New Jawa 42 Bike : ఇండియాలో జావా కొత్త బైక్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు ఇదిగో
Jawa 42 Bike Launched In India : ఇండియాలో జావా బైకులకు కూడా క్రేజ్ ఉంది. చాలా మంది ఈ మోటర్ సైకిల్‌ను ఇష్టపడుతారు. అయితే తాజాగా జావా 42ను విడుదల చేసింది. ఈ బైక్ ధర, ఫీచర్లు.. కొత్తగా ఏం అప్‌డేట్ చేశారో తెలుసుకుందాం..
జావా యేజ్డి మోటార్ సైకిల్ అప్‌డేటెడ్ జావా 42ను భారతదేశంలో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ.1.73 లక్షలుగా నిర్ణయించింది. బైక్‌లో పలు మెకానికల్ మార్పులు చేశారు. కాస్మెటిక్ మార్పులు కూడా జరిగాయి. ఈ బైక్ ఇప్పటికీ 294.7 సీసీ, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే ఇందులో అంతర్గతంగా కొన్ని మార్పులు చేశారు. దీనిని జె-పాంథర్ అంటారు. ఇది 27బిహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో అసిస్ట్, స్లిప్ క్లచ్ కూడా ఉన్నాయి.
ఈ ఇంజన్ విస్తృత స్థాయి టార్క్‌ను అందిస్తుందని జావా తెలిపింది. దీని లో-ఎండ్ పనితీరు కూడా బాగుంది. ఇంజిన్ సామర్థ్యంతో కంపెనీ తన కూలింగ్‌ను కూడా మెరుగుపరిచింది. ఈ ఇంజిన్ అవుట్ గోయింగ్ బైక్ యూనిట్ కంటే చాలా మన్నికగా ఉంటుంది. అదే సమయంలో మొదటి గేర్ నుంచి థర్డ్ గేర్‌కు రెస్పాన్సిబిలిటీ ఉండేలా ట్యూనింగ్‌ను మార్చారు. 4 నుండి 6వ గేర్ వరకు ట్యూనింగ్ ఎలా ఉంటుందంటే ఇది బలమైన మిడ్-రేంజ్, మెరుగైన టాప్-ఎండ్ పనితీరును పొందుతుంది.
లుక్ పరంగా ఇది పాత మోడల్‌ను పోలి ఉంటుంది. ఈ బైక్‌లో గుండ్రని హెడ్ లైట్లు, టియర్ డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్, కర్వ్డ్ రియర్ ఫెండర్ ఉన్నాయి. అయితే మునుపటి కంటే మెరుగైన సౌలభ్యం కోసం సీటును సర్దుబాటు చేశారు. బాడీవర్క్ కింద టెలిస్కోపిక్ ఫోర్కులు, ట్విన్ షాక్ అబ్జార్బర్లచే సస్పెండ్ చేయబడిన డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ ఉంటుంది. సస్పెన్షన్ హార్డ్ వేర్ పాతదాని మాదిరిగానే ఉంటుంది. కంప్రెషన్, రీబౌండ్ డంపింగ్ మార్చబడ్డాయి. దీనికి అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అదే సమయంలో బ్రేకింగ్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేకులు అమర్చారు.
స్టైల్ విషయంలో రాజీ పడకూడదని, గొప్ప పనితీరును కోరుకునే కొత్త తరం రైడర్ల కోసం 2024 జావా 42 రూపొందించబడింది. ఇది మ్యాట్, గ్లాస్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో మొత్తం 14 రంగులు ఉంటాయి. భారత మార్కెట్లో, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లతో నేరుగా పోటీ పడుతుంది.