SIP Investment : సిప్‌లో నెలకు కేవలం రూ.1500 పెడితే 30 ఏళ్లలో మీ రిటర్న్స్ 52 లక్షలపైనే!
SIP Investment : మంచి రాబడులు వచ్చేందుకు సిప్‌లు మంచి ఆప్షన్. చాలా మంది ఇందులో పెట్టుబడి పెడతారు. అయితే మీరు తక్కువ వయసులో ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా లాభాలు ఉంటాయి.
సిప్ అనేది మ్యూచువల్ ఫండ్స్ అందించే పెట్టుబడి పద్ధతి. ఇది ఏకమొత్తంలో కాకుండా నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంటే నెలకు కొంత చొప్పున ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్థిరమైన పెట్టుబడులపై మీరు అధిక వడ్డీ రేట్లు కూడా పొందుతారు. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వలన మీరు మంచి ఆదాయాన్ని చూస్తారు. ఇది మీ ఆర్థిక లక్ష్యాలకు సాయపడుతుంది.
ఉద్యోగులు, వ్యాపారులు వంటి ప్రతి వ్యక్తి తమ రిటైర్మెంట్ కోసం ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మిగతా లైఫ్ హ్యాపీగా ఉండవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు. సిప్‌లో అధిక మెుత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు తక్కువ పెట్టుబడితోనూ అధిక రాబడులు చూడవచ్చు. ఆందోళన లేకుండా పదవీ విరమణ తర్వాత ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఈ సిప్‌లలో నెలవారీ 1,500 పెట్టుబడి పెడితే 30 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చో చూద్దాం.. 52 లక్షలపైన కార్పస్‌ను నిర్మించడానికి మీరు కనీసం 30 సంవత్సరాల పాటు సిప్‌లో పెట్టుబడి పెట్టాలి.
నెలకు 1500 పెడితే ఎంత వస్తుంది?
నెలకు సిప్‌లో రూ. 1,500 పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి పెట్టినట్లయితే 30 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 5,40,000 అవుతుంది. దీని పైన మీరు సంవత్సరానికి 12 శాతం వడ్డీ అనుకుంటే.. లాభం రూ. 47,54,871 ఉంటుంది. ఇది 30 సంవత్సరాలలో మెుత్తం రూ.52,94,871 అవుతుందన్నమాట.
తక్కువ పెట్టుబడితో
సిప్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి. ఇందులో మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వాస్తవ ఆదాయం మారవచ్చు. అలాగే ఇది క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాట్లను కలిగి ఉంటుంది. SIPలో పెట్టుబడి ప్రారంభించడానికి మీకు పెద్ద మొత్తం అవసరం లేదు. నెలకు రూ. 500 కంటే తక్కువ సిప్‌లో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. పదవీ విరమణ, ఇల్లు కొనడం లేదా పిల్లల చదువుకు నిధులు సమకూర్చడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు సిప్‌లో ఉపయోగకరం.
గమనిక : సిప్ ఆదాయం స్టాక్ మార్కెట్ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు 12 శాతం కంటే ఎక్కువ లేదా తక్కువ కూడా రావొచ్చు. సరైనవి చూసి ఎంచుకుని ఇన్వెస్ట్ చేయాలి.