SIP Investment : నెలకు 3 వేల సిప్‌లో ఇన్వెస్ట్ చేసి కోటి రూపాయల వరకు పొందొచ్చు!
SIP Investment : సిప్‌లో పెట్టుబడి మంచి రాబడులు ఇస్తుంది. మీరు నెలకు మూడు వేలు ఇన్వెస్ట్ చేసినా 30 ఏళ్లలో ఊహించని రిటర్న్స్ వస్తాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌లో తక్కువ వయసు నుంచే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. మీకు ఓ వయసు వచ్చాక ఎవరి మీద ఆధారపడకుండా మీ డబ్బులతో మీరు ఎంజాయ్ చేయవచ్చు. కేవలం రూ. 3000తో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ప్రారంభించడం ద్వారా మీరు 30 ఏళ్ల తర్వాత కోటి రూపాయలపైనే సొంతం చేసుకోవచ్చు.

సంపాదన ఎవరైనా సంపాదిస్తారు.. కానీ సంపాదించని డబ్బును పొదుపు చేయడం చాలా కష్టమైన పని. డబ్బు ఆదా చేయడం వల్ల భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు భవిష్యత్తులో మంచి రాబడులు పొందుతారు. పదవీ విరమణ సమయంలో మీ మూలధనంపై మెరుగైన రాబడిని పొందాలనుకుంటే.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచి ఎంపిక. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వీలైనంత త్వరగా చేయాలని నిపుణులు అంటున్నారు.
ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం చిన్న వయస్సు నుండే ప్రారంభించాలి. మీ మొదటి ఉద్యోగం పొందిన వెంటనే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. నెలకు మూడు వెల రూపాయల పెట్టుబడితో మీరు మంచి రాబడి పొందవచ్చు. 12 శాతం రాబడి ఇచ్చే సిప్‌లో మీరు 30 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలపైన రిటర్న్ పొందుతారు. నెలకు మూడు వేల చొప్పున 30 ఏళ్లకు మీ ఇన్వెస్ట్‌మెంట్ 10 లక్షల 80 వేలు అవుతుంది. దీనిపై రిటర్న్ 95 లక్షలపైనే వస్తుంది. అంటే మెుత్తం మీరు కోటి రూపాయలపైనే తీసుకుంటారు.
మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే మీరు ఒకేసారి భారీ రాబడిని పొందుతారు. ఇదే మూడు వేలకు మీరు ప్రతి సంవత్సరం 10 శాతం ఇన్వెస్ట్ పెంచుతూ పోతే మరింత లాభాలు చూస్తారు. అంటే నెలకు 3000 రూపాయల పెట్టుబడితో ప్రారంభిస్తే వచ్చే ఏడాదిలో 300 రూపాయలు పెంచాలి. అంటే 3300 రూపాయలు చేయాలి. ఇలా ప్రతీ ఏడాది 10 శాతం పెంచుకుంటూ పోతే మరింత రాబడులు చూస్తారు.
గమనిక : మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. మార్కెట్ ఒడిదొడుకుల మీద ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే సమయంలో సరైనది ఎంచుకోవాలి.