సరికొత్త అవతారంలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీ- కియా సెల్టోస్​ అప్డేటెడ్​ వర్షెన్​ లాంచ్​ ఎప్పుడు?-nextgen kia seltos likely to launch in 2026 expected design features and upgrades ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సరికొత్త అవతారంలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీ- కియా సెల్టోస్​ అప్డేటెడ్​ వర్షెన్​ లాంచ్​ ఎప్పుడు?

సరికొత్త అవతారంలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీ- కియా సెల్టోస్​ అప్డేటెడ్​ వర్షెన్​ లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu

Next-Gen Kia Seltos : కియా సెల్టోస్​ ఎస్​యూవీ అప్డేటెడ్​ వర్షెన్​ లాంచ్​పై పలు విషయాలు బయటకు వచ్చాయి. ఈ మోడల్​ 2026లో లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

కియా సెల్టోస్​

కియా సెల్టోస్ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన మోడల్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా దాని అగ్రెసివ్​ డిజైన్ లాంగ్వేజ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సెకెండ్​ జనరేషన్​ కియా సెల్టోస్​పై బిగ్​ అప్డేట్​! ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ 2026 ద్వితీయార్ధంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దాని సెగ్మెంట్​లోనే బలమైన పోటీదారుగా ఉన్న ఈ కాంపాక్ట్ ఎస్​యూవీ.. అనేక ఫీచర్ అప్​గ్రేడ్​లతో పాటు ప్రధాన డిజైన్ మార్పులతో రానుంది.

అప్డేటెడ్​ కియా సెల్టోస్..

రెండొవ తరం సెల్టోస్ ఆశించిన డిజైన్ స్పై షాట్లు రాబోయే కాంపాక్ట్ ఎస్​యూవీ రేర్​ ప్రొఫైల్​ను ప్రదర్శించాయి. కియా ఈవీ5ను గుర్తుచేసే డిజైన్​తో, టెయిల్ లైట్లు ఆధునిక ఈవీ ఎలిమెంట్స్​ని సంప్రదాయ ఐసీఈ సౌందర్యంతో మిళితం చేస్తాయి. స్పై ఫోటో ప్రకారం, టెయిల్ లైట్లు పొడవుగా ఉంటాయి. బూట్​ నుంచి వెనుక విండో మీటింగ్ పాయింట్ నుంచి బంపర్ వరకు విస్తరించి ఉంటాయి.

ఇదిలా ఉంటే సెల్టోస్ సిల్హౌట్ మాత్రం మారదని స్పై ఫొటోలు చెబుతున్నాయి. అయితే, రెండొవ తరం సెల్టోస్ ఎస్​యూవీ కొంచెం పొడవుగా ఉండవచ్చు! అంటే ప్రయాణికులకు లేదా లగేజీకి అదనపు స్థలం ఉండవచ్చు. గమనించిన ఇతర డిజైన్ భాగాలలో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్లు ఉన్నాయి.

కియా సెల్టోస్: ఆశించిన ఇంటీరియర్- క్యాబిన్ మార్పులు..

2025 కియా సెల్టోస్ సంస్థకు చెందిన సరికొత్త మోడళ్ల నుంచి ప్రేరణ పొంది సమకాలీన, మినిమలిస్ట్ ఇంటీరియర్ డిజైన్​ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కియా ఈవీ9 నుంచి డిజైన్ ఎలిమెంట్స్ తీసుకునేటప్పుడు సీట్లకు ఎక్కువ ప్రీమియం లభించే అవకాశం ఉంది. రేర్ సీట్ ఏరియా, డోర్ ప్యానెల్స్ కూడా కొత్త డిజైన్​ను చూడవచ్చు. మెరుగైన కంఫర్ట్, మరింత అధునాతన రూపాన్ని అందిస్తుంది.

కొత్త సెల్టోస్ డ్యాష్​బోర్డ్ డిజైన్​లో భారీ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ట్రిపుల్ స్క్రీన్ కాన్ఫిగరేషన్​ని జోడించే దిశగా రూమర్స్​ వినిపిస్తున్నాయి. ఇందులో 12.3 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, అదే పరిమాణంలో డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లే, కియా సైరోస్ మాదిరిగానే క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్స్ కోసం ప్రత్యేక 5 ఇంచ్​ స్క్రీన్ ఉండవచ్చు.

రాబోయే కియా సెల్టోస్ ఇతర ప్రధాన ఆకర్షణలు పనోరమిక్ సన్ రూఫ్, వైర్​లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయెల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్​తో ఎలక్ట్రికల్​గా అడ్జెస్ట్​ చేయగల ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు మరింత ప్రీమియం, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని కలిగిస్తాయి.

ఆరు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం (టీపీఎంఎస్) వంటి విస్తారమైన ప్యాకేజీతో తదుపరి తరం సెల్టోస్ ఎస్​యూవీలో భద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎస్​యూవీలో లెవల్ -2 అడ్వాన్స్​డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇది లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ వంటి విధులను కలిగి ఉంటుంది.

అప్డేటెడ్​ కియా సెల్టోస్: ఇంజిన్​..

రాబోయే సెల్టోస్​కి మరో ముఖ్యమైన మార్పు దాని ఇంజిన్​ అవ్వొచ్చు! రెండొవ తరం కియా సెల్టోస్ 1.6-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్​ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది హ్యుందాయ్ కోనా హైబ్రిడ్​లో కనిపిస్తుంది. 141 హార్స్ పవర్​ని జనరేట్​ చేస్తుంది. అయితే ప్రత్యేకతలు ఇప్పటికీ గోప్యంగా ఉన్నాయి.

అంతేకాకుండా, కొత్త మోడల్ ప్రస్తుత లైనప్ 158 బీహెచ్​పీ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లు, 114 బీహెచ్​పీ డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ క్లచ్ లెస్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, సీవీటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​పై రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్స్​ అందుబాటులోకి రావొచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం