SIP Investment : నెలకు రూ.11 వేలు సిప్‌లో పెడితే 20 ఏళ్లలో కోటి రూపాయలపైనే మీరు అందుకోవచ్చు
SIP Investment : మ్యూచువల్ ఫండ్స్ సిప్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న పెట్టుబడి పద్ధతి. మీరు నెలకు 11 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి 20 ఏళ్లలో కోటిపైనే తీసుకొవచ్చు. దీనితోపాటు మరికొన్ని సిప్ క్యాలిక్యూలేషన్స్ చూద్దాం..
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇందులో మీరు తక్కువ మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు, మంచి రాబడిని పొందవచ్చు. ఎక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే సిప్ ప్రయోజనాలు కూడా అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలిక పెట్టుబడి అత్యధిక రాబడిని ఇస్తుంది. 20 ఏళ్లపాటు నెలకు 11 వేలు సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుంటే.. 12 శాతం వడ్డీతో మెుత్తం ఎంత అవుతుందో చూద్దాం..

నెలకు రూ.11 వేలు పెడితే
మీరు సిప్‌పై 12 శాతం వడ్డీని పొందుతున్నారని అనుకుందాం. అటువంటి పరిస్థితిలో మీరు నెలవారీ రూ. 11,000 సిప్ చేస్తే.. 20 సంవత్సరాలలో కోటి రూపాయల వరకు మెుత్తం అవుతుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రూ.26,40,000. మీకు వచ్చే రాబడి రూ.83,50,627. మెుత్తం కలిపి 20 ఏళ్లలో రూ.1,09,90,627 అవుతుంది.
ఇతర క్యాలిక్యూలేషన్స్
అదేవిధంగా నెలవారీ రూ.20,000 పెట్టుబడి పెడితే 12 శాతం వడ్డీతో 15 ఏళ్లలో అదే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నెలవారీ సిప్‌ని రూ. 25,000కి పెంచుకుంటే 12 శాతం వడ్డీతో కేవలం 14 సంవత్సరాలలో రూ. 1 కోటిపైనే పొందవచ్చు. అంతేకాకుండా నెలవారీ రూ. 50,000 పెట్టుబడితో కేవలం 10 సంవత్సరాలలో రూ.1,16,16,954 కూడబెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్థిరమైన రాబడికి హామీ ఇవ్వవని గమనించాలి. మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఈ రాబడి మారవచ్చు.
మార్కెట్ ట్రెండ్ ఫాలో కావాలి
ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, ఆర్థిక సలహాదారుని సంప్రదించాలి. మీ ఆర్థిక పరిస్థితి, నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్‌ల గురించి తెలుసుకోవడం కూడా పెట్టుబడికి సహాయపడుతుంది.
గమనిక : ఈ కథనంలో 12 శాతం వడ్డీ రేటుతో సిప్ మెుత్తం నిధి గురించి చెప్పాం. మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు తగ్గవచ్చు, పెరగవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గుల మీద ఇది ఆధారపడి ఉంటుంది.