FM on 2,000 rupees notes: 2 వేల రూపాయల నోట్లపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన-no direction on loading or not loading rs 2 000 notes in atms fm nirmala sitharaman ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  No Direction On Loading Or Not Loading <Span Class='webrupee'>₹</span>2,000 Notes In Atms: Fm Nirmala Sitharaman

FM on 2,000 rupees notes: 2 వేల రూపాయల నోట్లపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

HT Telugu Desk HT Telugu
Mar 21, 2023 09:05 PM IST

2,000 rupees notes: రూ. 2 వేల రూపాయల నోట్ల సర్క్యులేషన్ కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) మంగళవారం కీలక వివరణ ఇచ్చారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Bloomberg)

2,000 rupees notes: రూ. 2 వేల రూపాయల నోట్ల గురించి పలు రకాలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. రూ. 2 వేల నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నారని, వాటిని రద్దు చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, రూ. 2 వేల నోట్ల చెలామణి విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) మంగళవారం కీలక ప్రకటన చేశారు.

ట్రెండింగ్ వార్తలు

2,000 rupees notes in ATMs: ఏటీఎంలపై డబ్బు జమ చేయడంపై..

ఏటీఎంలలో (ATM) డబ్బు నింపే విషయంలో తుది నిర్ణయం ఆయా బ్యాంకులదే అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) స్పష్టం చేశారు. ఏ ఏటీఎం (ATM) లో ఏ తరహా నోట్లు పెట్టాలనే విషయంలో బ్యాంకులదే తుది నిర్ణయమన్నారు. మార్చి 2017 నాటికి భారత్ లో సర్క్యులేషన్ లో ఉన్న రూ. 500, రూ. 2 వేల నోట్ల విలువ రూ. 9.512 కోట్లు అని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అదే, 2022 మార్చి చివరి నాటికి భారత్ లో సర్క్యులేషన్ లో ఉన్న రూ. 500, రూ. 2 వేల నోట్ల విలువ రూ. 27.057 కోట్లు అని ఆర్బీఐ వెల్లడించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) లోక్ సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. రూ. 2 వేల నోట్లను ఏటీఎం (ATM) లలో పెట్టకూడదని ఎలాంటి ఆదేశాలు బ్యాంకులకు ఇవ్వలేదని, ఈ విషయంలో బ్యాంకులే వినియోగదారుల విత్ డ్రాయల్ సరళి ఆధారంగా ఎటీఎం (ATM) లలో వివిధ విలువల్లో నగడును జమ చేస్తుంటాయని ఆమె వివరించారు.

central government debt: మొత్తం అప్పు..

మరో ప్రశ్నకు సమాధానంగా.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అప్పు (central government total debt) సుమారు రూ. 155. 8 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు. ఇది జీడీపీ (GDP)లో 57.3% గా ఉంది. ఇందులో విదేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకున్న అప్పు (external debt) రూ. 7.03 లక్షల కోట్లు అని తెలిపారు. ఈ మొత్తం జీడీపీ (GDP) లో 2.6% అని, మొత్తం అప్పులో ఈ ఎక్స్ టర్నల్ డెట్ (external debt), ప్రస్తుత ఎక్స్ చేంజ్ రేట్ ప్రకారం 4.5% మాత్రమేనని వివరించారు.

WhatsApp channel