ొత్త మారుతి సుజుకి డిజైర్ భారత్ ఎన్‌సీఏపీ నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. కొంతకాలం క్రితం ఈ సెడాన్ గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను తెచ్చుకుంది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కొత్త డిజైర్ సేఫ్టీ రేటింగ్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌లను మారుతి సుజుకి సీనియర్ అధికారులకు అందజేశారు.
మారుతి సుజుకి కొత్త డిజైర్ ఇప్పుడు భారత్ ఎన్‌సీఏపీ నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మొదటి సెడాన్ కారుగా నిలిచింది. గత సంవత్సరం నవంబర్‌లో గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో మంచి పనితీరు కనబరిచిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా కొత్త తరం డిజైర్‌కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ) వంటి ఫీచర్లు కొత్త డిజైర్‌లో అందించారు.
కొత్త మారుతి డిజైర్ అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ టెస్ట్ లో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. మొత్తం 32 పాయింట్లకు గాను 29.46 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ పరీక్షలో 16కు 14.17 పాయింట్లు వచ్చాయి. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ 16.00కి 15.29 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో కొత్త డిజైర్‌కు 5-స్టార్ రేటింగ్ వచ్చింది. మొత్తం 49 పాయింట్లకు గాను 41.57 పాయింట్లు సాధించింది. డైనమిక్ స్కోర్ 24కు 23.57 పాయింట్లు కాగా, సీఆర్ఎస్ ఇన్‌స్టలేషన్ 12కు 12 పాయింట్లు సాధించింది.
ప్రస్తుతం మారుతి సుజుకి మొత్తం 10 కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉన్నాయి, వీటిలో ఆల్టో K10, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఈకో, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో వంటి వివిధ విభాగాలకు చెందిన కార్లు ఉన్నాయి. మారుతి సుజుకి తన కార్ల అన్ని మోడళ్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ముఖ్యమైన ఫీచర్‌ను ఉంచింది.
మారుతి సుజుకి కొత్త డిజైర్ ఫీచర్ల గురించి చూస్తే.. 5వ తరం HEARTECT ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ కాంపాక్ట్ సెడాన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఈబీడీతో ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సెన్సార్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాకింగ్, నైట్ అండ్ డే అడ్జస్టబుల్ ఐఆర్‌వీఎం, ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిటర్‌తో కూడిన ఫ్రంట్ సీట్ బెల్ట్‌లు, హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్ ల్యాంప్, బజర్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్, ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తోపాటు అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి డిజైర్ ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.84 లక్షల నుండి ప్రారంభమై రూ. 10.19 లక్షల వరకు ఉంటుంది. ఈ సెడాన్ పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్స్‌తో లభిస్తుంది. మే నెలలో దేశంలో నంబర్ 1 కారు ఇది. ఇప్పుడు భారత్ ఎన్‌సీఏపీలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన తర్వాత దాని అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
టాపిక్