Maruti CNG Car : మారుతి నుంచి కొత్త సీఎన్‌జీ కారు.. 33 కిలో మీటర్ల మైలేజీ.. సేఫ్టీలోనూ టాప్!
Maruti Suzuki Dzire CNG : మారుతి కారుకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఈ వాహనాలను చాలా మంది కొనుగోలు చేస్తారు. ఈ కంపెనీ లిస్టులో మరో కారు వచ్చి చేరనుంది. కొత్త మారుతి సుజుకి డిజైర్ సీఎన్‌జీ రాబోతోంది.
మారుతి సుజుకి కొత్తగా పరిచయం అవసరం లేని కారు. ఇండియాలో ఈ కంపెనీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. మంచి కార్లతోపాటుగా సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తుంది. మారుతి సుజుకి నుంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ కొత్త కార్లు వస్తూనే ఉన్నాయి. అందుబాటులో ధరలో కార్లను అందించే బ్రాండ్‌గా మారుతికి పేరుంది. కొత్తగా మారుతి సుజుకి డిజైర్ గురించి మార్కెట్‌లో చర్చ నడుస్తోంది. నవంబర్ 11న డిజైర్ సీఎన్‌జీని కూడా లాంచ్ చేస్తుందని సమాచారం.
కొత్త మారుతి సుజుకి నవంబర్ 11న లాంచ్ అవుతుంది. కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసిన ఈ కారుపై అందరికీ ఆసక్తి ఉంది. ఇదే సమయంలో సీఎన్‌డీ వెర్షన్‌ను కూడా కంపెనీ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టాటా టిగోర్ ఐసీఎన్‌జీ, హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ కార్లకు ఇది పోటీ ఇవ్వనుంది.
డిజైర్ CNG 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 68బీహెచ్‌పీ శక్తిని, 101.8ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది. కొత్త డిజైర్ సీఎన్‌జీ కిలోకు 33.73 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. కొత్త డిజైర్ LXI, VXI, ZXI, ZXIప్లస్ అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. సీఎన్‌జీ వెర్షన్ మిడ్ స్పెక్ VXI, ZXI ట్రిమ్‌లలో వస్తుంది.
సేఫ్టీ పరంగా కొత్త తరం మారుతి డిజైర్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో వస్తుంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, వెనుక ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త మారుతి సుజుకి డిజైర్ బుకింగ్‌లు నవంబర్ 4 నుండి ప్రారంభమయ్యాయి. ఈ కొత్త మారుతి సుజుకి డిజైర్ కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కేవలం రూ. 11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి డీలర్ వద్ద లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.