Range Rover Sport : ‘రేంజ్ రోవర్ స్పోర్ట్’ అదిరింది.. డెలివరీ షురూ!
Range Rover Sport delivery begins : రేంజ్ రోవర్ స్పోర్ట్ డెలివరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వెహికిల్ స్పెసిఫికేషన్స్‌తో పాటు ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Range Rover Sport delivery begins : దేశంలో సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్ డెలివరీని ప్రారంభించినట్టు జాగ్వర్ లాండ్ రోవర్ సంస్థ ప్రకటించింది. డైనమిక్ ఎస్ఈ, డైనమిక్ హెచ్ఎస్ఈ, ఆటోబయోగ్రఫి, ఫస్ట్ ఎడిషన్ వేరియంట్లలో ఈ రేంజ్ రోవర్ స్పోర్ట్ అందుబాటులో ఉండనుంది. ఫస్ట్ ఎడిషన్ కేవలం ఒక ఏడాది మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ చెప్పింది.
అహ్మదాబాద్, బెంగళూరు, ఛండీగఢ్, ఢిల్లీ, నోయిడాతో పాటు దేశంలోని 21 నగరాల్లో.. లాండ్ రోవర్‌కు 25 అధికారిక ఔట్లెట్లు ఉన్నాయి. వీటిల్లోంచి సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు.
Range Rover Sport features : రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్, 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది.. 258కేడబ్ల్యూ పవర్, 700 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రెండోది 294కేడబ్ల్యూ పవర్, 550ఎన్ఎం పవర్‌ను జనరేట్ చేస్తుంది.
రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీలో షార్ట్ ఓవర్‌హ్యాంగ్స్, లార్జ్ వీల్స్ వస్తాయి. దీనిని ఎంఎల్ఏ ఫ్లెక్స్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. ఫలితంగా ఈ కారు కేపబులిటీ, పర్ఫార్మెన్స్, హ్యాండ్లింగ్ మరింత మెరుగ్గా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఈ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీలో డైనమిక్ ఎయిర్ సస్పెన్షన్, ప్రీ-ఎంప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఎలక్ట్రానిక్ యాక్టివ్ డిఫరెన్షియల్ విత్ టార్క్ వెక్టరింగ్ బ్రేకింగ్ అండ్ అడాప్టివ్ ఆఫ్ రోడ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Range Rover Sport 2023 : రేంజ్ రోవర్ స్పోర్ట్ ఇంటీరియర్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. స్పేస్ ఎక్కువగా ఉండటంతో పాటు సరికొత్త టెక్నాలజీని ఇందులో చూడవచ్చు. మొత్తం మీద చాలా కంఫర్ట్‌గా, చాలా స్టైలిష్‌గా ఇది ఉంటుందనడంలో సందేహం లేదు. సరికొత్త డిజిటల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, అడాప్టివ్ ఫ్రెంట్ లైటింగ్, లో స్పీడ్ మేన్యువరింగ్ లైట్స్‌తో విజిబులిటీ అనేది మరింత పెరుగుతుంది.
రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ ఫీచర్స్ ఉన్నాయి. 33.27సెంటీమీటర్ల హెప్టిక్ టచ్‌స్క్రీన్ ఇందులో ఉంటుంది. డాష్‌బోర్డ్‌కు సెంటర్లో ఇది ఉంటుంది. నావిగేషన్, మీడియా నుంచి వెహికిల్ సెట్టింగ్స్ వరకు ఇందులో అన్నింటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో నెక్స్ట్ జెన్ క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్రో ఉంటుంది. దీని ద్వారా లోపల కూర్చున్న వారికి మరింత భద్రత లభిస్తుంది.
రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర..
- Range Rover Sport price in India : డీ350 డైనమిక్ ఎస్ఈ- రూ. 1.64కోట్లు
- పీ400 డైనమిక్ హెచ్ఎస్ఈ- రూ. 1.68కోట్లు
- డీ350 డైనమిక్ హెచ్ఎస్ఈ- రూ. 1.71కోట్లు
- డీ350 ఆటోబయోగ్రఫి- రూ. 1.81కోట్లు
- డీ350 ఫస్ట్ ఎడిషన్- రూ. 1.84కోట్లు
* పైన చెప్పినవి ఎక్స్‌షోరూం ధరలు. పూర్తి వివరాల కోసం సమీప డీలర్షిప్ షోరూంను సంప్రదించాల్సి ఉంటుంది.