ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కరెంట్ బిల్లు తక్కువే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్ ఇచ్చే ఈవీ లాంచ్-new zelio e legender low speed electric scooter launched with 150 km range at budget price know top things ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కరెంట్ బిల్లు తక్కువే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్ ఇచ్చే ఈవీ లాంచ్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కరెంట్ బిల్లు తక్కువే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్ ఇచ్చే ఈవీ లాంచ్

Anand Sai HT Telugu

జనాలకు ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద ఆసక్తి పెరుగుతుండటంతో కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు జెలియో కంపెనీ లెజండర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది.

జెలియో లెజండర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటైన జెలియో ఈ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాని లెజెండరీ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్స్ కలిపి ఫేస్‌లిఫ్ట్ లెజెండర్‌ను ఆకట్టుకునేలా చేశాయి.

బ్యాటరీ ఆప్షన్స్, ధరలు

ఈ కొత్త స్కూటర్ మూడు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లలో, మూడు కొత్త రంగుల్లో లభిస్తుంది. రస్టీ ఆరెంజ్, గ్లోసీ గ్రీన్, గ్లోసీ గ్రే రంగుల్లో ఎంచుకోవచ్చు. 60V/30A వేరియంట్ ధర రూ. 75,000 కాగా, 74V/32A వేరియంట్ ధర రూ. 79,000. రెండు వేరియంట్‌లలో లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి.

ఈ స్కూటర్‌లో 32AH జెల్ బ్యాటరీ వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ. 65,000. ఈ స్కూటర్లు గరిష్టంగా 25 కి.మీ./గంటకు వేగంతో ప్రయాణించగలవు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్ ఇస్తాయి. ఇది అధిక పనితీరు గల 60/72V బీఎల్‌డీసీ మోటారుతో పనిచేస్తుంది. ఇది ఛార్జ్‌కు 1.5 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది. ఛార్జింగ్ సమయం వేరియంట్‌ను బట్టి మారుతుంది. లిథియం-అయాన్ మోడల్‌లు 4 గంటల్లో, జెల్ బ్యాటరీ మోడల్ 8 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి.

వారంటీ వివరాలు

జెలియో వాహనంపై 2 సంవత్సరాల వారంటీని, అన్ని బ్యాటరీ వేరియంట్లపై 1 సంవత్సరం వారంటీని అందిస్తోంది. అదనంగా జెలియో మొదటి 1,000 మంది కస్టమర్లు ఉచిత సేఫ్టీ హెల్మెట్ పొందడానికి ప్రత్యేక ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది అని కంపెనీ తెలిపింది. ఇందులో ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఫీచర్లు

ముందు టెలిస్కోపిక్, వెనుక డ్యూయల్ స్ప్రింగ్-లోడెడ్ సస్పెన్షన్ కఠినమైన రోడ్లపై కూడా మృదువైన ప్రయాణాన్ని అందిస్తాయి. స్టైలిష్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, ఇండికేటర్‌లు స్కూటర్‌ను స్టైలిష్‌గా చేస్తాయి. దీని డిజిటల్ డ్యాష్‌బోర్డ్ కూడా రైడర్‌కు పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.

ఈ స్కూటర్ కీలెస్ ఎంట్రీ, మొబైల్ ఛార్జింగ్, యాంటీ-థెఫ్ట్ డిటెక్షన్, ప్రాక్సిమిటీ లాక్-అన్‌లాక్, పార్క్ అసిస్ట్, ఫాలో-మీ-హోమ్ లైట్లు, ఎస్ఓఎస్ హెచ్చరికలు, క్రాష్, ఫాల్ డిటెక్షన్, వాహన విశ్లేషణలు.. లెజెండర్‌ను సిటీ ప్రయాణానికి స్మార్ట్ ఆప్షన్‌గా చేస్తాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.