New Honda Activa 6G: త్వరలో కనెక్టివిటీ ఫీచర్లు, మరికొన్ని అప్‍గ్రేడ్‍లతో హోండా యాక్టివా 6జీ కొత్త వేరియంట్!-new honda activa 6g may launch soon with bluetooth connectivity digital display ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  New Honda Activa 6g May Launch Soon With Bluetooth Connectivity Digital Display

New Honda Activa 6G: త్వరలో కనెక్టివిటీ ఫీచర్లు, మరికొన్ని అప్‍గ్రేడ్‍లతో హోండా యాక్టివా 6జీ కొత్త వేరియంట్!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 19, 2023 03:10 PM IST

Honda Activa 6G: హోండా యాక్టివా 6జీ స్కూటర్ లైనప్‍లో త్వరలో టాప్ ఎండ్ వేరియంట్ లాంచ్ కానుందని సమాచారం. అప్‍డేటెడ్ ఫీచర్లతో ఇది రానుందని తెలుస్తోంది. వివరాలివే..

Honda Activa 6G: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా హోండా యాక్టివ్ 6జీ
Honda Activa 6G: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా హోండా యాక్టివ్ 6జీ (HT Auto)

Honda Activa 6G: హోండా యాక్టివా 6జీ స్కూటర్ ఇప్పటికే చాలా పాపులర్ అయింది. 110cc స్కూటర్ల విభాగంలో అదరగొడుతోంది. యాక్టివా 6జీలో చాలా వేరియంట్లు ఉన్నాయి. అయితే యాక్టివా 6జీ లైనప్‍లో కొత్త కనెక్టివిటీ ఫీచర్లు, మరికొన్ని అప్‍గ్రేడ్లతో సరికొత్త టాప్ వేరియంట్‍(New Honda Activa 6G Variant)ను తీసుకొచ్చేందుకు హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా (HMSI) సంస్థ సిద్ధమైంది. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ డిస్‍ప్లేతో యాక్టివా 6జీ కొత్త మోడల్‍ను త్వరలో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

బ్లూటూత్ కనెక్టివిటీతో..

Honda Activa 6G: హోండా యాక్టివా హెచ్-స్మార్ట్ ఎడిషన్ స్కూటర్లు ఇటీవల లాంచ్ అయ్యాయి. కీలెస్ సిస్టమ్ సహా మరిన్ని అప్‍గ్రేడ్లను ఈ స్కూటర్లు కలిగి ఉన్నాయి. వీటికి మంచి ఆదరణ కూడా లభిస్తోంది. అందుకే యాక్టివా 6జీ లైనప్‍లోనే కనెక్టివిటీ ఫీచర్లతో సరికొత్త వేరియంట్‍ను తీసుకురావాలనేది ఆ కంపెనీ ఆలోచన. ఈ విషయాన్ని HSMI సీఈవో, ప్రెసిడెంట్ ఓత్సుహి ఒగాటా.. కొందరు జర్నలిస్టులతో చెప్పారు. హోండా షైన్ 100 లాంచ్ సందర్భంగా ఈ వివరాలను వెల్లడించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ డిస్‍ప్లేతో సరికొత్త యాక్టివా 6జీ వెర్షన్‍ను తీసుకురానున్నట్టు తెలిపారు.

ఇప్పట్లో నెక్స్ట్ జనరేషన్ యాక్టివా 7జీ స్కూటర్‌ను తీసుకొచ్చే ప్లాన్ లేదని, అందుకే యాక్టివా 6జీ లైనప్‍లోనే టాప్-స్పెక్ వేరియంట్‍ను బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ డిస్‍ప్లేతో తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు.

Honda Activa 6G: ప్రస్తుతం హోండా యాక్టివా 6జీ స్కూటర్‌కు హీరో జూమ్, టీవీఎస్ జ్యూపిటర్ పోటీగా ఉన్నాయి. జూమ్, జ్యూపిటర్ జెడ్ఎక్స్ స్మార్ట్ కనెక్ట్ స్కూటర్లు ఇప్పటికే బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ డిస్‍ప్లేను కలిగి ఉన్నాయి. అయితే యాక్టివా 6జీ మాత్రం అనాలాగ్ డిస్‍ప్లేతోనే వస్తోంది. అందుకే పోటీని తట్టుకునేందుకు యాక్టివా 6జీ లైనప్‍లోనూ బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ డిస్‍ప్లేతో టాప్ స్పెక్ మోడల్‍ను తీసుకొచ్చేందుకు హోండా ప్లాన్ చేస్తోంది.

ఈ ధరతో!

Honda Activa 6G: ప్రస్తుతం ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా హోండా యాక్టివా 6జీ ఉంది. హోండా అమ్మకాల్లో ఈ స్కూటర్ వాటానే ప్రధాన భాగంగా ఉంటోంది. ఇటీవల యాక్టివా హెచ్‍-స్మార్ట్ స్కూటర్‌ను కీలెస్ సిస్టమ్‍తో హోండా లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర ప్రస్తుతం రూ.80,537గా ఉంది. కొత్తగా తీసుకొచ్చే యాక్టివా 6జీ టాప్ స్పెక్ వేరియంట్‍కు బ్లూటూత్, డిజిటల్ డిస్‍ప్లేతో పాటు కీలెస్ సిస్టమ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. దీని ధర రూ.85 వేల నుంచి రూ.90వేల మధ్య ఉంటుందని అంచనా.

Honda Shine 100: ఇటీవలే భారత మార్కెట్‍లో హోండా షైన్ 100 అడుగుపెట్టింది. 100సీసీ ఇంజిన్‍తో వచ్చింది. దీని ధర రూ.64,900 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా, టీవీఎస్ స్టార్ ప్లస్ బైక్‍లకు పోటీగా షైన్ 100 అడుగుపెట్టింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్