SIP Investment : మీరు సిప్‌లో నెలకు 500 పెడితే.. 5, 10, 15, 20, 25 ఏళ్లలో ఎంత అవుతుంది?-mutual funds sip investment invest 500 rupees monthly in sip check returns after 5 10 15 20 and 2 years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sip Investment : మీరు సిప్‌లో నెలకు 500 పెడితే.. 5, 10, 15, 20, 25 ఏళ్లలో ఎంత అవుతుంది?

SIP Investment : మీరు సిప్‌లో నెలకు 500 పెడితే.. 5, 10, 15, 20, 25 ఏళ్లలో ఎంత అవుతుంది?

Anand Sai HT Telugu Published Feb 16, 2025 08:10 AM IST
Anand Sai HT Telugu
Published Feb 16, 2025 08:10 AM IST

SIP Investment : సిప్‌లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి రాబడులు చూస్తారని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ సిప్ అనేవి మంచి వడ్డీ రేటును అందిస్తాయి. అయితే మీరు నెలకు రూ.500 పెట్టుబడి పెడితే కొన్నేళ్లలో ఎంత తీసుకుంటారు?

ప్రతీకాత్మత చిత్రం
ప్రతీకాత్మత చిత్రం

చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. భవిష్యత్తులో మంచి రాబడులను చూస్తారు. ఇటీవలి కాలంలో చాలా మంది యువత కూడా మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో వచ్చే రాబడి భవిష్యత్తు కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది.

తక్కువ మెుత్తం పెట్టుబడి పెట్టినా మంచి ఆదాయం కనిపిస్తుంది. అయితే దీర్ఘకాలంలో వీటి నుంచి రిటర్న్స్ బాగుంటాయి. సిప్ కూడా మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మీరు అనుకున్నదానికంటే ఎక్కువ రావొచ్చు లేదా తక్కువ కూడా రావొచ్చు. నెలకు రూ.500 పెట్టుబడి పెడితే.. 5, 10, 15, 20, 25 ఏళ్లలో ఎత అవుతుందో చూద్దాం. రాబడి సగటు 12 శాతంతో లెక్కిద్దాం..

5 ఏళ్లలో

మీరు 5 సంవత్సరాల వరకు నెలకు రూ. 500 చొప్పున పెట్టుబడి పెడితే మొత్తం రూ. 30,000 ఇన్వెస్ట్ చేస్తారు. 12 శాతం రేటుతో మీరు రూ. 11,243 రాబడిని పొందుతారు. అంటే 5 సంవత్సరాల తర్వాత మొత్తం రూ. 41,243 అవుతుంది.

10 ఏళ్లలో

ప్రతి నెలా రూ. 500 సిప్‌లో 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం రూ. 60,000 పెట్టుబడి పెట్టాలి. ఈ మీకు 12 శాతం రేటుతో వడ్డీగా రూ. 56,170 లభిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత మొత్తం రూ. 1,16,170 లభిస్తుంది.

15 ఏళ్లలో

15 సంవత్సరాలు నిరంతరం రూ. 500 సిప్ చేస్తే పెట్టుబడి రూ. 90,000 అవుతుంది. మీకు 12 శాతం చొప్పున రూ.1,62,288 వడ్డీ లభిస్తుంది. మొత్తం రూ.2,52,288 ఫండ్ రెడీ అవుతుంది.

20 ఏళ్లలో

మీరు సిప్‌లో 20 సంవత్సరాలు నిరంతరం రూ.500 పెట్టుబడి పెడితే.. మొత్తం పెట్టుబడి రూ.1,20,000 అవుతుంది. 12శాతం రేటుతో దాదాపు రూ.3,79,574 వడ్డీ లభిస్తుంది. 20 సంవత్సరాలలో మొత్తం రూ. 4,99,574 అవుతుంది.

25 ఏళ్లలో

25 సంవత్సరాలు సిప్ చేసి ప్రతి నెలా రూ. 500 పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ. 1,50,000 అవుతుంది. ఈ సందర్భంలో మీరు 12 శాతం రేటుతో వడ్డీగా రూ. 7,98,818 పొందుతారు. మెుత్తం రూ. 9,48,818 అవుతుంది.

గమనిక : మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లో రాబడి మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు వడ్డీ రేటు ఎక్కువ రావొచ్చు, మరికొన్నిసార్లు తక్కువ రావొచ్చు. అన్నింటికీ సిద్ధమై సిప్‌లో పెట్టుబడి పెట్టాలి.

Anand Sai

eMail
Whats_app_banner

సంబంధిత కథనం