Hyundai Venue : సరికొత్త అవతారంలో బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ..
Hyundai Venue : సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ లోపల డిజైన్ మార్పులతో పాటు కొన్ని సరికొత్త ఫీచర్లతో రానుంది. ఈ నేపథ్యంలో 2025 హ్యుందాయ్ వెన్యూ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్ భారతదేశంలో కొత్త తరం వెన్యూను పరీక్షించడం ప్రారంభించింది. న్యూ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఈ ఏడాది చివరిలో లాంచ్ కానుంది! అంతకు ముందు రోడ్డుపై కనిపించిన టెస్ట్ మ్యూల్ కొన్ని వివరాలను వెల్లడించింది. న్యూ జెన్ హ్యుందాయ్ వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కొన్ని మార్పులతో రానుంది. ఈ అప్డేటెడ్ ఎస్యూవీ ఎక్స్టీరియర్తో పాటు క్యాబిన్ లోపల డిజైన్ మార్పులతో వస్తుంది.
సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్.. భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో అత్యంత పోటీ, అధిక-డిమాండ్ ఉన్న సెగ్మెంట్. టాటా మోటార్స్, హ్యుందాయ్, రెనాల్ట్, నిస్సాన్, మహీంద్రా, మారుతీ సుజుకీ, స్కోడా వంటి ఆటోమొబైల్ కంపెనీలు ఈ రంగంలో ప్రాడక్ట్స్‌ని కలిగి ఉన్నాయి. టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజ్జా, స్కోడా కైలాక్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, రెనాల్ట్ ఖైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి ప్రత్యర్థులతో పోటీని తట్టుకుని నిలబడేందుకు ఈ కొత్త అప్డేట్స్ వెన్యూకి ఉపయోపడతాయి.
ఇక ఈ హ్యుందాయ్ వెన్యూకి ఒక మంచి ఫ్యామిలీ ఎస్‌యూవీగా గుర్తింపు కూడా ఉంది. లేటెస్ట్ వర్షెన్‌తో సేల్స్ మరింత పెరుగుతాయని సంస్థ కూడా భావిస్తోంది.
2025 హ్యుందాయ్ వెన్యూ: కీలక అంచనాలు..
కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ క్యామోఫ్లేజ్డ్ ప్రోటోటైప్ వర్షెన్‌లో కొత్త డిజైన్‌తో హారిజాంటల్ టెయిల్ లైట్లు, స్టీల్ వీల్స్‌తో కొత్త డిజైన్ వీల్ కవర్లు లభిస్తాయని సూచిస్తుంది. ఈ రెండు స్పష్టమైన మార్పులతో పాటు, కొత్త తరం వెన్యూ ఎల్ఈడీ ప్రొజెక్టర్ యూనిట్లతో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉంటుంది. అలాగే, రీవాంప్డ్డ్ రేడియేటర్ గ్రిల్, రివైజ్డ్ ఫ్రంట్- రియర్ బంపర్లు, అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్, ట్వీక్డ్ టెయిల్‌గేట్ కూడా ఉన్నాయి.
క్యాబిన్ లోపల, కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌తో వస్తుందని భావిస్తున్నారు. 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కొత్త అప్‌హోలిస్ట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
హ్యుందాయ్ వెన్యూ న్యూ జనరేషన్ అదే 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ మోటార్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయని తెలుస్తోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఆప్షన్లలో లభిస్తుంది.
ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ వెన్యూ బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటి. హైదరాబాద్‌లో హ్యుందాయ్ వెన్యూ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం