Netflix : అలర్ట్- ఈ యాపిల్ గ్యాడ్జెట్స్‌కి నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్ చేయదు! కారణం ఏంటంటే..
Netflix iphone news : యాపిల్ గ్యాడ్జెట్స్‌కి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ కీలక ప్రకటన చేసింది. పలు యాపిల్ గ్యాడ్జెట్స్‌కి సపోర్ట్ ఇవ్వడం నిలిపివేస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఫలితంగా ఆయా గ్యాడ్జెట్స్‌లో ఇక నుంచి నెట్‌ఫ్లిక్స్ అప్డేట్స్ నిలిచిపోతాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ ‘నెట్‌ఫ్లిక్స్’ని వాడుతున్న యాపిల్ యూజర్స్‌కి అలర్ట్! ఓవైపు ఐఓఎస్ 18 లాంచ్ అవుతున్న సమయంలో, మరోవైపు నెట్‌ఫ్లిక్స్ కీలక ప్రకటన చేసింది. ఐఓఎస్ 16 ఆపరేటంగ్ సిస్టెమ్పై పనిచేసే ఐఫోన్స్, యాపిల్ డివైజ్‌లకు సపోర్ట్ ఇవ్వడం నిలిపివేస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. థర్డ్ జనరేషన్ యాపిల్ టీవీకి మద్దతును నిలిపివేయాలని సంస్థ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
ఐఓఎస్ 16 వాడుతున్న యాపిల్ డివైజ్‌లలో కనిపించే సందేశంలో 'నెట్‌ఫ్లిక్స్ యాప్‌ని అప్డేట్ చేశాం. తాజా వర్షెన్ ఉపయోగించడానికి, ఐఓఎస్ 17 లేదా తరువాతి సాఫ్ట్‌వేర్‌ని ఇన్స్టాల్ చేయండి," అని ఉంది. ఐఓఎస్ 16 యూజర్లు ప్రస్తుతానికి ఈ యాప్‌ను వాడుకోవచ్చు కానీ భవిష్యత్తులో వచ్చే అప్డేట్స్ ఆగిపోతాయి. అంటే కొత్త ఫీచర్లు, బగ్ ఫిక్స్‌లు లేదా సెక్యూరిటీ ప్యాచ్‌లు అప్డేట్ అవ్వవు!
ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు యాప్ పనితీరులో అంతరాయం ఏర్పడనుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో నెట్‌ఫ్లిక్స్ లేదా యాపిల్ ప్రకటించలేదు. కానీ పాత పరికరాలలో యాప్ పనిచేయకపోవడం ఖాయం!
ఇదీ చూడండి:- iOS 18 release date : ఈ ఐఫోన్స్కి మాత్రమే ఐఓఎస్ 18 అప్డేట్! లిస్ట్‌లో మీ గ్యాడ్జెట్ ఉందా?
ఈ గ్యాడ్జెట్స్‌లో నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్ ఉండదు..!
ఈ జాబితాలో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐప్యాడ్ ప్రో ఫస్ట్ జనరేషన్, ఐప్యాడ్ 5 ఉన్నాయి. ఈ డివైజ్‌లను ఐఓఎస్ 17కు అప్‌గ్రేడ్ చేయలేం, అందువల్ల నెట్‌ఫ్లిక్స్ యాప్ భవిష్యత్తు అప్డేట్లు అందవు. యాపిల్ ఐఫోన్ ఎక్స్‌ను వింటేజ్ ఉత్పత్తిగా గుర్తించింది. అంటే ఇది విడిభాగాల లభ్యతను బట్టి యాపిల్ స్టోర్లు, అధీకృత సర్వీస్ ప్రొవైడర్లలో మరమ్మతులకు మరో రెండు సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది.
నెట్‌ఫ్లిక్స్ వాడకాన్ని కొనసాగించాలనుకుంటే.. ఈ డివైజ్‌లు ఉన్న వినియోగదారులు కొత్త ఫోన్ లేదా టాబ్లెట్‌ను కొనుగోలు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ టీవీలకు యాప్ స్టోర్‌లో నెట్‌ఫ్లిక్స్ యాప్ అందుబాటులో ఉంది.
సెప్టెంబర్ 16న ఐఓఎస్ 18 లాంచ్ కావడంతో, ప్రభావిత డివైజ్‌ల వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, ఇతర యాప్‌లతో అనుకూలతను కొనసాగించడానికి కొత్త మోడళ్లకు అప్‌గ్రేడ్ చేసుకోవడాన్ని పరిశీలించవచ్చు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండటం, తద్వారా అధిక భద్రత పొందడానికి నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న తాజా నిర్ణయం ఉపయోగపడుతుంది.
సంబంధిత కథనం