగ్​ లైసెన్స్​ కోసం కొత్త నిబంధనలు..

ప్రస్తుతం.. ఆర్​టీఓ అధికారుల సమక్షంలో ఆర్​టీఓ కార్యాలయాల్లో నిర్వహించే డ్రైవింగ్​ టెస్ట్​లో పాల్గొని పాసైతేనే.. డ్రైవింగ్​ టెస్ట్​ లభిస్తోంది. అయితే.. అధికారులపై రోజురోజుకు పెరిగిపోతున్న ఒత్తిడిని తగ్గించేందుకు.. లైసెన్స్​ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు.. ప్రభుత్వం ఆమోదించిన ట్రైనింగ్​ సెంటర్లలోనే పరీక్ష నిర్వహిస్తారు, ఆ కేంద్రాలే.. లైసెన్స్​ సర్టిఫికెట్లు ఇస్తాయి.

దేశవ్యాప్తంగా ఆర్​టీఓలో ఉన్న 90వేల పాత ప్రభుత్వ వాహనాలను దశలవారీగా తొలగించి, తీవ్రమైన కాలుష్య చట్టాలను తీసుకొచ్చేందుకు ఈ కొత్త రూల్స్​ ఉపయోపడతాయి.

అంతేకాదు.. ఈ కొత్త డ్రైవింగ్​ రూల్స్​ కాస్త కఠినంగానే ఉన్నాయి. నిబంధన ప్రకారం.. సరైన లైసెన్స్​ లేకుండా వాహనం నడిపితే.. రూ. 1000 నుంచి రూ. 2000 వరకు జరిమానా పడుతుంది. ఒకవేళ మైనర్​ నడుపుతూ దొరికిపోతే.. సంబంధిత వ్యక్తి గార్డియన్​ లేదా తల్లిదండ్రులకు రూ. 25వేల వరకు ఫైన్​ పడుతుంది. అంతేకాదు.. సదరు మైనర్​.. 25ఏళ్లు వచ్చేంతవరకు డ్రైవింగ్​ లైసెన్స్​ పొందలేరు. ఇక మైనర్​ నడిపిన వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్​ సర్టిఫికేట్​ని కూడా రద్దు చేస్తారు.

Driving licence rules change : మరి 2 వీలర్​ లేదా 4 వీలర్​ డ్రైవింగ్​ లైసెన్స్​కి ఎలాంటి డాక్యుమెంట్స్​ కావాలి? అన్నది.. ముందుగానే చెబుతామని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఫలితంగా.. ఆర్​టీఓలపై ఫిజికల్​ చెకప్​ భారం తగ్గనుంది.

కాగా.. డ్రైవింగ్​ లైసెన్స్​కి సంబంధించిన అప్లికేషన్​ ప్రాసెస్​లో మాత్రం మార్పు లేదు. ఆన్​లైన్​లో లేదా పరివాహన్​ వెబ్​సైట్​లో అప్లికేషన్​ వేసుకోవచ్చు. స్థానిక ఆర్​టీఓకి వెళ్లి మేన్యువల్​గాకూడా డ్రైవింగ్​ లైసెన్స్​ అప్లికేషన్​ దాఖలు చేసుకోవచ్చు.

ప్రైవేట్​ డ్రైవర్​ ట్రైనింగ్​ స్కూల్స్​కి కొత్త నిబంధనలు..

డ్రైవింగ్​ లైసెన్స్​ ఇవ్వగలిగే ప్రైవేట్​ డ్రైవింగ్​ టెస్టింగ్​ స్కూల్స్​కి పలు కీలక నిబంధనలు పెట్టింది కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ.

New driving licence rules in India : భూమి :- డ్రైవింగ్​ ట్రైనింగ్​ సెంటర్లకు కనీసం 1 ఎకర భూమి ఉండాలి. 4 వీలర్​ ట్రైనింగ్​ ఉంటే.. 2 ఎకరాల భూమి తప్పనిసరి.

టెస్టింగ్​ ఫెసిలిటీ:- అన్ని రకాల వసతులను స్కూల్​ కేటాయించాలి.

ట్రైనర్​ క్వాలిఫికేషన్​:- ట్రైనర్​కి హై స్కూల్​ డిప్లొమా (లేదా అందుకు సమాన చదువు) ఉండాలి. కనీసం 5ఏళ్ల డ్రైవింగ్​ ఎక్స్​పీరియెన్స్​ ఉండాలి. బయోమెట్రిక్స్​, ఐటీ సిస్టెమ్స్​పై అవగాహన ఉండాలి.

ట్రైనింగ్​ డ్యురేషన్​:- లైట్​ మోటార్​ వెహికిల్స్​కి అయితే.. 4 వారాల్లో 29 గంటలు. 8 గంటల థియరీ, 21 గంటల ప్రాక్టికల్​ ట్రైనింగ్​.

హెవీ మోటార్​ వెహికిల్స్​కి అయితే.. 6 వారాల్లో 38 గంటలు. 8 గంటల థియరీ, 31 గంటల ప్రాక్టికల్​ ట్రైనింగ్​.

WhatsApp channel

సంబంధిత కథనం