్రస్తుత కాలంలో ఆర్థిక నిర్వహణ అత్యంత ముఖ్యమైనది. చాలా మంది తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి, సంపదను పెంచుకోవడానికి క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం అని భావిస్తారు. వీటిలో పెట్టుబడికి ఆచరణీయమైన, దీర్ఘకాలిక మార్గం సిప్ పద్ధతి చాలా ముఖ్యమైనది. జీతాన్ని పెట్టుబడులకు ఎంత పెట్టాలి, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై చాలామందికి వివిధ ప్రశ్నలు తలెత్తుతాయి. సులభంగా, కొద్దికొద్దిగా పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం.
స్థిరమైన పెట్టుబడులు ఎటువంటి ప్రమాదం లేకుండా మం రాబడిని అందిస్తాయి. కొంతమంది ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలను ఎంచుకుంటారు, మరికొందరు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల వైపు చూస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్లు చిన్న చిన్న మెుత్తాలతో భవిష్యత్తులో మీకు మంచి రాబడని అందించే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ప్రజాదరణ పొందిన పద్ధతిగా మారింది. ఇందులో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందగలుగుతారు.
సిప్‌లో క్రమం తప్పకుండా నెలవారీ చెల్లింపులు చేయవచ్చు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పటికీ అది పెద్ద మొత్తంగా పెరిగే అవకాశం ఉంది. 10, 20, 30 సంవత్సరాలు పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో సంపదను కూడబెట్టుకోవచ్చు. ఇది పెట్టుబడి పెట్టడానికి సులభమైన, సురక్షితమైన మార్గం.
మీకు జీతం రూ.30 వేల వరకు ఉంటే నెలకు రూ.7 వేలు సిప్‌లో పెట్టుబడి పెట్టండి. 12 శాతం రాబడి అంచనాతో 30 ఏళ్లు ఇన్వెస్ట్ చేయండి. మొత్తం రూ. 2.47 కోట్లు అవుతుంది. ఇందులో మీ పెట్టుబడి రూ.25,20,000. అంచనా వేసిన రాబడి రూ.2,21,89,396. సిప్‌లు దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి.
ప్రారంభంలో చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. దానిని 10-20 సంవత్సరాలు కూడా కొనసాగించవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ప్రస్తుత ఆదాయం ఆధారంగా చిన్న ఆర్థిక స్థితితో భవిష్యత్తులో సంపదను కూడబెట్టుకోవచ్చు.
గమనిక : సిప్‌లు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి రాబడులను అందిస్తాయి. 12 శాతం కేవలం అంచనా మాత్రమే. ఇది పెరగవచ్చు, తగ్గవచ్చు.