Stock market: ఈ రోజు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్; ఈ పతనానికి కారణాలేంటి?
Stock market today: స్టాక్ మార్కెట్లో వారంతం రోజైన శుక్రవారం ఒడిదుడుకులు కొనసాగాయి. చివరకు దాదాపు 1 % నష్టాలతో సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్ ను ముగించాయి. నిఫ్టీ 270 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టంతో 24,530.90 వద్ద, సెన్సెక్స్ 739 పాయింట్లు లేదా 0.91 శాతం నష్టంతో 80,604.65 వద్ద ముగిశాయి.
Stock market today: జూలై 19, శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లో (Stock market) ఆల్ రౌండ్ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ లు సుమారు 1 శాతం నష్టపోవడానికి కారణమైంది. వచ్చే వారం కేంద్ర బడ్జెట్ కు ముందు ఇన్వెస్టర్లు అన్ని రంగాల్లో లాభాల స్వీకరణకు వెళ్లడంతో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలు మరింత భారీ క్షీణతను చవిచూశాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు కూడా దేశీయ మార్కెట్ తిరోగమనానికి దోహదం చేశాయి.

లాభాల ర్యాలీకి బ్రేక్
గత నాలుగు సెషన్లలో వరుసగా విజయ పరంపరను కొనసాగించిన నిఫ్టీ శుక్రవారం 270 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టంతో 24,530.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 739 పాయింట్లు లేదా 0.91 శాతం నష్టంతో 80,604.65 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి.
8 లక్షల కోట్లు ఆవిరి..
బీఎస్ఈ (BSE)లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లో దాదాపు రూ.454.3 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.446.3 లక్షల కోట్లకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఒకే సెషన్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు నష్టపోయారు. సెషన్లో స్వల్ప పెరుగుదల సమయంలో సెన్సెక్స్ 81,587.76, నిఫ్టీ 24,854.80 వద్ద సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి.
నిఫ్టీ లో 46 స్టాక్స్ కు నష్టాలే
నిఫ్టీ 50 (Nifty 50) ఇండెక్స్ లో 46 షేర్లు నష్టాల్లో ముగియగా, ఇన్ఫోసిస్ (1.78 శాతం), ఐటీసీ (0.62 శాతం), ఏషియన్ పెయింట్స్ (0.60 శాతం), బ్రిటానియా (0.06 శాతం) మాత్రమే ఆకుపచ్చ రంగులో ముగిశాయి. టాటా స్టీల్ (4.97 శాతం), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (4.68 శాతం), బీపీసీఎల్ (3.98 శాతం) నష్టపోయాయి.
ఈ రోజు మార్కెట్ ఎందుకు పడిపోయింది?
భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగియడానికి 4 ప్రధాన కారణాలని నిపుణులు గుర్తించారు. అవి..
1. బలహీన అంతర్జాతీయ సంకేతాలు
అమెరికా అధ్యక్ష రేసు ఫలితంపై అనిశ్చితి నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బలహీనమైన చైనా స్థూల డేటా, చైనా-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం కూడా సెంటిమెంటును దెబ్బతీశాయి.
2. కేంద్ర బడ్జెట్ కు ముందు జాగ్రత్త
బలహీన అంతర్జాతీయ సంకేతాలతో పాటు, మంగళవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ కు ముందు జాగ్రత్త కూడా ఇన్వెస్టర్లను రిస్క్ ఈక్విటీలకు దూరంగా ఉంచింది. ద్రవ్య స్థిరీకరణ, ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించే వృద్ధి అనుకూల బడ్జెట్ ను ప్రభుత్వం ప్రకటిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ, నిపుణులు ప్రజాకర్షక పథకాలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
3. మైక్రోసాఫ్ట్ ఔటేజ్
మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ కావడం, ఇది ప్రపంచవ్యాప్తంగా హెల్త్, బ్యాంకింగ్, ట్రావెల్, విమాన యాన సేవల్లో అంతరాయానికి కారణం కావడం కూడా స్టాక్ మార్కెట్ పతనానికి కారణం.
5. వాల్యుయేషన్ పై ఆందోళనలు
రిచ్ మార్కెట్ వాల్యుయేషన్ పై ఆందోళనలు కూడా ప్రాఫిట్ బుకింగ్ ను ప్రేరేపించే అంశంగా భావిస్తున్నారు. నిఫ్టీ 50 రెండేళ్ల సగటు ప్రైస్ టు ఎర్నింగ్స్ (PE) నిష్పత్తి కంటే ఎక్కువగా ట్రేడవుతోంది.