Telugu News / Business /
Mutual Funds: గత మూడేళ్లలో 40 శాతం పైగా రిటర్న్స్ ఇచ్చిన మ్యుచ్యువల్ ఫండ్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం (Mint)
మార్కెట్లో ఉన్న మ్యుచ్యువల్ ఫండ్స్ లో ఆయా ఫండ్స్ పెట్టే పెట్టుబడులపై రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. గత మూడేళ్లలో వివిధ మ్యుచ్యువల్ ఫండ్స్ అందించిన లాభాలను ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సంస్థ అధ్యయనం చేసి, ఒక జాబితాను రూపొందించింది.
పెద్ద మొత్తంలో పెట్టుబడి లేకపోయినా, వీలైన సమయాల్లో వీలైనంత మొత్తాల్లో సిప్ (Systematic Investment Plan SIP) విధానం ద్వారా పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించేవి మ్యుచ్యువల్ ఫండ్స్. సిప్ ద్వారా పెట్టే పెట్టుబడులతో అటు ప్రిన్స్ పాల్ అమౌంట్, ఇటు రిటర్న్స్ పెరుగుతూ ఉంటాయి. ఆయా ఫండ్స్ గత మూడేళ్లలో అందించిన లాభాలను ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సంస్థ అధ్యయనం చేసి, ఒక జాబితాను రూపొందించింది.
ట్రెండింగ్ వార్తలు
మొత్తం 16 ఫండ్స్..
ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సంస్థ అధ్యయనం చేసి, రూపొందించిన జాబితా ప్రకారం మొత్తం 16 మ్యుచ్యువల్ ఫండ్స్ గత మూడేళ్లలో 40% పైగా రిటర్న్స్ ను అందించాయి. ఆ మ్యుచ్యువల్ ఫండ్స్, గత మూడేళ్లలో అవి అందించిన రిటర్న్స్ వివరాలు..
- క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ - 63.70%
- నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ - 50.60%
- హెచ్డీఎఫ్సీ స్మాల్ క్యాప్ ఫండ్ - 48.10%
- హెచ్ఎస్బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ - 47.60%
- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ - 47.50%
- టాటా స్మాల్ క్యాప్ ఫండ్ - 45.70%
- ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ - 45.60%
- ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ - 43.30%
- సుందరం స్మాల్ క్యాప్ ఫండ్ - 43.00%
- నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 - 42%
- మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ - 41.90%
- ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఫండ్ - 41.70%
- నిప్పన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ - 41.50%
- క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ - 41.30%
- మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ - 40.50%
- ఎస్బీఐ మాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ - 40.30 %