‘‘ఇప్పుడైతే జీరోదా బ్రోకరేజ్ సంస్థను స్టార్ట్ చేసి ఉండేవాళ్లం కాదు’’ - నితిన్ కామత్-nithin kamath says he would not have started zerodha in 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ‘‘ఇప్పుడైతే జీరోదా బ్రోకరేజ్ సంస్థను స్టార్ట్ చేసి ఉండేవాళ్లం కాదు’’ - నితిన్ కామత్

‘‘ఇప్పుడైతే జీరోదా బ్రోకరేజ్ సంస్థను స్టార్ట్ చేసి ఉండేవాళ్లం కాదు’’ - నితిన్ కామత్

Sudarshan V HT Telugu

ఇప్పుడున్న పరిస్థితుల్లో జీరోధా సంస్థను స్థాపించి ఉండేవాళ్లం కాదని ఆన్లైన్ బ్రోకరేజీ ప్లాట్ ఫామ్ జీరోధా కో ఫౌండర్, సీఈఓ నితిన్ కామత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లో డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలు చాలా ఉన్నాయన్నారు. వాటిమధ్య మరో బ్రోకరేజ్ సంస్థను స్థాపించడంలో అర్థం లేదన్నారు.

జీరోధా కో ఫౌండర్, సీఈఓ నితిన్ కామత్ (Instagram/Nithin Kamath)

2025 లో అయితే, మీరు ఎలాంటి సంస్థను స్థాపించేవారు? అన్న ఒక యూజర్ ప్రశ్నకు ఆన్ లైన్ బ్రోకరేజీ ప్లాట్ ఫామ్ జెరోధా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ బుధవారం ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 2025లో అయితే, జీరోధాను స్థాపించి ఉండేవాళ్లం కాదన్నారు. తన ట్రేడింగ్ ప్రశ్నోత్తరాల ప్లాట్ ఫామ్ లో ఒక పోస్ట్ కు సమాధానమిస్తూ ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం మార్కెట్లు బ్రోకరేజీ సంస్థలతో రద్దీగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో, అదే తరహా సేవలను అందించే మరో బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు.

పదేళ్లలో మంచి వృద్ధి

గత 10 సంవత్సరాలలో తమ సంస్థ జీరోధా బాగా అభివృద్ధి చెందిందని కామత్ అన్నారు. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజే.. అప్పటికే మార్కెట్లో ఉన్న "ఉత్తమమైన" ప్రత్యర్థిని ఓడించడానికి ప్రయత్నించడంలో అర్థం లేదని కామత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మార్కెట్లో జెరోధా, గ్రో, అప్ స్టాక్స్, ఏంజిల్ వన్ వంటి డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలు ఉన్నాయి. 2025 మార్చి నాటికి భారతదేశంలో 3.94 కోట్లకు పైగా డీమ్యాట్ ఖాతాలు యాక్టివ్ గా ఉన్నాయి.

2025లో నితిన్ కామత్ ఏం చేసేవాడు?

గతంలో కాకుండా, ఇప్పుడు ఏదైనా సంస్థను ప్రారంభించాలనుకుంటే, ఎలాంటి సంస్థను స్థాపిస్తారు? అన్న మానవ్ అగర్వాల్ అనే జెరోధా కమ్యూనిటీ యూజర్ ప్రశ్నకు నితిన్ కామత్ సమాధానమిచ్చారు. సాధారణ బ్రోకరేజ్ సంస్థను కాకుండా, యూజర్లు అత్యంత ఉత్తమమైన ప్రయోజనాలను అందించే బ్రోకరేజీ సంస్థను ప్రారంభించి ఉండే వాడినేమో అని అన్నారు. ఇతర పోటీ సంస్థల కన్నా యూజర్ కు మెరుగైన ప్రయోజనాలు అందించి, ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తానని చెప్పారు. అయితే, ఈ ప్రయత్నం తక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని, అయితే దీని నుండి ప్రజలు "గణనీయంగా" సంపాదించే అవకాశం ఉందని కామత్ అన్నారు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం