National Savings Certificate : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్-ఐదేళ్లలో అదిరే లాభాలు, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా!-national savings certificate post office scheme high returns in five year with tax benefits ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  National Savings Certificate : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్-ఐదేళ్లలో అదిరే లాభాలు, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా!

National Savings Certificate : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్-ఐదేళ్లలో అదిరే లాభాలు, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా!

Bandaru Satyaprasad HT Telugu
Apr 08, 2024 01:37 PM IST

National Savings Certificate : ట్యాక్ పేయర్స్ కు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. తక్కువ రిస్క్ తో అధిక వడ్డీ, రిటర్న్స్ తో పాటు ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయి.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్

National Savings Certificate : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గం. ట్యాక్స్ మినహాయింపులు(Tax Benefits), అధిక రిటర్న్ లకు బెస్ట్ స్కీమ్. ఈ పథకంలో ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపులు పొందచవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద NSC పెట్టుబడులు పన్ను మినహాయింపు ఉంటుంది. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్థిరమైన ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్(Best investment Programme). సురక్షితమైన రిటర్నులు, పెట్టుబడికి ఢోకా లేని పథకం. పన్ను మినహాయింపు ప్రయోజనాలు, అధిక వడ్డీ రేట్లు(High Interest Rates) కారణంగా చిన్న, మధ్యతరహా పెట్టుబడిదారులలో ఈ పథకం ప్రజాదరణ పొందింది. ఎన్‌ఎస్‌సీల వడ్డీ రేట్లను(NSC Interest Rates) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కాలానుగుణంగా సవరిస్తూ ఉంటుంది. ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే జూన్ త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) వడ్డీ రేటు ఏడాదికి 7.7%గా నిర్ణయించింది.

yearly horoscope entry point

NSCలో పెట్టుబడి పెట్టడం ఎలా?(How to Invest in NSC)

NSC పెట్టుబడి పెట్టేందుకు రెండు ప్రాథమిక మార్గాలు ఉన్నాయి. ఆఫ్‌ లైన్ (ఫిజికల్ సర్టిఫికేట్), ఆన్‌లైన్ (ఇ-మోడ్) ఉన్నాయి. ఇంటర్నెట్ సేవలను అంతగా ఇష్టపడిన వాళ్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆఫ్‌లైన్ మోడ్‌ ఎన్ఎస్సీ కొనుగోలు చేయవచ్చు.

ఆఫ్ లైన్ విధానం(NSC Offline)

  • మీకు సమీపంలోని పోస్టాఫీసుకు(Post Office) వెళ్లి, నేషనల్ సవింగ్స్ సర్టిఫికేట్(NSC) కొనుగోలు చేయవచ్చు. దేశంలోని అన్ని పోస్టాఫీసు శాఖలో ఎన్ఎస్సీలు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
  • పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న NSC అప్లికేషన్ ను ఫామ్ ను నింపాలి. మీ వివరాలు, డిపాజిట్ మొత్తం, మెచ్యూరిటీ వ్యవధి (ప్రస్తుతం 5 సంవత్సరాలు), నామినీ సమాచారాన్ని దరఖాస్తులో నింపాలి.
  • మీ గుర్తింపు రుజువు కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ మొదలైనవి స్వీయ ధృవీకరణ చేసిన జిరాక్స్ కాపీలను పోస్టాఫీసులో సమర్పించాలి.
  • మీరు నగదు రూపంలో లేదా చెక్కు ద్వారా ఎన్ఎన్సీ కొనుగోలు మొత్తం చెల్లించాలి. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000 కాగా, గరిష్ట పరిమితి లేదు.
  • పెట్టుబడి నగదు చెల్లించిన తర్వాత ఎన్ఎస్సీ ప్రమాణపత్రాన్ని ఇస్తారు. పోస్టాఫీసులో మీకు ఫిజికల్ సర్టిఫికేట్‌(NSC)ను అందిస్తారు. ఇది మీ పెట్టుబడికి సాక్ష్యంగా ఉంటుంది.

ఆన్ లైన్ లో ఎన్ఎస్సీ కొనుగోలు(NSC Online)

  • ఆన్‌లైన్ మోడ్ ఎన్ఎస్సీలో పెట్టుబడి అందుబాటులో ఉంది. మీరు పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాను(Post Office Saving Account) కలిగి ఉండాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ చేసి, NSCలలో ఆన్‌లైన్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు.
  • మీ పోస్టల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్(Postal Internet Banking) లో జనరల్ సర్వీసెస్ లోని సర్వీస్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేయండి. న్యూ రిక్వెస్ట్ పై క్లిక్ చేసి, ఆపై “NSC Account – ఓపెన్ NSC అకౌంట్ కోసం ఎంచుకోండి.
  • మీ డిపాజిట్ మొత్తాన్ని నిర్థారించి, పోస్టాఫీస్ డెబిట్ ఖాతాను(Post Office Account) ఎంచుకోండి. నిబంధనలు, షరతులకు అంగీకరించి... మీ లావాదేవీల కోసం పాస్‌వర్డ్‌ను నిర్థారించాలి. మీరు ఆన్‌లైన్ లో పెట్టుబడి నిర్ధారణ చేసిన తర్వాత రిసీట్ వస్తుంది. దాన్ని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచండి.

NSC పెట్టుబడి ప్రయోజనాలు(NSC Benefits)

  1. మన పెట్టుబడికి భారత ప్రభుత్వం హామీ, భద్రతను అందిస్తుంది. మీ డిపాజిట్ అమౌంట్ కు రక్షణ ఉంటుంది.
  2. NSC పెట్టుబడి వ్యవధికి ప్రభుత్వం నిర్ణయించిన స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. ప్రస్తుతం NSCల వడ్డీ రేటు ఏడాదికి 7.7 శాతంగా ఉంది.
  3. NSC పెట్టుబడులతో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ట్యాక్స్ మినహాయింపులకు అర్హులు. దీంతో ఏడాదికి రూ.1.5 లక్షలు పన్ను మినహాయింపులు పొందవచ్చు.
  4. NSCలు మినిమమ్ పెట్టుబడితో ఎంట్రీలు ఉంటాయి. రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు.
  5. NSCలు ప్రస్తుతం 5 సంవత్సరాల మెచ్యూరిటీతో అందుబాటులో ఉన్నాయి. ఈ టర్మ్ పూర్తయ్యేలోపు పెట్టుబడి మొత్తాన్ని ఉపసంహరించుకోలేము.
  6. ముందుగా డబ్బు తీసుకునేందుకు అవకాశం ఉన్నా... వడ్డీ రేటు తగ్గడం, కొంత నగదు పెనాల్టీ పడడం ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహిస్తుంది.
  7. కాంపౌండ్ వడ్డీ - NSCలపై కాంపౌండ్ ప్రాతిపదికన వడ్డీని పొందుతారు. పెట్టుబడిపై వడ్డీ పై వడ్డీ చెల్లిస్తారు.
  8. మీ పెట్టుబడి ఎలాంటి ఢోకా లేకుండా మెచ్యూరిటీ మొత్తాన్ని స్వీకరించడానికి నామినీ వ్యక్తిని ఎంచుకోవచ్చు. మీ తర్వాత కుటుంబ సభ్యులకు డిపాజిట్ అమౌంట్ చెల్లిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం