NPS : పదవీ విరమణ తర్వాత నెలకు రూ.1 లక్ష పెన్షన్?, ఎన్పీఎస్ లో ఎంత పెట్టుబడి పెట్టాలంటే?-national pension system employees get high corpus along with pension ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nps : పదవీ విరమణ తర్వాత నెలకు రూ.1 లక్ష పెన్షన్?, ఎన్పీఎస్ లో ఎంత పెట్టుబడి పెట్టాలంటే?

NPS : పదవీ విరమణ తర్వాత నెలకు రూ.1 లక్ష పెన్షన్?, ఎన్పీఎస్ లో ఎంత పెట్టుబడి పెట్టాలంటే?

Bandaru Satyaprasad HT Telugu
Aug 28, 2024 01:48 PM IST

NPS : ఉద్యోగుల దీర్ఘకాలిక పొదువును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ను అమలుచేస్తుంది. ఈ స్కీమ్ లో ఉద్యోగులు తమ జీతంలో 10 శాతం జమ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు, పెన్షన్ పొందవచ్చు. ఈ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది.

పదవీ విరమణ తర్వాత నెలకు రూ.1 లక్ష పెన్షన్?, ఎన్పీఎస్ లో ఎంత పెట్టుబడి పెట్టాలంటే
పదవీ విరమణ తర్వాత నెలకు రూ.1 లక్ష పెన్షన్?, ఎన్పీఎస్ లో ఎంత పెట్టుబడి పెట్టాలంటే

NPS : నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) కేంద్రప్రభుత్వం అందిస్తున్న స్వచ్ఛంద పెన్షన్ పథకం. ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో పెన్షన్ ను పొందవచ్చు. ఈ పెన్షన్ పై పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఏడాదికి 9% నుంచి 12% వరకు రాబడి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో పన్ను రహిత విత్ డ్రా చేయవచ్చు. ఎన్పీఎస్ లో పెట్టుబడి మార్కెట్ పరిస్థితులకు లోబడి ఉంటాయి. అలాగే పెన్షన్ చెల్లింపులలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఎన్పీఎస్ లోఉద్యోగులు వారి బేసిక్ జీతంలో 10 శాతం జమ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 14 శాతం జమ అవుతుంది.

పన్ను మినహాయింపులు

జాతీయ పెన్షన్ విధానం పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. సెక్షన్ 80(1) సీసీడీ ప్రకారం రూ. 1.50 లక్షల మొత్తంలోపు జీతంలో (బేసిక్ + డీఎ) 10% వరకు పన్ను మినహాయింపులకు అర్హత ఉంటుంది. అదనంగా ఉద్యోగులు సెక్షన్ 80 సీసీడీ(1B) కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.

రూ.5 లక్షల వరకు పన్ను రహితం

ఎన్పీఎస్ ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నియంత్రిస్తుంది. పదవీ విరమణ సమయంలో ఎన్పీఎస్ చందాదారులు తమ ఖాతాల నుంచి పన్ను లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు పదవీ విరమణ చేసినప్పుడు ఎన్పీఎస్ కార్పస్ రూ. 5 లక్షల వరకు ఉంటే ఆ మొత్తానికి ఎలాంటి పన్ను విధించారు. అంతకంటే పెద్ద మొత్తాలకు కార్పస్‌లో 60% పన్ను లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌ లో పెట్టుబడి పెట్టొ్చ్చు. ఎన్పీఎస్ ఖాతాపై గత 15 ఏళ్లుగా 9% నుంచి 12% వార్షిక రాబడిని అందిస్తున్నారు.

5 కోట్ల కార్పస్

40 ఏళ్ల వ్యక్తి తాను పదవీ విరమణ తర్వాత రూ. 1 లక్ష పెన్షన్‌ను పొందేందుకు, 60 ఏళ్లలోపు ఎన్పీఎస్ కార్పస్ రూ. 5 కోట్లు అయ్యేందుకు నెలకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాలి. దీనిపై 12% వార్షిక రాబడి వస్తే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ మొత్తం కార్పస్ నుంచి మీరు రూ. 3 కోట్లను ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. 6% వార్షిక రాబడిని అందించే యాన్యుటీ ప్లాన్‌లో రూ. 2 కోట్లు పెట్టుబడిగా పెట్టవచ్చు.

ఎన్పీఎస్ ఎలా పని చేస్తుంది?

ఎన్పీఎస్ లో టైర్-1, టైర్-2 అనే రకాల ఖాతాలు ఉంటాయి. టైర్-2 ఖాతాను తెరవడానికి టైర్-1 ఖాతా తప్పనిసరి.

  • టైర్-1 అకౌంట్ : ఇది షరతులతో కూడిన విత్ డ్రా రిటైర్మెంట్ ఖాతా. ఇది ఎన్పీఎస్ కింద నిర్దేశించిన షరతులకు అనుగుణంగా మాత్రమే నగదు ఉపసంహరణ ఉంటుంది.
  • టైర్-2 అకౌంట్ : టైర్-1 ఖాతాదారునికి యాడ్-ఆన్‌గా అందుబాటులో ఉండే స్వచ్ఛంద సేవింగ్స్ అకౌంట్. సబ్‌స్క్రైబర్‌లు తమ సేవింగ్స్ వారికి అవసరం ఉన్నప్పుడు ఈ ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.

Disclaimer : ఈ ఆర్టికల్ మీ అవగాహన కోసమే అందిస్తున్నాము. ఇంటర్నెట్ ఆధారిత సమాచారంతో ఈ ఆర్టికల్ రాశాము. పెట్టుబడి అంశాలపై ముందుగా నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచన.

సంబంధిత కథనం