Driverless cars : 'సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లను ఇండియాలో అడుగుపెట్టనివ్వను!'-nitin gadkari on driverless cars in india says wont allow them ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Driverless Cars : 'సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లను ఇండియాలో అడుగుపెట్టనివ్వను!'

Driverless cars : 'సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లను ఇండియాలో అడుగుపెట్టనివ్వను!'

Sharath Chitturi HT Telugu
Dec 19, 2023 11:15 AM IST

Driverless cars in India : సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లను ఇండియాలోకి రానివ్వనని తేల్చిచెప్పారు కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ. వాటితో లక్షలాది మంది డ్రైవర్లు ఉద్యోగాలు కోల్పోతారని అన్నారు.

సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లను ఇండియాలో అడుగుపెట్టనివ్వను!'
సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లను ఇండియాలో అడుగుపెట్టనివ్వను!' (AFP)

Driverless cars in India : ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా.. ఆటోమొబైల్​ రంగంలో కూడా పెను మార్పులు కనిపిస్తున్నాయి. వీటిల్లో ముఖ్యమైనది.. డ్రైవర్​ రహిత కార్లు! ఈ సెల్ఫ్​ డ్రైవింగ్​, ఆటోమెటిక్, ఆటోనోమస్​​ కార్లకు డిమాండ్​ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్​లెస్​ కార్లను ఇండియాలో అడుగుపెట్టనివ్వని తేల్చి చెప్పేశారు.

'ఉద్యోగాలు పోతాయి.. ఆ కార్లు వద్దు!'

రోడ్డు భద్రత అంశంపై.. ఐఐఎం నాగ్​పూర్​లో జరిగిన జీరో మైల్​ సంవాద్​ కార్యక్రమంలో పాల్గొన్నారు నితిన్​ గడ్కరీ. ఈ నేపథ్యంలోనే సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లకు ఇండియాలో చోటు లేదని తేల్చేశారు.

"సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లను నేను ఇండియాలోకి రానివ్వను. అవి వస్తే.. చాలా మంది డ్రైవర్ల ఉద్యోగాలు పోతాయి. అలా నేను జరగనివ్వను," అని అన్నారు నితిన్​ గడ్కరీ.

Self driving cars in India : "డ్రైవర్​లెస్​, సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్ల టెక్నాలజీ.. చిన్న జనాభా ఉన్న దేశాలకు ఉపయోగపడుతుంది. ఇండియాకు కాదు. ఇండియాలో 80లక్షలకుపైగా మంది ప్రజలు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. డ్రైవర్​లెస్​ కార్లు వస్తే చాలా నష్టం కలుగుతుంది," అని నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు.

సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లకు వ్యతిరేకంగా కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి మాట్లాడటం ఇది మొదటిసారి కాదు. 2017 నుంచి ఆయన ఈ విషయంపై ఓ స్టాండ్​ తీసుకున్నారు. ఇండియాలో సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లకు చోటు లేదని స్పష్టం చేస్తూ వచ్చారు.

సెల్ఫ్​ డ్రైవింగ్​ వాహనాలంటే ఏంటి..?

Nitin Gadkari on driverless cars : సాధారణంగా.. కారు నడపడానికి ఓ వ్యక్తి స్టీరింగ్​ పట్టుకోవాలి. ఇప్పుడొస్తున్న టెక్నాలజీతో క్రూజ్​ కంట్రోల్​ వాడితే, హైవేలో స్టీరింగ్​పై చెయ్యి పెట్టకుండానే వెహికిల్​ దానంతటత అదే, ఒక స్పీడ్​లో కదులుతుంది. ఇక సెల్ఫ్​ డ్రైవింగ్​, ఆటోనోమస్​, డ్రైవర్​ లెస్​ కార్లలో దాదాపు మనిషి జోక్యం అవసరమే ఉండదు!

కారుకు అమర్చే వివిధ కెమెరాలు, సెన్సార్​లు, రాడార్​లు, నేవిగేషన్​ సిస్టెమ్​తో ఈ సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లు పనిచేస్తాయి. అయితే.. కారును పూర్తిగా మెషిన్​ చేతిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్​ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా టెక్నాలజీతో ప్రమాదాలు మరింత పెరుగుతాయా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

Nitin Gadkari latest news : అదే సమయంలో.. ఈ టెక్నాలజీపై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​.. వీటిని ముందుండి నడిపిస్తున్నారనే చెప్పాలి. ఇప్పటికే.. ఆటో పైలట్​ సిస్టెమ్​ని తీసుకొచ్చరు. ఇతర సంస్థలు కూడా ఈ టెక్నాలజీపై ఫోకస్​ చేయడం మొదలుపెట్టాయి.

కానీ.. ఆటో పైలట్​ సిస్టెమ్​లో లోపాలు ఉన్నట్టు భావించిన టెస్లా.. ఇటీవలే 20లక్షలకుపైగ వాహనాలను రీకాల్​ చేయడం గమనార్హం.

సంబంధిత కథనం