Naga Chaitanya Porsche : రూ. 3.5 కోట్లు పెట్టి పోర్షే కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్‌లో ఇదే ఫస్ట్!
Porsche 911 GT3 RS : టాలీవుడ్ హీరా నాగ చైతన్య.. పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ లగ్జరీ కారును కొన్నారు. ఈ వెహికిల్ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Naga Chaitanya Porsche 911 GT3 RS : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్యకు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం అందరికి తెలిసిందే. ఆయన గ్యారేజ్‌లో.. ఫెరారీ నుంచి బీఎండబ్ల్యూ వరకు ఎన్నో లగ్జరీ కార్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ లిస్ట్‌లోకి మరో కొత్త లగ్జరీ కారు చేరింది. అదే.. పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్. ఈ విషయాన్ని.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు నాగ చైతన్య.
పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్..
అక్కినేని నాగ చైతన్య కొత్తగా కొన్న ఈ పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్.. ఎక్స్‌షోరూం ధర రూ. 3.51 కోట్లు! సిల్వర్ కలర్‌ని ఆయన ఆప్ట్ చేసుకున్నారు. చెన్నై సెంట్రల్‌లోని పోర్షే డీలర్షిప్ షోరూమ్‌లో ఆయన ఈ లగ్జరీ వెహికిల్ తీసుకున్నారు.
"పోర్షే ఫ్యామిలీలోకి నాగ చైతన్యని ఆస్వానిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ని డెలివరీ చేయడం హ్యాపీగా ఉంది. రేస్ ట్రాక్‌లో, రేస్ ట్రాక్ బయట.. ఆయనకు ఈ కారుతో మంచి జ్ఞాపకాలు కలగాలని కోరుకుంటున్నాము," అని చెన్నై సెంట్రల్‌లోని పోర్షే డీలర్షిప్షోరూమ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ని షేర్ చేసింది.
Porsche 911 GT3 RS : పలు నివేదికల ప్రకారం.. నాగ చైతన్య కొన్న ఈ పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ కారు రిజిస్ట్రేషన్ మే 17న జరిగింది. హైదరాబాద్‌లో ఇదే తొలి పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ అని తెలుస్తోంది. ఇంతకు ముందు ఈ మోడల్ హైదరాబాద్ రోడ్లపై తిరగలేదు!
అంతేకాదు.. ఈ లగ్జరీ కారులో డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ రోడ్లపై కనిపించారు నాగ చైతన్య.
పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ ఫీచర్స్..
నాగ చైతన్య కొన్న ఈ పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ టాప్ స్పీడ్ 296 కేఎంపీహెచ్. 0-100 కేఎంపీహెచ్ని కేవలం 3.2 సెకన్లలో అందుకుంటుంది. ఈ లగ్జరీ కారులో పవర్ఫుల్ 3996 సీసీ, నేచురల్సీ ఆస్పిరేటెడ్, పెట్రోల్, 6 సిలిండర్ ఫ్లాట్, 4 వాల్వ్, డీఓహెచ్సీ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 518 బీహెచ్పీ పవర్‌ని, 465 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. మైలేజ్ మాత్ర 7.4కేఎంపీఎల్.
ఈ పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ పొడవు 4572ఎంఎం. వెడల్పు 1900ఎంఎం. ఎత్తు 1322ఎంఎం. వీల్‌బేస్ వచ్చేసి 2457ఎంఎం. కర్బ్ వెయిట్ 1450 కేజీలు.
Porsche 911 GT3 RS price in India : ఇక ఈ లగ్జరీ పోర్షే కారులో.. ఓవర్‌స్పీడ్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ లైట్ ఫ్లాషింగ్, పంచర్ రిపైర్ కిట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, 7 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
నాగ చైతన్య గ్యారేజ్..
పలు నివేదికల ప్రకారం.. నాగ చైతన్య దగ్గర ఉన్న ఫెరారీ 488జీటీబీ ధర రూ. 3.88 కోట్లు. బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ధర రూ. 1.30 కోట్లు. 2ఎక్స్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేగ్యూ ధర రూ. 1.8 కోట్లు. నిస్సాన్ జీటీ-ఆర్ ధర రూ. 2.12 కోట్లు. మెర్సిడీస్ బెంజ్ జెడ్ క్లాస్ జీ 63 ఏఎంజీ ధర రూ. 2.28 కోట్లు. ఎంవీ ఆగస్త్య ఎఫ్4 ధర రూ. 35లక్షలు. బీఎండబ్ల్యూ 9ఆర్టీ ధర రూ. 18.5 లక్షలు.
సంబంధిత కథనం