BYD Hybrid: ‘‘సింగిల్ చార్జింగ్ తో 2 వేల కిలోమీటర్ల నాన్ స్టాప్ డ్రైవ్’’.. హైబ్రిడ్ మోడల్ సెడాన్ ను లాంచ్ చేసిన బీవైడీ-new byd hybrid can drive non stop for more than 2 000 kilometers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Byd Hybrid: ‘‘సింగిల్ చార్జింగ్ తో 2 వేల కిలోమీటర్ల నాన్ స్టాప్ డ్రైవ్’’.. హైబ్రిడ్ మోడల్ సెడాన్ ను లాంచ్ చేసిన బీవైడీ

BYD Hybrid: ‘‘సింగిల్ చార్జింగ్ తో 2 వేల కిలోమీటర్ల నాన్ స్టాప్ డ్రైవ్’’.. హైబ్రిడ్ మోడల్ సెడాన్ ను లాంచ్ చేసిన బీవైడీ

HT Telugu Desk HT Telugu
Published Jun 01, 2024 02:51 PM IST

రీచార్జ్ లేదా ఇంధనం నింపకుండా 2,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల కొత్త హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ను బీవైడీ ఆవిష్కరించింది. ఈ సెడాన్ మోడల్ తో నాన్ స్టాప్ గా 2 వేల కిలోమీటర్లు ప్రయాణించవచ్చని బీవైడీ చెబుతోంది. ఈ ఆవిష్కరణతో బీవైడీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో టయోటా, ఫోక్స్వ్యాగన్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

సింగిల్ చార్జింగ్ తో 2 వేల కిమీల ప్రయాణం
సింగిల్ చార్జింగ్ తో 2 వేల కిమీల ప్రయాణం (Bloomberg)

New BYD Hybrid: రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా లేదా ఇంధనం నింపాల్సిన అవసరం లేకుండా 2,000 కిలోమీటర్లు (1,250 మైళ్ళు) కంటే ఎక్కువ ప్రయాణించగల కొత్త హైబ్రిడ్ పవర్ ట్రైన్ ను చైనా ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి సంస్థ ‘బీవైడీ’ (BYD) ఆవిష్కరించింది, ఇది EV రంగంలో పోరును తీవ్రతరం చేసింది. ఈ విప్లవాత్మక ఆవిష్కరణతో విద్యుత్ వాహన రంగంలో టయోటా మోటార్ కార్పొరేషన్, ఫోక్స్ వ్యాగన్ లకు బీవైడీ గట్టి ప్రత్యర్థిగా మారింది.

ఒకసారి చార్జ్ చేసి..

ఈ బీవైడీ (BYD) హైబ్రిడ్ సెడాన్ కారును ఒక సారి ఫుల్ గా చార్జింగ్ చేసి, అలాగే, ఇంధనాన్ని ఫుల్ ట్యాంక్ చేసి ప్రయాణ ప్రారంభిస్తే.. 2 వేల కిలోమీటర్ల వరకు మళ్లీ చార్జ్ చేయాల్సిన లేదా ఇంధనం నింపాల్సిన అవసరం లేకుండానే ప్రయాణించవచ్చని బీవైడీ చెబుతోంది. ఈ పవర్ ట్రెయిన్ తో రెండు సెడాన్ లను లాంచ్ చేయనున్నట్లు బీవైడీ వెల్లడించింది. వీటి ధర 100,000 యువాన్లు (13,800 డాలర్లు) కంటే తక్కువ అని వెల్లడించింది. వీటి ఎగుమతులను త్వరలో ప్రారంభిస్తామని ఈ చైనా ఆటోమేకర్ తెలిపింది.

సింగిల్ చార్జింగ్ తో సింగపూర్ నుంచి బ్యాంకాక్ కు..

ఈ బీవైడీ హైబ్రిడ్ కారు (BYD Hybrid) తో సింగపూర్ నుండి బ్యాంకాక్, న్యూయార్క్ నుండి మయామి లేదా మ్యూనిచ్ నుండి మాడ్రిడ్ వరకు ఒక ఫుల్ ఛార్జ్, ఫుల్ ట్యాంక్ ఇంధనంతో కవర్ చేయవచ్చు. 2008 లో హైబ్రిడ్ మోడల్స్ ను ప్రారంభించినప్పటి నుండి ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో బీవైడీ గణనీయ విజయాలను సాధిస్తోంది. షెన్ జెన్ కు చెందిన బివైడీ విస్తృతమైన ధరల తగ్గింపుతో చైనా ఆటో మార్కెట్ లో కీలక స్థానం సంపాదించింది. ఈ సంస్థ గత సంవత్సరం 3 మిలియన్ల కార్లను విక్రయించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు దాదాపు 1 మిలియన్ కార్లను డెలివరీ చేసింది. చైనాలో విక్రయించే ప్రతి రెండు హైబ్రిడ్లలో ఒకటి బివైడీనే కావడం విశేషం. పరీక్షల్లో తమ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ 2,500 కిలోమీటర్ల పరిధిని సాధించగలిగిందని ఈ సందర్భంగా బీవైడీ పేర్కొంది.

Whats_app_banner