Skoda Kodiaq : సరికొత్త అవతారంలో బెస్ట్​ సెల్లింగ్​ ప్రీమియం ఎస్​యూవీ- ధర కూడా ఎక్కువే!-newgen skoda kodiaq india launch confirmed in may 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Skoda Kodiaq : సరికొత్త అవతారంలో బెస్ట్​ సెల్లింగ్​ ప్రీమియం ఎస్​యూవీ- ధర కూడా ఎక్కువే!

Skoda Kodiaq : సరికొత్త అవతారంలో బెస్ట్​ సెల్లింగ్​ ప్రీమియం ఎస్​యూవీ- ధర కూడా ఎక్కువే!

Sharath Chitturi HT Telugu
Nov 08, 2024 09:00 AM IST

బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన స్కోడా కొడియాక్​కి అప్​గ్రేడెడ్​ వర్షెన్​, ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

సరికొత్త అవతారంలో బెస్ట్​ సెల్లింగ్​ ప్రీమియం ఎస్​యూవీ!
సరికొత్త అవతారంలో బెస్ట్​ సెల్లింగ్​ ప్రీమియం ఎస్​యూవీ!

నెక్ట్స్ జనరేషన్ స్కోడా కొడియాక్ గత సంవత్సరం అంతర్జాతీయంగా అరంగేట్రం చేసింది. ఇప్పుడు భారతదేశంలో ఈ ప్రీమియం ఎస్​యూవీని లాంచ్ చేయడానికి సంస్థ రెడీ అవుతోంది. కొత్త తరం కొడియాక్ మే 2025 నాటికి ఇండియాలో సేల్​కి వస్తుంది. ఈ మోడల్​ని భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేయడం జరుగుతుంది. 

కొత్త తరం స్కోడా కొడియాక్ ప్రస్తుతం భారతదేశంలో టెస్టింగ్ దశలో ఉందని స్కోడా ఆటో ఇండియా డైరక్టర్​ పీటర్ జానెబా వెల్లడించారు. లోకల్​ అసెంబ్లింగ్​ 2025 మార్చిలో ప్రారంభించాలని, అక్కడి నుంచి కొన్ని వారాల తర్వాత సేల్స్​ని స్టార్ట్​ చేయాలని చూస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కొడియాక్​ని మహారాష్ట్ర ఔరంగాబాద్​లోని ఆటోమొబైల్ తయారీ కేంద్రంలో అసెంబ్లింగ్ చేస్తారు.

దీని అర్థం ప్రస్తుతం ఉన్న స్కోడా కొడియాక్ సేల్స్​ భారతదేశంలో ఇంకొంత కాలం కొనసాగుతాయి. ప్రస్తుత కొడియాక్ ఏడేళ్ల క్రితం భారతదేశంలో అమ్మకానికి వచ్చింది!

కొత్త స్కోడా కొడియాక్: ఏమి ఆశించాలి?

కొత్త తరం స్కోడా కొడియాక్ ప్రస్తుత మోడల్ ఆధారంగానే ఉంటుంది. ఇది ఎక్స్​టీరియర్, ఇంటీరియర్, ఫీచర్ లిస్ట్ నుంచి ప్రతిదాన్ని అప్డేట్ చేస్తుంది. ఈ ఎస్​యూవీలో భారీ బటర్​ఫ్లై గ్రిల్, ఇరువైపులా స్ప్లిట్ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్ ఉన్నాయి. 2డీ స్కోడా లోగో బానెట్​పై ఉంటుంది. కొత్త కొడియాక్ దాని బాక్సీ ప్రొఫైల్​ను నిలుపుకుంటుంది. అయితే స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్​లు రగ్​డ్​ రూపాన్ని మరింత పెంచుతాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్​లైట్లు ఉన్నాయి. 'స్కోడా' టెయిల్​గేట్​ని కలిగి ఉంది. ఇది ఇప్పుడు కొత్త కైలాక్​లో కూడా కనిపిస్తుంది.

10-ఇంచ్​ వర్చువల్ కాక్​పిట్, ఫ్రీస్టాండింగ్ 13-ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్​ప్లేతో పాటు మరెన్నో ఫీచర్స్​ ఈ ఎస్​యూవీ క్యాబిన్​లో ఉంటాయి.

కొత్త స్కోడా కొడియాక్ ఇంజిన్​..

2.0-లీటర్ టర్బో పెట్రోల్ టీఎస్ఐ ఇంజిన్ 188 బీహెచ్​పీ పవర్​, 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ ఎస్​యూవీ ఇతర వీడబ్ల్యూ గ్రూప్ కార్లతో భాగస్వామ్యం చేసిన ఎంక్యూబీ ఇవో ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. ఈ ఎస్​యూవీ పూర్తిగా లోడ్ చేసిన ఎల్ అండ్ కె ట్రిమ్​లో వస్తుందని ఆశించండి. కానీ లాంచ్ సమయంలో మరిన్ని వేరియంట్లు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

ప్రస్తుత స్కోడా కొడియాక్ ధర రూ .39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). మీకు ఆసక్తి ఉంటే ఇంటికి తీసుకురావడానికి ఇది మంచి సమయం. నెక్ట్స్ జనరేషన్ మోడల్ ధర పెరిగే అవకాశం ఉంది! దీని ధర సుమారు రూ .45-50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. కొత్త కొడియాక్ టయోటా ఫార్చ్యూనర్, వోక్స్ వ్యాగన్ టిగువాన్, జీప్ మెరిడియన్ మరియు కొత్త ఫోర్డ్ ఎవరెస్ట్ (ఎండీవర్) లతో పోటీ పడనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం