New Income Tax Bill : పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. మార్పులు ఇవే!-new income tax bill 2025 tabled in parliament sent to committee know the changes in this ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Income Tax Bill : పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. మార్పులు ఇవే!

New Income Tax Bill : పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. మార్పులు ఇవే!

Anand Sai HT Telugu Published Feb 13, 2025 04:52 PM IST
Anand Sai HT Telugu
Published Feb 13, 2025 04:52 PM IST

New Income Tax Bill : పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు వచ్చింది. నూతన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇందులో కొన్ని మార్పులు, చేర్పులు ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. గత వారం కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత గురువారంనాడు నిర్మలా సీతారామన్ సభ ముందుకు తీసుకొచ్చారు. లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్య ఆర్థిక మంత్రి బిల్లును సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. కాసేపటికి లోక్‌సభ మార్చి 10 నాటికి వాయిదా పడింది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

బిల్లుపై మరింత చర్చ

ప్రస్తుతం దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం అమలులో ఉంది. దీని స్థానంలో కేంద్రం కొత్త చట్టం తీసుకువస్తుంది. దీనిలో భాగంగానే పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టారు. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టంలో ఇప్పటివరకు ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి.. సరళభతరం చేస్తామని గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది. ఇందుకోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. చట్ట సమీక్షకు 22 సబ్‌కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ బిల్లుపై మరింత చర్చ కోసం లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి పంపుతారు.

కొత్త బిల్లులో మార్పులు

కొత్త బిల్లులో 536 విభాగాలు, 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్‌లు ఉన్నాయి. ఇందులో కొత్త పన్ను విధించే ప్రస్తావన లేదు. ఈ బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961 భాషను సులభతరం చేస్తుంది. కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. చట్టం నోటిఫై అయిన తర్వాత నియ నిబంధనలుు అమ్మల్లోకి వస్తాయి. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు అసెస్‌మెంట్ ఇయర్ ఉంది.. కొత్త బిల్లులో ట్యాక్స్ ఇయర్‌గా మార్చారు. అంటే మునుపడి సంవత్సరం ప్రీవియస్ ఇయర్, అంచనా సంవత్సరం అసెసెమెంట్ ఇయర్ వంటి కష్టమైన పదాలను కొత్త బిల్లులో తొలగించారు. పన్ను సంవత్సరం అంటే ట్యాక్స్ ఇయర్ అనే పదంతో సరిపెట్టారు.

పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలు వివరించే పన్ను చెల్లింపుదారుల చార్టర్‌ను బిల్లులో చేర్చారు. పన్ను చెల్లింపుదారులు చదవడానికి వీలుగా టేబుల్స్, ఫార్ములాలు పొందుపరిచారు. జీతాల్లో స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి తగ్గింపులన్నీ ఒకే చోట ఉంటాయి. గతంలో వివిధ సెక్షన్లు , రకరకాల నిబంధనల్లో ఇవి ఉండేవి.

వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ఇతరుల కోసం కొత్త, పాత ఆదాయ పన్ను విధానాలకు వర్తించేలా చట్టం ఉంటుంది. ప్రస్తుత చట్టంలో చాలాసార్లు కనిపించే నాట్‌విత్ స్టాండింగ్ అనే పదం స్థానంలో ఇర్రెస్పెక్టివ్ అనే పదాన్ని చేర్చారు.

Anand Sai

eMail
Whats_app_banner