Stock market today: తేరుకుని, పుంజుకున్న స్టాక్ మార్కెట్; హెచ్ఎంపీవీపై భయాలు పోయినట్లేనా?
Stock market today: భారతీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల వరుస పతనాల తరువాత మంగళవారం కాస్త తేరుకున్నాయి. నిఫ్టీ 50 0.39% లాభంతో 23,707 వద్ద సెషన్ ను ముగించగా, సెన్సెక్స్ మునుపటి ముగింపుతో పోలిస్తే 0.30% లాభంతో 78,199 వద్ద సెషన్ ను ముగించింది.
Stock market today: రెండు రోజుల వరుస నష్టాల తర్వాత ఫ్రంట్ లైన్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 ఆకుపచ్చ రంగులో ముగిశాయి. దాంతో జనవరి 7న ట్రేడింగ్ సెషన్ లో బుల్స్ నుంచి భారత మార్కెట్లకు (stock market) ఎంతో అవసరమైన ప్రోత్సాహం లభించింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించి కొంత తగ్గిన ఆందోళనలు ఇలా మార్కెట్లు పుంజుకోవడానికి కారణమని భావిస్తున్నారు. ఈ ర్యాలీకి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి దిగ్గజాలు సపోర్ట్ చేశాయి.
బ్రాడ్ మార్కెట్ దూకుడు
ఆకుపచ్చ రంగులో సెషన్ ముగిసినప్పటికీ ఇన్వెస్టర్లు అధిక స్థాయిలో లాభాలను నమోదు చేసుకోవడంతో ఫ్రంట్ లైన్ సూచీలు చివర్లో తమ ప్రారంభ లాభాలను వదులుకున్నాయి. ఫ్రంట్ లైన్ సూచీలకు అనుగుణంగా, విస్తృత మార్కెట్ కూడా సెషన్ లో గరిష్ట స్థాయిల నుండి బయటకు వచ్చింది. మెరుగైన పనితీరును కనబరిచింది. జనవరి 7న నిఫ్టీ 50 0.39% లాభంతో 23,707 వద్ద సెషన్ ను ముగించగా, సెన్సెక్స్ (sensex) మునుపటి ముగింపుతో పోలిస్తే 0.30% లాభంతో 78,199 వద్ద సెషన్ ను ముగించింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.35 శాతం లాభంతో 18,673 వద్ద, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.89 శాతం లాభంతో 56,869 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను ముగించాయి.
రెండు సెషన్లలో 2 శాతం లాస్
గత రెండు సెషన్లలో, సెన్సెక్స్, నిఫ్టీ 50 చెరో 2 శాతానికి పైగా పడిపోయాయి. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలను నిపుణులు చూపుతున్నారు. అవి, యూఎస్ బాండ్ ఈల్డ్స్ స్థిరంగా పెరగడం, భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కావడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలు.. ఇవే గత రెండు రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్ పతనమవడానికి ప్రధాన కారణాలని నిపుణులు తెలిపారు.
అన్ని సెక్టార్లు గ్రీన్ లో..
నిఫ్టీ ఐటీ మినహా అన్ని ప్రధాన సెక్టోరల్ ఇండెక్స్ లు మంగళవారం ఆకుపచ్చ రంగులో స్థిరపడగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.64 శాతం లాభపడింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ సీపీఎస్ఈ, నిఫ్టీ ఇన్ఫ్రా 0.8 శాతం నుంచి 1.36 శాతం మధ్య లాభపడ్డాయి. వ్యక్తిగత స్టాక్స్ పరంగా చూస్తే నిఫ్టీ 500 షేర్లలో కిర్లోస్కర్ బ్రదర్స్ టాప్ పెర్ఫార్మర్ గా అవతరించింది. ఏజిస్ లాజిస్టిక్స్, ఇంటెలిజెన్స్ డిజైన్ ఎరీనా, పీటీసీ ఇండస్ట్రీస్, రాష్ట్రీయ కెమికల్స్, విజయ డయాగ్నస్టిక్ సెంటర్, బయోకాన్, జస్ట్ డయల్, మరో 24 షేర్లు 4 శాతానికి పైగా లాభంతో ముగిశాయి.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవి. హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.