Mutual funds: ఈ మ్యుచ్యువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు రిస్క్ తక్కువ; రిటర్న్స్ ఎక్కువ-mutual funds best performing large cap schemes to invest now ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Mutual Funds: Best-performing Large-cap Schemes To Invest Now

Mutual funds: ఈ మ్యుచ్యువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు రిస్క్ తక్కువ; రిటర్న్స్ ఎక్కువ

HT Telugu Desk HT Telugu
May 19, 2023 02:17 PM IST

Mutual funds: తక్కువ రిస్క్ తో మంచి రిటర్న్స్ ఇచ్చే మ్యుచ్యువల్ ఫండ్స్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఈ కింద పేర్కొన్న ఆరు లార్జ్ క్యాప్ మ్యుచ్యువల్ ఫండ్స్ లో క్రమం తప్పని పెట్టుబడులతో మంచి రాబడులను రాబట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (iStock)

Mutual funds investment: సాధారణంగా లార్జ్ క్యాప్ మ్యుచ్యువల్ ఫండ్స్ (large cap mutual funds) లో, మిగతా ఈక్విటీ ఫండ్స్ తో పోలిస్తే, రిస్క్ తక్కువగా ఉంటుంది. కచ్చితమైన రిటర్న్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఫండ్స్ రిలయన్స్ వంటి పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెడ్తాయి. తక్కువ రిస్క్, దీర్ఘకాలిక వృద్ధి కోరుకునే వారు ఈ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. సెబీ నిబంధనల ప్రకారం లార్జ్ క్యాప్ మ్యుచ్యువల్ ఫండ్స్ (large cap mutual funds) తమ నిధుల్లో కనీసం 80% లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలి.

ట్రెండింగ్ వార్తలు

Mutual funds: ఇవి బెస్ట్ లార్జ్ క్యాప్ మ్యుచ్యువల్ ఫండ్స్

షేర్ ఇండియా (Share India) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి సింగ్ ఈ కింద పేర్కొన్న మూడు లార్జ్ క్యాప్ మ్యుచ్యువల్ ఫండ్స్ (large cap mutual funds) లో పెట్టుబడులు మంచి రిటర్న్స్ ను అందిస్తాయని సూచిస్తున్నారు. అవి

  • నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ (Nippon India Large Cap Fund) - ఇది వార్షికంగా 17% రిటర్న్ అందిస్తుంది.
  • ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ (SBI Bluechip Fund) - ఇది వార్షికంగా 15.22% రిటర్న్ అందిస్తుంది.
  • కెనెరా రొబెకొ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ (Canara Robeco Bluechip Equity Fund) - ఈ ఫండ్ కూడా 15.22% వార్షిక రిటర్న్ ను అందిస్తుంది.

Mutual funds: ఇవి కూడా బెస్ట్

మై ఫండ్ బజార్ సీఈఓ వినీత్ ఖండారే మూడు లార్జ్ క్యాప్ మ్యుచ్యువల్ ఫండ్స్ (large cap mutual funds) ను సూచిస్తున్నారు. అవి

  • హెచ్డీఎఫ్సీ ఇండెక్స్ నిఫ్టీ 50 ఫండ్ (HDFC Index Nifty 50 Fund)
  • నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ (Nippon India Large Cap Fund)
  • ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ (Aditya Birla Sun Life Frontline Equity Fund)

Mutual funds: వీటినీ పరిశీలించవచ్చు..

లార్జ్ క్యాప్ ఫండ్స్ (large cap mutual funds) లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ఇండెక్స్ ఫండ్స్ సరైన ఎంపిక అని పెట్టుబడులు, పన్ను వ్యవహారాల నిపుణుడు బల్వంత్ జైన్ సూచిస్తున్నారు. ఇందుకు గానూ యూటీఐ నిఫ్టీ 50 (UTI Nifty 50) ఫండ్ ను ఆయన సూచిస్తున్నారు.

Mutual funds: బెస్ట్ లార్జ్ క్యాప్ మ్యుచ్యువల్ ఫండ్స్

Nippon India Large Cap Fund: నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్

ఇది గత 15 ఏళ్లుగా మార్కెట్లో ఉంది. ఈ ఫండ్ ను 2007 ఆగస్ట్ లో లాంచ్ చేశారు. నాటి నుంచి సగటున 11.76% వార్షిక రిటర్న్ ను ఈ ఫండ్ అందిస్తోంది. ఈ ఫండ్ ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ వంటి స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టింది.

SBI Bluechip Fund: ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్

ఈ ఫండ్ ను 2006 ఫిబ్రవరి లో ప్రారంభించారు. నాటి నుంచి ఈ ఫండ్ 11.55% వార్షిక రిటర్న్ ను అందిస్తోంది. ఈ ఫండ్ కూడా ఎల్ అండ్ టీ, ఐటీసీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, రిలయన్స్ తదితర కంపెనీల్లో పెట్టుబడులు పెడ్తుంది.

Canara Robeco Bluechip Equity Fund: కెనెరా రొబెకొ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్

2010లో ఈ ఫండ్ ను ప్రారంభించారు. ఈ ఫండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐటీసీ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.

Aditya Birla Sun Life Frontline Equity Fund: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్

ఈ ఫండ్ గత 20 ఏళ్లుగా మార్కెట్లో ఉంది. ఈ ఫండ్ ను 2002 ఆగస్ట్ లో ప్రారంభించారు. లాంచ్ చేసిన నాటి నుంచి ఈ ఫండ్ 10.7% వార్షిక రిటర్న్ ను అందిస్తోంది.

HDFC Index Nifty 50 Fund: హెచ్డీఎఫ్సీ ఇండెక్స్ నిఫ్టీ 50

అత్యధిక రిటర్న్ ఇస్తున్న లార్జ్ క్యాప్ మ్యుచ్యువల్ ఫండ్ ఇది. దీన్ని 2002 జులైలో ప్రారంభించారు. నాటి నుంచి సగటున వార్షికంగా రిటర్న్ అందిస్తోంది. ఈ ఫండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెడ్తుంది.

  • సూచన: ఈ పెట్టుబడులు మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయి. పైన పేర్కొన్న సూచనలు నిపుణులు సూచించినవి మాత్రమే. ఇన్వెస్టర్లు స్వంతంగా నిర్ణయం తీసుకోవడం సముచితం.

WhatsApp channel