New YouTube features: హమ్ చేస్తే చాలు.. పాట ప్లే అవుతుంది; యూట్యూబ్ లో కొత్తగా చాలా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్
New YouTube features: సోషల్ మీడియా సంచలనం యూట్యూబ్ లో కొత్తగా చాలా ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో స్టేబుల్ వ్యాల్యూమ్, యు ట్యాబ్, సాంగ్ సెర్చ్ బై హమ్మింగ్.. వంటి ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం (YouTube)
New YouTube features: యూట్యూబ్ యాప్, టీవీ, వెబ్ వర్షన్స్ లో ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు, ఆసక్తులకు అనుగుణంగా కొత్త ఫీచర్స్ ను యాడ్ చేస్తుంటుంది. తాజాగా, పలు కొత్త ఫీచర్స్ ను యూట్యూబ్ యాప్, వెబ్ వర్షన్స్ లో యూట్యూబ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజైన్ లో మార్పులు చేయడంతో పాటు, కొత్తగా దాదాపు 30 కి పైగా ఫీచర్స్ ను యాడ్ చేసింది. అలాగే, మోడర్న్ లుక్ తో కనిపించే కొత్త డిజైన్ లో యూట్యూబ్ కనిపిస్తోంది.
ఆ ఫీచర్స్ ఇవే..
- ఆడియో కంట్రోల్ (Stable Volume): యూట్యూబ్ యాప్ లో కొత్తగా స్టేబుల్ వ్యాల్యూమ్ (Stable Volume) ఫీచర్ ను తీసుకువచ్చారు. దీని వల్ల కంటెంట్ తో పాటు సౌండ్ లో మార్పులు ఉండవు. కంటెంట్ ఏదైనా ఒకే స్థాయిలో సౌండ్ ఔట్ పుట్ ఉంటుంది. అందువల్ల, కంటెంట్ మారగానే ఒక్కసారిగా సౌండ్ పెరగడం, తగ్గడం వంటివి జరగవు.
- సరికొత్త యూ ట్యాబ్ (You Tab): యూ ట్యూబ్ లోని యు ట్యాబ్ లో కొత్త ఫీచర్స్ ను పొందుపర్చారు. యూజర్ కు సంబంధించిన లైబ్రరీ ట్యాబ్ ను, అకౌంట్ పేజీని కలిపేసి, ఒకే ట్యాబ్ గా యూ ట్యాబ్ (You Tab) పేరుతో ఏర్పాటు చేశారు. ఇక్కడే యూజర్ ప్లే లిస్ట్, డౌన్ లోడ్స్, చూసిన వీడియోలు, కొనుగోళ్లు, చానల్ డిటైల్స్, ఇతర అకౌంట్ సంబంధించిన వివరాలు ఉంటాయి.
- పాట హమ్ చేసి సెర్చ్ చేయొచ్చు (Search songs by humming): ఇకపై యూట్యూబ్ లో మీరు చూడాలనుకుంటున్న పాటను పాడడం ద్వారా కానీ, పాట గుర్తు లేకపోతే ట్యూన్ ను హమ్ చేయడం ద్వారా కానీ సెర్చ్ చేయవచ్చు. కృత్రిమ మేథ సహాయంతో ఆ పాటను యూట్యూబ్ గుర్తిస్తుంది. ఈ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
- లాక్ స్క్రీన్ (lock screen): యూట్యూబ్ కొత్తగా లాక్ స్క్రీన్ ను ఇంట్రడ్యూస్ చేసింది. మొబైల్, ట్యాబ్లెట్ లలో అందుబాటులోకి వచ్చిన ఈ లాక్ స్క్రీన్ ద్వారా అనుకోకుండా యూట్యూబ్ స్క్రీన్ ను ట్యాప్ చేయకుండా అడ్డుకోవచ్చు. దానివల్ల, మీరు చూస్తున్న కంటెంట్ ను అనవసర అంతరాయం లేకుండా చూడవచ్చు.
- ఈ ఫీచర్స్ లో కొన్ని ఇప్పటికే అందుబాటులోకి రాగా.. మరికొన్నింటిని రానున్న కొన్ని వారాల్లో క్రమంగా అందుబాటులోకి తీసుకువస్తామని యూట్యూబ్ తెలిపింది.
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.