SIP Investment : నెలకు కేవలం రూ.500 సిప్‌లో పెట్టుబడి పెట్టి లక్షాధికారి కావొచ్చు.. ఈ క్యాలిక్యూలేషన్ చూడండి
Mutual Funds SIP Investment : సిప్‌లో పెట్టుబడి పెట్టే ట్రెండ్ ఇటీవలి కాలంలో పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్లపాటు నెలకు కేవలం రూ.500 పెట్టుబడి పెడితే ఎంత వస్తుందని సిప్ క్యాలిక్యూలేషన్ చూద్దాం..
సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇందులో ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయెుచ్చు. నిజానికి మధ్యతరగతివారు ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు భయపడుతారు. అలాంటివారు తక్కువ పెట్టుబడితో కూడా లక్షల రాబడులను చూడవచ్చు. స్టాక్ మార్కెట్ సూచీలు, మ్యూచువల్ ఫండ్స్ గత పనితీరు ఆధారంగా 12 శాతం రాబడిని ఇస్తున్నాయని లెక్కలు వేసుకుంటే.. 30 ఏళ్ల పాటు ప్రతి నెలా 500 రూపాయలు పెట్టుబడి పెడితే ఎంత డబ్బు వస్తుందో, 20 ఏళ్ల పాటు ప్రతి నెలా 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత డబ్బు వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
రూ.500 పెట్టుబడి
ఏడాదికి 12 శాతం లాభం వచ్చే స్కీమ్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుందాం. 30 ఏళ్లు అంటే 360 నెలలకు మీ పెట్టుబడి రూ.1.8 లక్షలు అవుతుంది. కానీ 30 ఏళ్లు పూర్తయ్యేసరికి మీకు లాభం. రూ.15.84 లక్షలు. అంటే మొత్తం రూ.17.65 లక్షలు అవుతుంది. కేవలం నెలకు రూ.500 పెట్టుబడితో ఈ మెుత్తం పొందవచ్చు.
రూ.1000 పెట్టుబడి
సంవత్సరానికి 12 శాతం లాభం ఇచ్చే పథకంలో పెట్టుబడి పెడితే 20 సంవత్సరాలకు అంటే 240 నెలలకు మీ పెట్టుబడి రూ.2.4 లక్షలు అవుతుంది. 20 సంవత్సరాల చివరిలో రూ.7.59 లక్షల లాభం వస్తుంది. అంటే మొత్తం రూ.9.99 లక్షలు అవుతుంది.
రూ.5000 పెట్టుబడి
సంవత్సరానికి 12 శాతం లాభం వచ్చే పథకంలో పెట్టుబడి పెడితే, మీరు 10 సంవత్సరాలకు అంటే 120 నెలలకు చేసే పెట్టుబడి 6 లక్షల రూపాయలు అవుతుంది. 10 సంవత్సరాల ముగింపులో మీకు వచ్చే లాభం 5.62 లక్షలు. మొత్తం 11.61 లక్షల రూపాయలు పొందుతారు.
రూ.10000 పెట్టుబడి
5 సంవత్సరాలకు అంటే 60 నెలలకు మీ పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత చివరలో మీ లాభం రూ.2.24 లక్షలకు కొంచెం పైన వస్తుంది. మొత్తంగా మీరు రూ8,24,864 లక్షలు పొందుతారు.
చూశారా.. సిప్‌లో తక్కువ పెట్టుబడి పెట్టినా.. లాంగ్ టర్మ్‌లో ఎక్కువ రాబడులను పొందవచ్చు. నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేసి లక్షల్లో డబ్బులు పొందవచ్చు. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మెుత్తం పెట్టుబడి పెట్టినా.. మీరు తక్కువే పొందుతారు. అందుకే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చిన్న వయసులోనే తక్కువ పెట్టుబడితో ప్రారంభించినా ఎక్కువ లాభం ఉంటుంది.
గమనిక : మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చే రాబడి మారుతూ ఉండవచ్చు. మేం 12 శాతం రాబడుల లెక్కలతో కథనం ఇచ్చాం. భవిష్యత్తులో రాబడి ఎక్కువ రావొచ్చు, తక్కువ రావొచ్చు.