Personal loan tips : పేపర్ వర్క్ లేకుండానే పర్సనల్ లోన్ పొందొచ్చు- ఎలా అంటే..
Instant personal loan : డాక్యుమెంటేషన్, పేపర్ వర్క్ లేకుండా పర్సనల్ లోన్ తీసుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం యెస్! మీరు ఇన్స్టెంట్ పర్సనల్ లోన్‌కి అర్హత సాధిస్తే చాలు.. ప్రాసెస్ ఈజీగా మారిపోతుంది. పూర్తి వివరాలు..
పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? కానీ పేపర్ వర్క్‌లో కూరుకుపోయి విసుగెత్తిపోయారా? అయితే ఎలాంటి పేపర్ వర్క్, పెద్దగా డాక్యుమెంట్లు అవసరం లేకుండానే లోన్ తీసుకోవచ్చని మీకు తెలుసా? అవును! ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది. అదే.. ఇన్స్టెంట్ పర్సనల్ లోన్. అసలేంటి ఈ పర్సనల్ లోన్? దీనితో నిజంగా ప్రయోజనాలు ఉన్నాయా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అంటే ఏంటి?
ఇన్స్టెంట్ పర్సనల్ లోన్లను స్వల్పకాలిక ఫైనాన్సింగ్ అవకాశాలుగా పేర్కొనవచ్చు. ఇవి వినియోగదారులకు తక్షణ డబ్బు అవసరాలను తీరుస్తాయి. సాధారణంగా, ఇటువంటి స్వల్పకాలిక రుణాలు శీఘ్ర ఆమోదం, పంపిణీ విధానాలను అనుమతిస్తాయి. ఇది కొన్ని సందర్భాల్లో గంటలు లేదా నిమిషాల వ్యవధిలో ఆమోదం కోసం తక్కువ డాక్యుమెంటేషన్‌తో దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఎక్కువ సమయం తీసుకోకుండా రుణలు ఇచ్చేందుకు, రుణదాతలు మీ క్రెడిట్ అర్హతను నిర్ణయించడానికి ప్రధానంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, క్రెడిట్ స్కోర్లు, అందుబాటులో ఉన్న డేటాపై ఆధారపడతారు.
డాక్యుమెంట్లు లేకుండా ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
పాన్, ఆధార్, నివాస రుజువు, ఆదాయ వివరాలు, గత రీపేమెంట్ హిస్టరీకి సంబంధించిన అన్ని వివరాలతో ఇప్పటికే రుణ గ్రహీత కేవైసీ తెలిసిన ప్రస్తుత బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థ ఖాతా ఖాతాదారులకు ఈ ఇన్స్టెంట్ లోన్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ క్లయింట్లు ఎటువంటి ఇతర డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రీ-అప్రూవ్డ్ సౌకర్యాలను ఆస్వాదిస్తున్నందున సజావుగా, వేగంగా పర్సనల్ లోన్ పొందొచ్చు.
డాక్యుమెంట్లు లేకుండా ఇన్స్టెంట్ లోన్ లాభాలు..
- స్మూత్ అప్లికేషన్ ప్రాసెస్: ఈ రుణాలు ప్రీ-అప్రూవ్డ్! దరఖాస్తు ప్రక్రియను చాలా సులభతరం చేస్తాయి. రుణగ్రహీతలు తక్కువ సమయంలో అనుమతి పొందవచ్చు. నిమిషాల్లో ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
- వేగవంతమైన చెల్లింపు: ఈ రుణాలు అత్యవసరాలు లేదా ఊహించని ఖర్చులకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే మొత్తం 30 నిమిషాల నుంచి 4 గంటల్లో మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.
- ఫ్లెక్సిబుల్ కాలపరిమితి: నెలవారీ చెల్లింపులు మరీ భారీగా ఉండకుండా చూసుకోవడానికి, రుణగ్రహీత వారి బడ్జెట్‌కు సరిపోయే నిబంధనలను ఎంచుకోవచ్చు.
- సులభమైన అర్హత: ఒక వ్యక్తి ఆదాయం, స్థిరత్వం, మొత్తం క్రెడిట్ హిస్టరీ వంటి సంకేతాలను నిర్ణయించడంలో రుణదాతలు అలసత్వం వహిస్తారు కాబట్టి, తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులు కూడా అర్హత సాధించవచ్చు.
- పోటీ వడ్డీ రేట్లు: వడ్డీ రేట్లు సాధారణంగా పేడే రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కంటే తక్కువగా ఉంటాయి. ఇది ఊహించని ఖర్చులను నిర్వహించడానికి చౌకైన మార్గంగా చేస్తుంది!
ఇవి తెలుసుకోండి..
- ఇప్పటికే ఉన్న రుణాలను చెల్లించండి: క్రెడిట్ అర్హతకు రుజువుగా, మంచి చెల్లింపు రికార్డును ఉంచుకోండి. రుణదాతలు గత బకాయిలను అనుమానించవచ్చు!
- మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోండి: మీ క్రెడిట్ స్కోర్ 685 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీకు ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ఆమోదం లభించే అవకాశం ఉంది. మంచి క్రెడిట్ స్కోర్ అనేది రుణదాతల విశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది.
- తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి: మీ రుణ-ఆదాయ నిష్పత్తిని 50% లేదా అంతకంటే తక్కువ వద్ద ఉంచడమే టర్గెట్గా పెట్టుకోండి. రుణాన్ని సులభంగా చెల్లించడానికి మీ వద్ద అదనపు డబ్బు ఉందని ఇది సూచిస్తుంది.
పేపర్ వర్క్ లేని వ్యక్తిగత రుణాలు అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో డబ్బు లోటును తీర్చినా.. అవి ప్రమాదకరమైనవి! స్వల్పకాలిక చెల్లింపులు చేసినప్పటికీ, వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు!
- లోన్ తీసుకోబోతున్న సంస్థ పేరుప్రఖ్యాతుల గురించి వివరంగా పరిశోధన చేయండి.
- ఇతర సంస్థల వడ్డీ రేట్లు, నిబంధనలను పోల్చి చూడండి.
- కష్టాలను నివారించడానికి మీ రీపేమెంట్ సామర్థ్యాలను అంచనా వేయండి.
(గమనిక: రుణం తీసుకోవడం దాని సొంత రిస్క్‌లతో వస్తుంది. కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.)
సంబంధిత కథనం