పదవీ విరమణ తర్వాత హ్యాపీగా జీవించాలనుకుంటే.. మీరు పని చేస్తున్నప్పుడు కొంత మొత్తాన్ని ఆదా చేయడం చాలా అవసరం. మీ పొదుపు పథకం దీర్ఘకాలంలో మీకు ప్రయోజనం చేకూర్చేదిగా ప్లాన్ చేయాలి. అలాంటి ప్రణాళికలు ఉంటే మీరు భవిష్యత్తులో హాయిగా బతకొచ్చు. వృద్ధాప్యం కారణంగా ఇంట్లో ఉన్నప్పుడు అవసరమైన ఖర్చులకు ఉపయోగపడతాయి.
పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసుకునే వారు సిప్ ప్లాన్‌ను పరిగణించవచ్చు. సిప్ ప్లాన్ అనేది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రణాళిక. ఈ పథకంలో పెట్టుబడిదారులు వారి సామర్థ్యం ప్రకారం నెలవారీగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టినప్పుడు మీరు చక్రవడ్డీ ద్వారా అధిక రాబడిని పొందవచ్చు. సిప్ ప్లాన్‌లో రూ.3 కోట్లు, రూ.4 కోట్లు, రూ.5 కోట్ల పదవీ విరమణ ఆదాయం కోసం ఎలా ఆదా చేయాలో చూద్దాం.
రూ.3 కోట్లు సంపాదించాలనుకుంటే మీరు రూ.15,000 సిప్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలి. మీరు దీన్ని 27 సంవత్సరాలు నిరంతరం చేయాలి. 27 సంవత్సరాల తర్వాత మీరు మొత్తం రూ. 48,60,000 పెట్టుబడి పెడతారు. 12 శాతం వార్షిక రాబడిని పొందితే మీకు రూ. 2,75,74,694 వడ్డీ లభిస్తుంది. వడ్డీ, పెట్టుబడితో సహా మీరు రూ.3,24,34,694 పొందవచ్చు.
రూ.4 కోట్లు సంపాదించాలనుకుంటే రూ.15,000 సిప్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలి. వరుసగా 29 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. 29 సంవత్సరాల తర్వాత మొత్తం రూ. 52,20,000 పెట్టుబడి అవుతుంది. మీరు 12 శాతం వార్షిక రాబడిని పొందితే.. మీకు రూ.3,58,72,054 వడ్డీ లభిస్తుంది. వడ్డీ, పెట్టుబడితో రూ.4,10,92,054 వస్తాయి.
రూ.5 కోట్లు సంపాదించాలనుకుంటే నెలకు రూ.15,000 పెట్టుబడి పెట్టాలి. 31 సంవత్సరాల తర్వాత మొత్తం రూ.55,80,000 పెట్టుబడి పెడతారు. 12 శాతం వార్షిక రాబడిని పొందితే.. రూ. 4,63,71,847 వడ్డీ లభిస్తుంది. వడ్డీ, పెట్టుబడితో 5,19,51,847 అవుతాయి.
గమనిక : 12 శాతం రాబడి అనేది కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మీరు ఎంచుకునే మ్యూచువల్ ఫండ్‌ను బట్టి మీ రాబడి మారుతుంది.