New driving licence rules : నేటి నుంచి నూతన డ్రైవింగ్​ లైసెన్స్​ రూల్స్​ అమలు- పూర్తి వివరాలు..-new driving licence rules kicks in from today june 1 2024 all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Driving Licence Rules : నేటి నుంచి నూతన డ్రైవింగ్​ లైసెన్స్​ రూల్స్​ అమలు- పూర్తి వివరాలు..

New driving licence rules : నేటి నుంచి నూతన డ్రైవింగ్​ లైసెన్స్​ రూల్స్​ అమలు- పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu
Jun 01, 2024 06:21 AM IST

New driving licence rules 2024 : ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన డ్రైవింగ్​ లైసెన్స్​ రూల్స్​.. జూన్​ 1న అమల్లోకి వచ్చాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నేటి నుంచి నూతన డ్రైవింగ్​ లైసెన్స్​ రూల్స్​ అమలు
నేటి నుంచి నూతన డ్రైవింగ్​ లైసెన్స్​ రూల్స్​ అమలు

New driving licence rules in India : డ్రైవింగ్​ లైసెన్స్​ పొందేందుకు.. ఇక రీజనల్​ ట్రాన్స్​పోర్ట్​ ఆఫీస్ (ఆర్​టీఓ​) చుట్టూ తిరుగాల్సిన అవసరం లేదు! ఆర్​టీఓ బదులు.. ప్రైవేట్​ ట్రైనింగ్​ కేంద్రాల్లోనే డ్రైవింగ్​ లైసెన్స్​లు పొందొచ్చు. ఈ మేరకు.. రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించిన కొత్త డ్రైవింగ్​ లైసెన్స్​ నిబంధనలు జూన్​ 1, శనివారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

ప్రస్తుతం.. ఆర్​టీఓ కార్యాలయాల్లో అధికారుల సమక్షంలో నిర్వహించే డ్రైవింగ్​ టెస్ట్​లో పాల్గొని పాసైతేనే.. డ్రైవింగ్​ టెస్ట్​ వస్తుంది. అయితే.. అధికారులపై రోజురోజుకు పెరిగిపోతున్న ఒత్తిడిని తగ్గించాలని, లైసెన్స్​ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ. ఈ మేరకు.. ప్రభుత్వం ఆమోదించిన ట్రైనింగ్​ సెంటర్లలోనే పరీక్ష నిర్వహిస్తారు. ఆ కేంద్రాల్లోనే.. లైసెన్స్​ సర్టిఫికెట్లు పొందొచ్చు.

ఇక ఈ కొత్త డ్రైవింగ్​ రూల్స్​ ఉల్లంఘిన విషయం కాస్త కఠినంగానే ఉంది. నిబంధన ప్రకారం.. సరైన లైసెన్స్​ లేకుండా వాహనం నడిపితే.. రూ. 1000 నుంచి రూ. 2000 వరకు ఫైన్​ పడుతుంది. ఒకవేళ మైనర్​ .. వాహనం నడుపుతూ దొరికిపోతే.. సంబంధిత వ్యక్తి గార్డియన్​ లేదా తల్లిదండ్రులకు రూ. 25వేల వరకు ఫైన్​ పడొచ్చు. అంతేకాదు.. సదరు మైనర్​.. 25ఏళ్లు వచ్చేంతవరకు డ్రైవింగ్​ లైసెన్స్​ పొందలేరు. ఇక మైనర్​ నడిపిన వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్​ సర్టిఫికేట్​ని కూడా రద్దు చేస్తామని నిబంధనలు చెబుతున్నాయి.

Driving licence rules change : కాగా.. డ్రైవింగ్​ లైసెన్స్​కి సంబంధించిన అప్లికేషన్​ ప్రాసెస్​లో మాత్రం మారలేదు. ఆన్​లైన్​లో లేదా పరివాహన్​ వెబ్​సైట్​లో అప్లికేషన్​ దాఖలు చేసుకోవచ్చు. స్థానిక ఆర్​టీఓకి వెళ్లి మేన్యువల్​గానూ డ్రైవింగ్​ లైసెన్స్​ అప్లికేషన్​ దాఖలు చేసుకోవచ్చు.

డ్రైవింగ్​ లైసెన్స్​ ఫీజు..

నూతన డ్రైవింగ్​ లైసెన్స్​ లేదా పాత దానిని రెన్యువెల్​ చేసుకునే ప్రాసెస్​లో కూడా మార్పులు చేసింది కేంద్రం. పర్మనెంట్​ డ్రైవింగ్​ లైసెన్స్​ పొందడం లేదా లర్నింగ్​ లైన్స్​ పొందడం లేదా రెండింటినీ రెన్యూ చేసుకోవడం కోసం ఫీజును రూ. 200గా నిర్దేశించింది. అంతర్జాతీయ డ్రైవింగ్​ లైసెన్స్​కి మాత్రం అది రూ. 1000గా ఉంది.

ప్రైవేట్​ డ్రైవర్​ ట్రైనింగ్​ స్కూల్స్​కి నిబంధనలు..

New driving licence rules 2024 : డ్రైవింగ్​ లైసెన్స్​ ఇచ్చే ప్రైవేట్​ డ్రైవింగ్​ టెస్టింగ్​ స్కూల్స్​కి కీలక నిబంధనలు పెట్టింది కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ.

ల్యాండ్​ :- డ్రైవింగ్​ ట్రైనింగ్​ సెంటర్లకు కనీసం 1 ఎకర భూమి ఉండాలి. 4 వీలర్​ ట్రైనింగ్​ ఉంటే.. 2 ఎకరాల భూమి తప్పనిసరి.

టెస్టింగ్​ ఫెసిలిటీ:- అన్ని రకాల వసతులను స్కూల్​ తప్పనిసరిగా కేటాయించాలి.

ట్రైనర్​ క్వాలిఫికేషన్​:- ట్రైనర్​కి హై స్కూల్​ డిప్లొమా (లేదా అందుకు సమాన చదువు) ఉండాలి. కనీసం 5ఏళ్ల డ్రైవింగ్​ ఎక్స్​పీరియెన్స్​ ఉండాలి. బయోమెట్రిక్స్​, ఐటీ సిస్టెమ్స్​పై అవగాహన ఉండాలి. లేకపోతే తీసుకోకూడదు.

ట్రైనింగ్​ సమయం:- లైట్​ మోటార్​ వెహికిల్స్​కి అయితే.. 4 వారాల్లో 29 గంటలు. 8 గంటల థియరీ, 21 గంటల ప్రాక్టికల్​ ట్రైనింగ్​.

హెవీ మోటార్​ వెహికిల్స్​కి అయితే.. 6 వారాల్లో 38 గంటలు. 8 గంటల థియరీ ఉండాలి. 31 గంటల ప్రాక్టికల్​ ట్రైనింగ్​ ఉండాలి.

WhatsApp channel

సంబంధిత కథనం